STOCKS

News


ఫార్మా ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Wednesday 24th October 2018
news_main1540360137.png-21423

సాధారణంగా కరెక‌్షన్‌ సమయంలో రక్షణాత్మక రంగాలకు చెందిన షేర్లపై ఇన్వెస్టర్లు ఆధారపడుతుంటారు. ఇలాంటి రక్షణాత్మక రంగాల్లో ఫార్మా రంగం కీలకమైనది. ఫార్మారంగం స్టాక్‌మార్కెట్‌ పతన సమయాల్లో మంచిదే కానీ దీంట్లో సైతం మంచి చెడు ఉన్నాయి. సెప్టెంబర్‌ ఫలితాల సీజన్‌ సందర్భంగా ఫార్మా రంగంపై సమీక్ష...
- నిఫ్టీ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం 0.17 శాతం రాబడినివ్వగా ఫార్మా సూచీ ఈ ఏడాది ఇంతవరకు 0.77 శాతం మేర లాభాల్లో ఉంది. మెర్క్‌, వలియంట్‌ ఆర్గానిక్స్‌, ఆల్బర్ట్‌ డేవిడ్‌, కిలిట్చ్‌ డ్రగ్స్‌ షేర్లు ఈ సంవత్సరంలో 60- 125 శాతం వరకు ర్యాలీ జరిపాయి. ఇదే సమయంలో బాగా తెలిసిన కంపెనీలు సన్‌ఫార్మా, ఇప్కాల్యాబ్స్‌, అరబిందో, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌, బయోకాన్‌, దివిస్‌, ఫైజర్‌, అబాట్‌ ఇండియా షేర్లు కేవలం 3- 30 శాతం మాత్రమే లాభాలు చూశాయి. మరోవైపు ఇదే కాలంలో ఆర్కిడ్‌ ఫార్మా, మంగళం డ్రగ్స్‌, అవాన్‌ లైఫ్‌సైన్సెస్‌, మోరెపెన్‌ల్యాబ్‌, ఇండొకొ రెమిడీస్‌, అజంతా ఫార్మా, లౌరస్‌ల్యాబ్స్‌, కాడిలా హెల్త్‌కేర్‌ షేర్లు 12- 70 శాతం పతనమయ్యాయి. 
ఫలితాలపై అంచనాలు
- క్యు2 సీజన్‌ ఆరంభమవుతున్న ఈ సమయంలో బ్రోకరేజ్‌లు ఫార్మా షేర్లపై అప్రమత్తంగా మారాయి. యూఎస్‌ మార్కెట్లో ధరల ఒత్తిడి, దేశీయ వ్యాపారంలో స్తబ్దత, ముడిపదార్ధాల ధరల పెరుగుదల తదితర అంశాల కారణంగా ఫార్మా కంపెనీలు క్యు2లో బలహీన ఫలితాలు ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నాయి. గత రెండేళ్లలో పలు ఫార్మా స్టాకులు డీరేటింగ్‌ అయ్యాయి. అందువల్ల ఇటీవల కాస్త ర్యాలీ జరిపినా చాలా స్టాకులు తమ దీర్ఘకాలిక సరాసరి విలువకు దగ్గరగానే ఉన్నాయి. 
- డౌన్‌గ్రేడ్‌ భయాలు ఇంకా వీడనప్పటికీ కొన్ని నాణ్యమైన ఫార్మా స్టాకులు ఆకర్షణీయంగానే ఉన్నాయని షేర్‌ఖాన్‌ అభిప్రాయపడుతోంది. ఐడీబీఐ క్యాపిటల్‌ సైతం ఇదే అంచనా వెలుబుచ్చింది. యూస్‌ కన్నా దేశీయ వ్యాపారంపై ఎక్కువ ఫోకస్‌ ఉన్న కంపెనీలను ఎంచుకోవడం మంచిదని సూచించింది. చైనాలో సరఫరా తలనొప్పుల కారణంగా ఆ దేశంపై ఏపీఐలు, ఇంటర్‌మీడియరీల కోసం ఆధారపడే ఫార్మా కంపెనీల మార్జిన్లు దెబ్బతినవచ్చని తెలిపింది. అధిక బేస్‌ ఎఫెక్ట్‌ కారణంగా దేశీయ విక్రయాలు సైతం తక్కువగా ఉండొచ్చని ప్రభుదాస్‌ లీలాధర్‌ సంస్థ అంచనా వేసింది. దేశీయ ఫార్ములేషన్‌ మార్కెట్లో తలనొప్పులు కొనసాగుతాయని తెలిపింది. రూపీ క్షీణత, యూఎస్‌లో కొత్త లాంచింగ్‌ల కారణంగా ఎగుమతుల్లో కొంత వృద్ధి ఉండొచ్చని పేర్కొంది. 
- సిప్లా, డిష్మన్‌ కార్బొజెన్‌ ఏమిక్స్‌ షేర్లపై పాజిటివ్‌గా మెర్క్‌ ఇండియాపై నెగిటివ్‌గా ఉన్నట్లు ఐడీబీఐ క్యాపిటల్‌ తెలిపింది. అరబిందో, ఎరిక్‌ లైఫ్‌సైన్సెస్‌, ఇప్కాల్యాబ్స్‌ను ప్రభుదాస్‌ లీలాధర్‌, బయోకాన్‌, దివీస్‌, సన్‌ఫార్మా షేర్లను షేర్‌ఖాన్‌ సిఫార్సు చేస్తున్నాయి. You may be interested

1 శాతం తగ్గిన టీవీఎస్‌ మోటార్‌ లాభం

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ:  టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 1 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.216 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.211 కోట్లకు తగ్గిందని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తెలిపింది.మొత్తం ఆదాయం రూ.4,098 కోట్ల నుంచి రూ.4,994 కోట్లకు పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈఓ కె.ఎన్‌.రాధాకృష్ణన్‌ చెప్పారు. ఈ క్యూ2లో ఎగుమతులతో సహా మొత్తం అమ్మకాలు 14 శాతం

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లాభం రూ. 2,540 కోట్లు

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: దేశీ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.2,540 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం రూ.2,188 కోట్లతో పోలిస్తే 16 శాతం వృద్ధి సాధించామని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన చూస్తే, నికర లాభం 6 శాతం పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈఓ సి. విజయ్‌కుమార్‌

Most from this category