STOCKS

News


మిడ్‌క్యాప్స్‌లో 10 ఆణిముత్యాలు..

Thursday 22nd November 2018
Markets_main1542882618.png-22312

ఆగస్టులో నమోదైన గరిష్టస్థాయి నుంచి సెన్సెక్స్‌ 9 శాతం పడిపోయింది. ఇదే సమయంలో.. అధిక విలువల కలిగిన, ద్రవ్య లభ్యత సమస్యను ఎదుర్కొంటున్నటువంటి, ముడివస్తువుల పెరుగుదలను తట్టుకోలేదని అనేక మిడ్‌క్యాప్‌ షేర్లు 10-40 శాతం వరకు పతనమయ్యాయి. అయితే, వీటిలోనే పలు కంపెనీలు మాత్రం రానున్న రోజుల్లో మంచి రాబడిని అందించే అవకాశం ఉందని మోతీలాల్‌ ఓస్వాల్ సూచిస్తోంది. 52-వారాల గరిష్టస్థాయి నుంచి 40 శాతం వరకు పడిపోయిన జాబితాలో 10 నాణ్యమైన షేర్లను ఎంపిక చేసిన ఈ బ్రోకింగ్‌ సంస్థ.. వీటిలో పెట్టుబడి ద్వారా వచ్చే 12 నెలల్లో 10-90 శాతం వరకు రాబడిని పొందవచ్చని విశ్లేషించింది. అవేంటంటే..

  • మారికో షేరుకు రూ.390 టార్గెట్‌ ధరను ఇచ్చింది. ప్రస్తుత స్థాయి నుంచి 13 శాతం పెరగవచ్చని సూచిస్తోంది. 2020 అంచనా ఈపీఎస్‌ 8.8 వద్ద వెల్లడించింది. 
  • శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ రూ.1,400 టార్గెట్‌ ధరను ఇచ్చింది. షేరు ఇప్పుడున్న ధర నుంచి 13 శాతం పెరగవచ్చని సూచిస్తోంది. 2020 ఈపీఎస్‌ అంచనా 127.9 వద్ద అంచనాకట్టింది.
  • ఆర్‌బీఎల్‌ బ్యాంక్ షేరుకు రూ.600 టార్గెట్‌ ధరను ప్రకటించింది. 8 శాతం పెరిగేందుకు అవకాశం ఉన్నట్లు విశ్లేషించింది. 2020 ఈపీఎస్‌ అంచనా 28.6 వద్ద అంచనావేసింది.
  • ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేరుకు రూ.304 టార్గెట్‌ ధరను ఇచ్చింది. ప్రస్తుత స్థాయి నుంచి 23 శాతం పెరగవచ్చని అంచనావేసింది. 2020 ఈపీఎస్‌ అంచనా 11.8గా తెలిపింది.
  • టాటా కెమికల్స్ షేరుకు రూ.933 టార్గెట్‌ ధరను వెల్లడించింది. 34 శాతం పెరగవచ్చని సూచిస్తోంది. 2020 అంచనా ఈపీఎస్‌ 54.4 వద్ద వెల్లడించింది. 
  • జేఎస్‌పీఎల్ షేరుకు రూ.336 టార్గెట్‌ ధరను ఇచ్చింది. ప్రస్తుత స్థాయి నుంచి 92 శాతం పెరగవచ్చని సూచిస్తోంది. 
  • ఒబెరాయ్ రియాల్టీ షేరుకు రూ.574 టార్గెట్‌ ధరను ఇచ్చింది. 39 శాతం పెరగవచ్చని అంచనా. 2020 అంచనా ఈపీఎస్‌ 36.9 వద్ద వెల్లడించింది.
  • మైండ్‌ట్రీ షేరుకు రూ.1,125 టార్గెట్‌ ధరను ఇచ్చింది. ప్రస్తుత స్థాయి నుంచి 34 శాతం పెరగవచ్చని సూచిస్తోంది. 2020 అంచనా ఈపీఎస్‌ 58.7 వద్ద వెల్లడించింది.
  • సీజీ కన్స్యూమర్ షేరుకు రూ.260 టార్గెట్‌ ధరను ఇచ్చింది. 27 శాతం పెరగవచ్చని అంచనా. 2020 అంచనా ఈపీఎస్‌ 7.4 వద్ద వెల్లడించింది.
  • టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ షేరుకు రూ.3,500 టార్గెట్‌ ధరను ఇచ్చింది. ప్రస్తుత స్థాయి నుంచి 27 శాతం పెరగవచ్చని సూచిస్తోంది. 2020 అంచనా ఈపీఎస్‌ 98.9 వద్ద వెల్లడించింది.



You may be interested

ఇండియన్‌ హోటల్స్‌ టార్గెట్‌ రూ.163

Thursday 22nd November 2018

ముంబై: ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ షేరు ధర గురువారం ఒకదశలో 9 శాతం లాభపడింది. ఇంట్రాడేలో రూ.143 వద్ద గరిష్టస్థాయిని తాకింది. మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.3.45 (2.56 శాతం) లాభపడి రూ.138 వద్ద ముగిసింది. ఈ స్థాయి నుంచి షేరు ధర 20 శాతం మేర పెరిగేందుకు అవకాశం ఉందని మోతీలాల్‌ ఓస్వాల్ తన అంచనాను వెల్లడించింది. హోటల్‌ పరిశ్రమ ఆక్యుపెన్సీ 67 శాతానికి చేరుకుని తగిన

1శాతం నష్టపోయిన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌

Thursday 22nd November 2018

బ్యాంకింగ్‌ నష్టాలతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో ఒకశాతం పతనమైంది. నేడు బ్యాంకు నేడు 26,233ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో  1శాతం వరకు నష్టపోయి 26,060 వద్దకు పతనమైంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ షేర్ల పతనం బ్యాంక్‌ను దెబ్బతీసింది. మధ్యాహ్నం 3:00లకు బ్యాంక్‌ నిఫ్టీ గత ముగింపు(26262.05)తో పోలిస్తే 185.25 పాయింట్ల నష్టంతో 26,076.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సూచీలో అత్యధికంగా ఫెడరల్‌

Most from this category