STOCKS

News


ఎమర్జింగ్‌ ఈటీఎఫ్‌లకు పావెల్ బూస్ట్‌

Friday 30th November 2018
Markets_main1543559802.png-22520

అభివృద్ది చెందుతున్న దేశాల ఈక్విటీ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌)లకు బిలియర్‌ డాలర్‌ (దాదాపు రూ.7,000 కోట్లు) పెట్టుబడులను అందించిన అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్య.

అమెరికా వడ్డీ రేట్లు చారిత్రక ప్రమాణాల కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని ఆదేశ సెం‍ట్రల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పావెల్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎమర్జింగ్స్‌ మార్కెట్‌ ఈటీఎఫ్‌ బుధవారం భారీ పెట్టుబడులను అందుకుంది. ఒక్కరోజులోనే బిలియర్‌ డాలర్ల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. ఈక్రమంలో అభివృద్ది చెందుతున్న దేశాల ఈటీఎఫ్‌లలోనే రెండవ అతిపెద్దగా ఉన్నటువంటి ఐషేర్స్‌ కోర్ ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈటీఎఫ్‌ మరోసారి 50 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాపిటలైషన్‌కు ఎగబాకింది. జూన్‌ తరువాత ఈస్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. ఇక ఈ ఫండ్‌కు చౌకైన ప్రత్యామ్నాయంగా బ్లాక్‌రాక్‌ ఇంక్‌ 2012లో ప్రారంభించిన ఐఈఎంజీ ఈ నెలలో 2.3 బిలియన్‌ డార్లను ఇన్‌ఫ్లోను నమోదుచేయగా.. ఈ ఈటీఎఫ్‌ బుధవారం ఒక్కరోజులోనే ఏకంగా 2.4 శాతం పెరిగింది. 


 



You may be interested

డిసెంబర్‌ సిరీస్‌కు షార్ట్‌ రోలోవర్స్‌..

Friday 30th November 2018

ఎన్నికల ఫలితాల ప్రభావమంటున్న విశ్లేషకులు ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ జోరు మీదుంది. ఐదో రోజు లాభాల్లోనే ట్రేడవుతోంది. అయితే ట్రేడర్లు వారి షార్ట్‌ పొజిషన్లను నవంబర్‌ నుంచి డిసెంబర్‌ సిరీస్‌కు ఫార్వర్డ్‌ చేసుకున్నారు. డిసెంబర్‌లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలు ఇందుకు ప్రధాన కారణం కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్స్‌ రోలోవర్‌ 82 శాతంగా ఉంది. గత మూడు సిరీస్‌ల సగటు 81 శాతం కన్నా ఇది స్వల్పంగా ఎక్కువ

వెలుగులోకి అటో షేర్లు

Friday 30th November 2018

మార్కెట్‌ ర్యాలిలో భాగంగా గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో అటోరంగ షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఎన్‌ఎస్‌ఈలోని అటోరంగ షేర్లకు ప్రాతనిథ్యం వహిస్తున్న నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో 1శాతం లాభపడింది. ఉదయం 10:20నిల.కు ఇండెక్స్‌ 0.75శాతం లాభపడి 9,270.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎంఅండ్‌ఎం షేరు 3శాతం లాభపడి అటో ఇండెక్స్‌లో అగ్రస్థానంలో కొనసాగడమే కాక, నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో  ద్వితీయ స్థానంలో

Most from this category