STOCKS

News


ఆనంద్‌ రాఠి సూచించిన వాల్యూ పిక్‌ ఇదే

Saturday 5th January 2019
news_main1546682540.png-23422

ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలు తయారు చేసే హావెల్స్ ఇండియా షేరుకు ప్రముఖ రేటింగ్ సంస్థ ఆనంద్ రాఠి బుల్లిష్ రేటింగ్‌ను కేటాయించింది. విద్యుత్ స‌ర‌ఫ‌రా ప‌రిక‌రాల త‌యారీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న హావెల్స్ షేరుకు బ‌ల‌మైన ఫండ‌మెంటల్‌తో కంపెనీ ధీర్ఘకాలంలో అత్యున్నత స్థితికి చేరుంద‌ని బ్రోక‌రేజ్ సంస్థ చెప్పుకొచ్చింది.  కంపెనీ షేరు టార్గెట్ ధ‌రను రూ.788లకు పెంచింది. షేరుపై బ్రోక‌రేజ్ సంస్థ మ‌రింత‌ విశ్లేష‌ణ‌ను ఇప్పుడు చూద్దాం...
1). ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సర‌పు రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 23శాతం పెరిగి రూ.21,909 మిలియ‌న్ల ఆర్జించింది. నిక‌రలాభం 4శాతం పెరిగి రూ.1,786 మిలియ‌న్లుగా నమోదైంది. ఫారెక్స్ మార్కెట్లో క‌రెన్సీ ఒడిదుడుకుల ప్రభావం కొంతమేర ప‌డిన‌ప్పటికీ.., మిగితా కీల‌క రంగాల‌న్నీ చ‌క్కటి ప్రద‌ర్శన క‌న‌బ‌రిచాయి.
2). వాషింగ్ మెష‌న్స్, రిఫ్రిజిరేట‌ర్స్, రూమ‌ర్ ఏసీ, టి.వి. విభాగాల్లో అమ్మకాల వృద్ధిని రెట్టింపు చేసుకునేందుకు సాంకేతిక‌త‌ను ఉప‌యోగిచుకోనుంది. అందులో భాగంగా ఆన్‌లైన్ వ్యాపారం చేసే సంస్థల‌తో కంపెనీ భాగ‌స్వామ్య ఒప్పందాల‌ను కుదుర్చుకుంటుంది.
3). వ‌చ్చే త్రైమాసికంలో కేబుల్, వైర్ వ్యాపారంలో మార్జిన్లు 15శాతం నుంచి 17శాతానికి పెరుగుతుంద‌ని యాజ‌మాన్యం అంచ‌నా వేస్తుంది.
4). వచ్చే ఐదేళ్లలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
5). జీఎస్టీ అమ‌ల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యుద్ధీక‌ర‌ణ‌, నిర్మాణ‌, గృహోప‌ర‌క‌ర‌ణ వినియోగ అంశాల‌పై దృష్టి పెట్టడంతో రానున్న రోజుల్లో క‌న్జ్యూమ‌ర్ డ్యూర‌బుల్ ఇండ‌స్ట్రీలో మ‌రింత ధ‌న ప్రవాహం జ‌ర‌గ‌డం హావెల్స్ కలిసొస్తుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.
6). హావెల్స్ వ్యాపారంలో భాగ‌మైన 8500 డీల‌ర్లు, ల‌క్ష మంది రీటైలర్లు మెట్రో, టైర్‌-1, టైర్‌-2 ప‌ట్ట‌ణాలో వ్యాపారాభివృద్దికి తోడ్పాటును అందిస్తున్నారు.

(హావెల్స్ ఇండియా షేరు కోట‌క్ బ్రోక‌రేజ్ సంస్థ స‌మ‌గ్ర విశ్లేష‌ణ కొర‌కు కింద లింక్‌ను ఓపెన్ చేయ‌గ‌ల‌రు.)

View Pdf One (1546682629HAVL _IN_Initiating_Jan19.pdf)

You may be interested

ఇ- వాలెట్‌ మోసాలకు కస్టమర్‌ బాధ్యుడు కాడు!

Saturday 5th January 2019

మూడురోజుల్లోపు ఫిర్యాదు చేయాలి ఆర్‌బీఐ ఆదేశాలు ప్రీపెయిడ్‌ వాలెట్లను వినియోగించే కస్టమర్లు మోసానికి గురైతే వారు మూడు రోజుల్లోపు సదరు మోసాన్ని గురించి ఫిర్యాదు చేయాలని, అప్పుడు సదరు మోసానికి సంబంధించి కస్టమర్లకు ఎలాంటి బాధ్యత ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. జరిగిన మోసానికి అటు కంపెనీ, ఇటు కస్టమర్‌కు సంబంధం లేకుంటే మూడు రోజుల లోపు ఫిర్యాదుచేసిన కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. ఇంతవరకు బ్యాంకు మోసాలకు సంబంధించి ఇలాంటి

టైమ్ టెక్నోప్లాస్ట్ కొనవచ్చు: కోట‌క్ సెక్యూరిటీస్‌

Saturday 5th January 2019

ప్యాకేజింగ్ రంగ‌ంలో పాతికేళ్లుగా సేవ‌లు అందిస్తున్న టైమ్ టెక్నోప్లాస్ట్ షేరును కొనమ‌ని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోట‌క్ సెక్యూరిటీస్ సూచిస్తుంది. టైమ్ టెక్నోప్లాస్ట్ షేరుపై కోట‌క్ విశ్లేష‌ణ‌లు ఎలా  ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..! విశ్లేష‌ణ‌:- ముడి స‌ర‌కు ధ‌రల‌ మార్జిన్లు పెర‌గ‌డంతో ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరం రెండో త్రైమాసికంలోటైమ్ టెక్నోప్లాస్ట్ కంపెనీ బ‌ల‌హీన ఆర్థిక గ‌ణాంకాలకు న‌మోదు చేసింది. అయితే, గ‌త కొన్నివారాలుగా ప్రధాన ముడి సరుకైన హై డెన్షిటీ పాలిథిలిన్ ధ‌ర‌లు

Most from this category