STOCKS

News


వ్యాల్యు పిక్‌: ఏసియన్‌ పెయింట్స్‌

Saturday 6th October 2018
Markets_main1538814425.png-20923

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఏసియన్‌ పెయింట్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. 

స్టాక్‌: ఏసియన్‌ పెయింట్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.1,209
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,471

ఆనంద్‌రాఠి.. ఏసియన్‌ పెయింట్స్‌పై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే ఏడాది కాలానికి గానూ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,471గా నిర్ణయించింది. ‘దేశీ పెయింట్‌ కంపెనీల్లో ఏసియన్‌ పెయింట్స్‌ దిగ్గజ కంపెనీ. ఆసియాలో మూడో అతిపెద్ద పెయింట్‌ కంపెనీ. గ్రూప్‌ టర్నోవర్‌ రూ.16,900 కోట్లుగా ఉంది. 16 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 25 పెయింట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కేంద్రాలున్నాయి. గ్రూప్‌కు ఏసియన్‌ పెయింట్స్‌ మాత్రమే కాకుండా బెర్జర్‌ ఇంటర్నేషనల్‌, అప్కో కోటింగ్స్‌, ఎస్‌సీఐబీ పెయింట్స్‌, కడిస్కో వంటి పలు అనుబంధ సంస్థలున్నాయి’ అని వివరించింది. మంచి మేనేజ్‌మెంట్‌, సరికొత్త మార్కెటింగ్‌ వ్యూహాలు, సమర్థవంతమైన మ్యానుఫ్యాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ విభాగాలు సానుకూల అంశాలని పేర్కొంది. కంపెనీ ప్రధానంగా డెకొరేటివ్‌ పెయింట్స్‌, ఇంటర్నేషనల్‌ పెయింట్స్‌, ఇండస్ట్రీయల్‌ పెయింట్స్‌ & కోటింగ్స్‌ అండ్‌ హోమ్‌ విభాగాల్లో సేవలందిస్తోందని తెలిపింది. గత క్యూ1లో కంపెనీ రెవెన్యూలో 15 శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొంది. క్రూడ్‌ ధరల పెరుగుదల రిస్క్‌ అంశమని తెలిపింది. కంపెనీ భవిష్యత్‌ వృద్ధి అంచనాలు బాగున్నాయని పేర్కొంది. బలమైన డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌, మార్కెట్‌లో బ్రాండ్‌ పొజిషన్‌ వంటివి పాజిటివ్‌ అంశాలని తెలిపింది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1538814470APNT_Initiating_Oct_18.pdf)

You may be interested

స్మార్ట్‌ఫోన్స్‌పై అదిరే అఫర్లివే..

Saturday 6th October 2018

మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీలు వాటి స్మార్ట్‌ఫోన్లపై మెగా డిస్కౌంట్‌ను ప్రకటించాయి. అక్టోబర్‌ 11న ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్‌లో ధరలను 62 శాతం వరకు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నాయి.  ► దిగ్గజ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ శాంసంగ్‌ తన గెలాక్సీ ఎస్‌8పై రూ.20,000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇది రూ.29,990కి లభ్యం కానుంది. ప్రస్తుతం దీని ధర రూ.45,990గా ఉంది. కాగా కంపెనీ ఈ మోడల్‌ను రూ.49,990 ధరతో

డిష్‌మాన్ కార్బోజెన్ అమ్‌సిస్ కొనచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

Saturday 6th October 2018

ముంబై:- ప్రముఖ రేటింగ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఔషద ఉత్పత్తుల కంపెనీ డిష్‌మాన్ కార్బోజెన్ అమ్‌సిస్ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది.  గతేడాదిలో డిష్‌మ్యాన్ ఫార్మా సంస్థ డిష్‌మాన్ కార్బోజెన్ అమ్‌సిస్ పేరుతో రీ లిస్టింగ్ అయింది. గత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఫలితాలను సాధించడంతో పాటు, రానున్న రోజుల్లో తన వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకోవడానికి కంపెనీ రూపొందించుకున్న చక్కటి ప్రణాళికలు షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడానికి కారణమైనట్లు హెచ్‌డీఎఫ్‌సీ

Most from this category