STOCKS

News


దశాబ్దం కాలం తరువాత భారీ లాభాలు

Thursday 8th November 2018
Markets_main1541662510.png-21790

దాదాపు దశాబ్దం కాలం తరువాత ముహూరత్ ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఈ ఏడాది సంవత్‌ 2075 ప్రారంభపు రోజు జరిగిన ముహూరత్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 245 పాయింట్లు(0.70 శాతం) లాభపడి 35,237 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల (0.65శాతం) లాభంతో 10,598 వద్ద ముగిసింది. 2008 దీపావళి(సంవత్‌ 2065) ముహూరత్‌ ట్రేడింగ్‌ తర్వాత అంటే దాదాపు దశాబ్ధం తరువాత సూచీలు గత ఇంత భారీ ఎత్తున లాభపడటం ఇదే తొలిసారి. సంవత్‌ 2065 సంవత్సరంలో సెన్సెక్స్‌ సూచీ 5.86శాతం పెరిగింది. నిఫ్టీ సూచీ 6.3శాతం ర్యాలీ చేసింది. ప్రపంచమార్కెట్లు ర్యాలీని అందుపుచ్చకున్న భారత స్టాక్‌ సూచీలు దీపావళి సందర్భంగా బుధవారం సాయంత్రం గంటపాటు నిర్వహించిన ముహూరత్‌ ట్రేడింగ్‌లో భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 312 పాయింట్ల లాభంతో 35,302 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 10600 పైన 10,614.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ సమయంలో అటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఐటీ షేర్ల స్థిరమైన ర్యాలీతో ప్రధాన సూచీలు ఆరంభలాభాలను నిలుపుకోగలిగాయి. గడచిన సంవత్‌ 2074 ఏడాదిలో సెన్సెక్స్‌ సూచి 2,407 పాయింట్లు (7 శాతం)ను ఆర్జించగా, నిఫ్టీ సూచి 319 పాయింట్లు(3 శాతం)ను సాధించింది.



You may be interested

ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌పై ఆనంద్‌రాఠి బుల్లిష్‌

Thursday 8th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.187 టార్గెట్‌ ప్రైస్‌: రూ.239 ఆనంద్‌రాఠి.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌పై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. బై రేటింగ్‌ను కొనసాగించింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.239గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత

సంవత్ 2075 ర్యాలీకి ఈ షేర్లు రెడీ..!

Thursday 8th November 2018

ముంబై: దీపావళి సందర్భంగా పలు దిగ్గజ బ్రోకింగ్‌ సంస్థలు మరింత ర్యాలీ చేయడానికి సిద్ధంగా ఉన్న షేర్లను సిఫార్సు చేస్తున్నాయి. సంవత్ 2075(ఈ ఏడాది దీపావళి నుంచి వచ్చే ఏడాది దీపావళి మధ్య సమయం)లో ఇన్వస్టర్లు ఈ షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి రాబడిని అందుకోవచ్చని ఆయా బ్రోకింగ్‌ సంస్థల అనలిస్టులు సూచిస్తున్నారు. ఈ జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. డైమెన్షన్స్‌ కార్పొరేట్ ఫైనాన్స్ సర్వీసెస్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్ శ్రీవాత్సవ

Most from this category