STOCKS

News


10700-10800 పాయింట్ల శ్రేణి కీలక మద్దతు

Wednesday 16th January 2019
Markets_main1547616430.png-23611

మరోమారు నిఫ్టీ కీలకమైన 10870 పాయింట్లను దాటి బలంగా క్లోజయింది. నిఫ్టీ 200 రోజుల డీఎంఏ స్థాయికి పైన ముగియడం పాజిటివ్‌ అంశమని ఎస్‌ఎంసీ గ్లోబల్‌ పేర్కొంది. బుధవారం నిఫ్టీ 10900 పాయింట్లకు అటుఇటుగా కదలాడుతోంది. డెరివేటివ్స్‌ గణాంకాలు పరిశీలిస్తే 10700, 10800 పాయింట్ల వద్ద పుట్‌ రైటింగ్‌, 11000 పాయింట్ల వద్ద కాల్‌ అన్‌వైండింగ్‌ కనిపిస్తోంది. అందువల్ల స్వల్పకాలానికి నిఫ్టీకి 10700- 10800 పాయింట్లు కీలక మద్దతు స్థాయిలుగా నిలుస్తాయని బ్రోకరింగ్‌ సంస్థ తెలిపింది. అధిక ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ ఉన్న 11000 పాయింట్ల వద్ద కాల్‌ అన్‌వైండింగ్‌ జరగడంతో నిఫ్టీ మరింత ముందుకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతోందని తెలిపింది. నిఫ్టీ క్రమంగా 11000 పాయింట్లను చేరి పైన బలంగా క్లోజయితే పాజిటివ్‌ ట్రెండ్‌ ఆరంభమైనట్లేనని తెలిపింది. ఆపైన 11200- 11300 పాయింట్ల వరకు నిఫ్టీ పరుగు ఉండొచ్చని అంచనా వేసింది. ట్రేడర్లు లాంగ్స్‌కు 10700 పాయింట్ల స్టాప్‌లాస్‌తో జాగ్రత్తగా ట్రేడ్‌ చేయాలని సూచించింది. 



You may be interested

స్థిరంగా పసిడి ధర

Wednesday 16th January 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. బ్రెగ్జిట్‌ ఆందోళనలు, కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ యధాతథ పాలసీ అంచనాలు పసిడికి అండగా నిలుస్తున్నాయి. ఫలితంగా ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి స్వల్పంగా 1డాలరు లాభపడి 1,289.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో బ్రిటన్‌ కొనసాగాలా... లేదా (బ్రెగ్జిట్‌)అనే అంశంపై బ్రిటన్‌ పార్లమెంట్‌లో చారిత్రక ఓటింగ్‌ జరిగింది. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 423 ఓట్లు రాగా, అనుకూలంగా

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 16th January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇండోరమా సింథటిక్స్‌:- కంపెనీ ప్రధాన ప్రమోటర్లకు ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.361 కోట్లను నిధుల సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇండియా నెదర్లాండ్‌ బీవీ కంపెనీకి ప్రతి షేరు ధర రూ.36 చొప్పున మొత్తం 8.30 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.299 కోట్లను సమీకరించనుంది. అలాగే సియామ్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ ప్రతి షేరు ధర రూ.36 చొప్పున

Most from this category