STOCKS

News


 మార్చి సిరీస్‌లో నిఫ్టీకి 10,700 మంచి మద్దతు

Monday 4th March 2019
Markets_main1551683644.png-24420

మార్చి డెరివేటివ్‌ సిరీస్‌లో నిఫ్టీకి 10,700 పాయింట్ల స్థాయి మంచి మద్దతుగా నిలుస్తుందన్న అంచనాల్ని ఐసీఐసీఐ డెరివేటివ్‌ హెడ్‌ అమిత్‌ గుప్తా వెల్లడించారు. మార్చి సిరీస్‌ కేవలం 14.2 మిలియన్‌ షేర్లతో (రోలోవర్స్‌) మొదలయ్యిందని, గత మూడేళ్లలో కొత్త సిరీస్‌ ఇంత తక్కువ రోలోవర్స్‌తో మొదలుకావడం ఇదే ప్రధమమని, కనిష్ట ఓపెన్‌ ఇంట్రస్ట్‌ కారణంగానే ఇటీవల మార్కెట్‌ కదకలికల శ్రేణి పరిమితంగా వుందని ఆయన వివరించారు. అయితే రోలోవర్‌ స్ప్రెడ్‌ (ఫ్యూచర్స్‌ ప్రీమియం) మాత్రం గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంత అధికంగా 65 పాయింట్లకు చేరిందన్నారు. షార్ట్‌ రోలోవర్స్‌ తక్కువగా వున్నందునే స్ప్రెడ్‌ పెరిగిందన్నారు. సూచీలు పరిమితశ్రేణి నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత ఓపెన్‌ ఇంట్రస్ట్‌ పెరగవచ్చని అంచనావేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సిరీస్‌లో 10,700–10,750 పాయింట్ల శ్రేణి నిఫ్టీ గట్టి మద్దతునివ్వవచ్చని అంచనావేస్తున్నామన్నారు. అలాగే ఈ సిరీస్‌ 10,700 స్ట్రయిక్‌ వద్ద అధిక పుట్‌ బేస్, 11,000 స్ట్రయిక్‌ వద్ద అధిక కాల్‌బేస్‌తో మొదలయ్యిందని, అలాగే 11,000 స్ట్రయిక్‌ వద్ద కాల్స్‌కంటే 10,700 స్ట్రయిక్స్‌ వద్ద పుట్స్‌ అధికంగా పోగయ్యాయని, ఈ డేటా కూడా ప్రస్తుత సిరీస్‌లో 10,700 పాయింట్ల స్థాయి మద్దతుగా నిలిచే సంకేతాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. 
ఆటో షేర్లలో షార్ట్‌ రోలోవర్స్‌...
ఇక హెవీవెయిట్‌ షేర్ల విషయానికొస్తే ఆటోమొబైల్‌ షేర్లలో షార్ట్‌ రోలోవర్స్‌ ఎక్కువగా జరిగాయని, కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకుల్లో లాంగ్‌ పొజిషన్లు కన్పిస్తున్నాయని గుప్తా చెప్పారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, ఎఫ్‌ఎంసీజీ షేర్లు తక్కువ ఓపెన్‌ ఇంట్రస్ట్‌తో సిరీస్‌ను ప్రారంభించాయన్నారు. 

27,200 సమీపంలో బ్యాంక్‌ నిఫ్టీ కన్సాలిడేషన్‌..
మార్చి సిరీస్‌లో తక్కువ ఓపెన్‌ ఇంట్రస్ట్‌తో మొదలైన బ్యాంక్‌ నిఫ్టీలో రోలోవర్‌ స్ప్రెడ్‌ మాత్రం రెండేళ్ల గరిష్టస్థాయి 180 పాయింట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో సహా కొన్ని ప్రైవేటు బ్యాంకింగ్‌ కౌంటర్లలో గతవారం లాభాల స్వీకరణ జరగ్గా, వారంలో చివరిరోజున ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ కౌంటర్లలో షార్ట్‌ కవరింగ్‌ చోటుచేసుకుందని ఆయన వివరించారు. పొజిషన్లు తక్కువగా వున్నందున బ్యాంక్‌ నిఫ్టీ 26,800 పాయింట్ల స్థాయిలో మద్దతు పొందవచ్చని, అధిక స్ప్రెడ్‌ ఫలితంగా ర్యాలీకి అవకాశాలు తక్కువని, 27,200 పాయింట్ల స్థాయికి అటూఇటూగా కన్సిలిడేషన్‌ జరగవచ్చన్న అంచనాల్ని ఆయన వ్యక్తంచేశారు. 



You may be interested

10,700–10,800 శ్రేణికి తగ్గుదల.. కొనుగోళ్లకు అవకాశం

Monday 4th March 2019

సమీప భవిష్యత్తులో నిఫ్టీ 10,700–10,800 శ్రేణికి తగ్గితే కొనుగోళ్లకు అవకాశమని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ రాజేష్‌ పాల్వియా అభిప్రాయపడ్డారు. 11,000, 11,200 స్ట్రయిక్స్‌ వద్ద అధిక కాల్‌ బిల్డప్, 10,700, 10,600 స్ట్రయిక్స్‌ వద్ద అధిక పుట్‌ బిల్డప్‌ వుందని, ఈ కారణంగా ఆయా స్థాయిలు మార్చి సిరీస్‌లో నిరోధాలు, మద్దతులుగా వుంటాయని అంచనావేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలి కరెక్షన్‌లో నిఫ్టీ 10–12 వారాల స్లోపింగ్‌ ట్రెండ్‌లైన్, మల్టీపుల్‌

భారీ నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 4th March 2019

భారత్‌ - పాక్‌ సరిహద్దులో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రతరం కావడంతో విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌సీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం భారీ నష్టాలతో  10,842.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 10917.05 పాయింట్లతో పోలిస్తే 75పాయింట్ల నష్టంతో ఉంది. ఇక భారత్ - పాక్‌ల మధ్య సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. నేటి ఉదయం గం.3:00లకు అక్నూర్‌ సెక్టార్‌లో భారత సైనిక శిబిరాలను లక్ష్యంగా

Most from this category