STOCKS

News


మస్టేక్‌ షేరు కొనవచ్చు: ఆనంద్‌ రాఠి

Saturday 20th April 2019
Markets_main1555756821.png-25249

ఐటీ రంగంలో సేవలు అందించే మధ్యస్థాయి కంపెనీ మస్టేక్‌ షేరును కొనవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సం‍స్థ ఆనంద్‌రాఠీ సిఫార్సు చేస్తుంది. 
షేరు:-
మస్టేక్‌ 
రేటింగ్‌:- బై
టార్గెట్‌ ధర:- రూ.670లు
విశ్లేషణ:- గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం క్వార్టర్‌ టు క్వార్టర్‌ 1.7శాతం పెరిగి రూ.262 కోట్లుగా నమోదైంది. ఎబిటా క్వార్టర్‌ టు క్వార్టర్‌ 13.2శాతం పెరిగింది. దీర్ఘకాలిక ప్రాజెక్టుల పూర్తి చేయడంలో విఫలమడంతో పాటు పాటు యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అనిశ్చితి కారణంగా బ్రిటన్‌ నుంచి రావాల్సిన ఆదాయాలు ఆశించిన స్థాయిలో రాలేదు. బ్రిటన్‌ ప్రభుత్వం నుంచి భారీ కాంట్రాక్టులను దక్కించుకునే అవకాశం ఉన్నందున్న ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ బ్రిటన్‌ నుంచి 15-20 శాతం ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా నుంచి కూడా ఆదాయాలు ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ, కంపెనీ చేపట్టిన పునర్నిర్మాణ చర్యలు ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన ఫలితాలను సాధించవచ్చు. 

View Pdf One (1555756866MAST_CU_170419.pdf)

You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం 23శాతం అప్‌

Saturday 20th April 2019

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ. 5,885.12 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. విశ్లేషకుల అంచనా రూ.5,805 కోట్ల కన్నా ఇది ఎక్కువ. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరం క్యు4లో కంపెనీ ఆర్జించిన రూ.4,799.28 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 23శాతం అధికం. సగటు ఆస్తుల వృ‍ద్ధి 19.8శాతం పెరగగా, నికర వడ్డీ

మేలో మేజర్‌ స్పీడ్‌బ్రేకర్‌?!

Saturday 20th April 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లు డౌన్‌ట్రెండ్‌కు చెక్‌ పెట్టి మరలా పైకి ఎగిశాయి. ఈ వారం సరికొత్త ఆల్‌టైమ్‌హైని తాకాయి. అయితే వారం చివర్లో ప్రాఫిట్‌ బుకింగ్‌ నమోదయింది. ఎన్నికల అస్పష్టత, వరుస సెలవల నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లు తగ్గించుకున్నారు. ప్రస్తుతం 11800 పాయింట్ల వద్ద భారీ పుట్‌రైటింగ్‌ పరిశీలిస్తే స్వల్ప అప్‌మూవ్‌కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రైమరీ మార్కెట్లో మళ్లీ ఐపీఓల హవా ఆరంభమైంది. ఇవన్నీ మార్కెట్లో పాజిటివ్‌

Most from this category