News


ఆనంద్‌రాఠి వ్యాల్యు పిక్‌: పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ

Saturday 22nd December 2018
Markets_main1545468974.png-23174

 ప్రముఖ బ్రోకరజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి
స్టాక్‌: పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.223
టార్గెట్‌ ప్రైస్‌: రూ.269

ఆనంద్‌రాఠి.. పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీపై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే 12 నెలల కాలంలో స్టాక్‌ ధర రూ.269కే చేరొచ్చని అంచనా వేసింది. ‘ఇండియన్‌ ఎనర్జీ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న కంపెనీ పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ. అలాగే ఇది దేశంలోని తొలి, అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ టర్మినల్‌ ఆపరేటర్‌’ అని పేర్కొంది. గెయిల్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఐఓసీ వంటి సంస్థలు ఈ కంపెనీకి ప్రమోటర్లుగా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుత క్యూ2లో కంపెనీ ఆదాయం 38 శాతం మేర ఎగసిందని పేర్కొంది. అయితే అధిక వ్యయాల వల్ల మార్జిన్లు తగ్గాయని తెలిపింది. కంపెనీ కార్యకలాపాల విస్తరణ, సామర్థ్యం పెంపు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించిందని పేర్కొంది. రానున్న కాలంలో కంపెనీ నిర్వహణ పనితీరు మెరుగుపడొచ్చని తెలిపింది. అందువల్ల లాభదాయకత పెరగొచ్చని అంచనా వేసింది.   

కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1545468983PLNG_Initiating_Dec18.pdf)

You may be interested

వచ్చే ఏడాది మార్కెట్లను నడిపించనున్న అంశాలివే

Sunday 23rd December 2018

2018 స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు ఊహించని అనుభవాలను మిగిల్చింది. ఈ ఏడాది ఎక్కువగా ఆటుపోట్లతో సాగింది. ఈక్విటీ రిటైల్‌ ఇన్వెస్టర్లలో ఎక్కువ మందికి నష్టాలు ఎదురైన సంవత్సరం, స్మాల్‌, మిడ్‌క్యాప్‌ విభాగాలు భారీ నష్టాలు మిగిల్చాయి. మరి 2019 సం‍వత్సరంలో మార్కెట్లు ఎలా ఉంటాయి? వీటిపై ప్రభావం చూపించే అంశాలు ఏవన్న ఆసక్తి ఉండడం సహజం. దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారో చూద్దాం...   రాజకీయ అంశాలు ‘‘కేంద్రంలోని బీజేపీ సర్కారుకు 2019లో అసలు పరీక్ష

హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్‌ పిక్‌.. ‘ఇంటర్నేషనల్‌ పేపర్స్‌ ఏపీపీఎం’

Saturday 22nd December 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఈ వారం స్టాక్‌ పిక్‌గా ఇంటర్నేషనల్‌ పేపర్స్‌ ఏపీపీఎంను సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం... స్టాక్‌: ఇంటర్నేషనల్‌ పేపర్స్‌ ఏపీపీఏం ఇండస్ట్రీ: పేపర్‌, పేపర్‌ ప్రొడక్ట్స్‌ ప్రస్తుత ధర: రూ.461 రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌: రూ.519- 566 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఇంటర్నేషనల్‌ పేపర్‌ ఏపీపీఎంపై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే 3-4 త్రైమాసికాల్లో స్టాక్‌ ధర రూ.519-566 స్థాయికి చేరొచ్చని అంచనా వేస్తోంది.

Most from this category