News


వ్యాల్యు పిక్‌: హెచ్‌యూఎల్‌

Friday 7th December 2018
Markets_main1544167118.png-22728

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఎఫ్‌ఎంసీజీ దిగ్గజమైన హిందుస్తాన్‌ యూనిలివర్‌ (హెచ్‌యూఎల్‌) స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. 

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి
స్టాక్‌: హెచ్‌యూఎల్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.1,808
టార్గెట్‌ ప్రైస్‌: రూ.2,250

ఆనంద్‌రాఠి.. హెచ్‌యూఎల్‌పై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే 12 నెలల కాలంలో హెచ్‌యూఎల్‌ షేరు ధర రూ.2,250 స్థాయికి పెరగొచ్చని అంచనా వేసింది. హెచ్‌యూఎల్‌ దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీ అని పేర్కొంది. ప్రతి పది కుటుంబాల్లో తొమ్మిది కుటుంబాలు సంస్థ ప్రొడక్టలను నిత్యం ఉపయోగిస్తున్నాయని తెలిపింది. డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియో (హోమ్‌ కేర్‌, పర్సనల్‌ కేర్‌, ఫుడ్స్‌, రిఫ్రెష్‌మెంట్‌ వంటి విభాగాలు) సానుకూల అంశమని పేర్కొంది. బలమైన డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ మరొక పాజిటివ్‌ అంశమని తెలిపింది. ప్రస్తుత క్యూ2లో కంపెనీ మంచి ఆర్థిక ఫలితాలను నమోదు చేసిందని పేర్కొంది. మధ్యస్థం నుంచి దీర్ఘకాలంలో కంపెనీ మంచి పనితీరు కనబర్చవచ్చని అంచనా వేసింది. ఎన్నికలు, కమోడిటీ ధరలు తక్కువగా ఉండటం, ఆమోదయోగ్యకరమైన ఎక్స్చేంజ్‌ రేట్లు, కనీస మద్దతు ధర పెంపు వంటి అంశాలు కంపెనీ విక్రయాలపై సానుకూల ప్రభావం చూపుతాయని పేర్కొంది. జీఎస్‌కే కన్సూమర్‌ బిజినెస్‌ కొనుగోలుతో హెచ్‌యూఎల్‌.. హెల్త్‌ డ్రింక్‌ విభాగంలోకి కూడా ఎంట్రీ ఇస్తోందని తెలిపింది. రూ.2,250 టార్గెట్‌ ప్రైస్‌తో హెచ్‌యూఎల్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. కాగా హెచ్‌యూఎల్‌ పోర్ట్‌ఫోలియోలో లక్స్‌, లైఫ్‌బాయ్‌, సర్ఫెక్సెల్‌, రిన్‌, వీల్‌, ఫెయిల్‌ అండ్‌ లవ్లీ, పాండ్స్‌, లేక్‌మి, డవ్‌, క్లినిక్‌ ప్లస్‌, సన్‌సిల్క్‌, క్లోజప్‌, బ్రూక్‌బాండ్‌, కిసాన్‌, క్వాలిటీ వాల్‌, పెప్సొడెంట్‌ వంటి పలు దిగ్గజ బ్రాండ్లు ఉన్నాయి. 

కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1544167154HUVR_Initiating_Dec18.pdf)

You may be interested

ఒడిదుడుకుల మార్కెట్‌లో ప్రయాణం ఎలా..?

Friday 7th December 2018

ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధిక స్థాయి ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలపై ఇన్వెస్టర్లు పూర్తి దృష్టిసారించగా.. మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొందని ఒపినియన్‌ పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో స్పష్టమైన మెజర్టీ ఉండగా.. రాజస్థాన్‌లో ఓటమి అవకాశాలు

కోటక్‌ బ్యాంక్‌లో బఫెట్‌ పెట్టుబడి

Friday 7th December 2018

14శాతం ర్యాలీ చేసిన షేరు ప్రైవేటు రంగ కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకు షేరు శుక్రవారం 14శాతం ర్యాలీ చేసింది. వారెన్‌ బఫెట్‌ కంపెనీ బెర్కషైర్ హాత్వే కోటక్‌ బ్యాంక్‌లో 10శాతం వాటాను కోనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వెలువడం ఇందుకు కారణమైంది. సుమారు 4మిలియన్‌ డాలర్ల నుంచి 6మిలియన్‌ డాలర్ల మధ్యలో ఈ మొత్తం వాటాను బెర్కషైర్ హాత్వే కొనుగోలు చేయవచ్చని తెలుస్తుంది. ప్రమోటర్‌ నుంచి కొనుగోలు చేయడం ద్వారా లేదా

Most from this category