STOCKS

News


స్టార్‌ సిమెంట్‌ కొనొచ్చు..

Friday 10th August 2018
Markets_main1533883387.png-19116

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి
స్టాక్‌: స్టార్‌ సిమెంట్‌
ఇండస్ట్రీ: సిమెంట్‌
ప్రస్తుత ధర: రూ.114
టార్గెట్‌ ప్రైస్‌: రూ.160

బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి.. స్టాక్‌ సిమెంట్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తోంది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.160గా నిర్ణయించింది. సరుకు, విద్యుత్‌, ఇంధన వ్యయాల హేతుబద్దీకరణ సహా విక్రయాల్లో పెరుగుదల, పనితీరు మెరుగుపడటం వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. స్టార్‌ సిమెంట్‌కు మంచి బ్రాండ్‌ పేరు ఉందని, మార్కెట్‌లో 23 శాతం వాటాను ఆక్రమించిందని తెలిపింది. సామర్థ్యం పెంపు అనుకూల అంశమని పేర్కొంది. 2017-18 నుంచి 2019-2020 మధ్యకాలంలో ఈబీటా 11 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. విక్రయాల వృద్ధి, డెట్‌ తగ్గింపు చర్యల నేపథ్యంలో స్టార్‌ సిమెంట్‌కు బై రేటింగ్‌ ఇస్తున్నట్లు వివరించింది.  

కంపెనీ వివరాలు, పనితీరు వంటి ఇతరత్రా సమాచారం కోసం కింది లింక్‌పై క్లిక్‌ చేయండి....

View Pdf One (1533883401STRCEM_CU_270718.pdf)

You may be interested

మెజెస్కోపై బుల్లిష్‌

Friday 10th August 2018

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: మెజెస్కో ఇండస్ట్రీ: టెక్నాలజీ ప్రస్తుత ధర: రూ.500 టార్గెట్‌ ప్రైస్‌: రూ.575 ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి టెక్నాలజీ సంస్థ మెజెస్కోపై బుల్లిష్‌గా ఉంది. కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తోంది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.575గా నిర్ణయించింది. కరెన్సీ మారక విలువ తగ్గుదల, స్థిర వ్యయాలు వల్ల కంపెనీ మార్జిన్లు బాగుంగొచ్చని అంచనా వేస్తోంది. కంపెనీ ఆదాయం స్థిరంగా ఉందని పేర్కొంది. మెజెస్కో ఇటీవల కాలంలో క్లౌడ్‌ సర్వీసులకు అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. మెట్‌లైఫ్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌ 10 శాతం డౌన్‌

Friday 10th August 2018

ముంబై:- తొలి త్రైమాసిక ఫలితాల ప్రకటన వాయిదా పడటంతో శుక్రవారం జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. నేడు బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు రూ.271.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీ ఆగస్ట్‌ 09న (నిన్న) నిర్వహించిన బోర్డు సమావేశంలో త్రైమాసిక ఫలితాల విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఆడిట్‌ ప్యానల్‌ కూడా ఫలితాల ప్రకటనకు నిరాకరించడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 10శాతం వరకు

Most from this category