STOCKS

News


రేట్ల కోతకు అవకాశం: కోటక్‌ ఈక్విటీస్‌

Saturday 15th December 2018
Markets_main1544815206.png-22944

సానుకూల స్థూల ఆర్థిక డేటా కారణంగా సమీప భవిష్యత్తులో కీలక రేట్లను ఆర్‌బీఐ తగ్గించేందుకు అవకాశం ఉందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ పేర్కొంది. నవంబర్‌లో వినియోగధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2.3 శాతంగా నమోదు కావడంతో, రానున్న ఫిబ్రవరి భేటీలో ఆర్‌బీఐ ఎంపీసీ తన విధానాన్ని సడలించొచ్చని కోటక్‌ అంచనా వేసింది. ‘‘ఆర్‌బీఐ రేట్లను తగ్గించే ముందు తన విధానాన్ని తటస్థానికి మార్చొచ్చు. ద్రవ్యోల్బణం తాజాగా మరింత తగ్గడం అన్నది ఫిబ్రవరి సమావేశంలో రేట్ల కోత అవకాశాలను పెంచుతోంది’’ అని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. 2019లో మొత్తం మీద 50 బేసిస్‌ పాయింట్ల మేర రేట్ల కోత విధించొచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. కూరగాయలు, పప్పు ధాన్యాల ధరలు మరింత క్షీణించడంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్‌ నెలలో 11 నెలల కనిష్ట స్థాయికి దిగొచ్చిన విషయం విదితమే. 

 

టోక్‌ ద్రవ్యోల్బణం కూడా తగ్గింది...
ఇక హోల్‌సేల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సైతం నవంబర్‌లో 5.7 శాతానికి తగ్గింది. అక్టోబర్‌లో ఇది 6.2 శాతం. హౌసింగ్‌, హెల్త్‌, వ్యక్తిగత సంరక్షణ విభాగాల్లో ద్రవ్యోల్బణం చల్లబడింది. టోకు ధరల ద్రవ్యోల్బణం ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి వచ్చే మార్చి మధ్య సగటున 5.6 శాతంగా ఉండొచ్చని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ సంస్థ అంచనా వేసింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో సగటున 6.1 శాతంతో పోలిస్తే తక్కువ. 

 

11 నెలల గరిష్టానికి ఐఐపీ వృద్ధి
పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు (ఐఐపీ) అక్టోబర్‌ నెలలో 8.1 శాతానికి పెరగడం మరో కీలక ఆర్థిక అంశం. సెప్టెంబర్‌ నెలలో ఇది 4.5 శాతమే. తయారీ రంగం 7.9 శాతం, విద్యత్తు రంగం 10.8 శాతం చొప్పున అధిక వృద్ధి నమోదు చేశాయి. క్యాపిటల్‌ గూడ్స్‌ రంగం 16.8 శాతం, నిర్మాణ రంగం 8.7 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో ఆర్‌బీఐ ఫిబ్రవరి భేటీలో తన విధానాన్ని సడలించి, ఆ తర్వాత 50 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గించొచ్చన్నది కోటక్‌ విశ్లేషణ.
 



You may be interested

ఏటీఎంలు మూతపడవు: కేంద్ర ఆర్థిక శాఖ

Saturday 15th December 2018

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో దాదాపు సగం వరకు మూతపడే పరిస్థితి నెలకొందనే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన ఏటీఎంలైతే ఇప్పటివరకు మూసివేసే దిశగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి శివ్‌ ప్రతాప్ శుక్లా స్పష్టంచేశారు. సెప్టెంబర్‌ 30 నాటికి దేశంలో మొత్తం 2.21 లక్షలు ఉండగా.. వీటిని షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్‌

పల్లె వాసులకు మైక్రోఫైనాన్స్‌ ‘డిజిటల్‌ టచ్‌’

Saturday 15th December 2018

దేశంలో మైక్రోఫైనాన్స్‌ సంస్థలు ఆధునికత వైపు అడుగులు వేస్తూ, అదే సమయంలో పల్లెవాసులకు మరింత సన్నిహితం అవుతున్నాయి. వారితో స్నేహపూర్వకంగా మసలుకుంటున్నాయి. ఈ వివరాలను కేపీఎంజీ ఇండియా మైక్రో ఫైనాన్స్‌ రంగంపై విడుదల చేసిన తాజా నివేదికలో తెలియజేసింది. కోల్‌కతాలో జరిగిన 4వ ఈశాన్య భారత మైక్రోఫైనాన్స్‌ సదస్సు 2018 ఇందుకు వేదికైంది. ఆర్థిక సేవలు అందే విషయంలో చివరి మెట్టులో ఉండే సామాన్యులకు చిన్న రుణాలను అందించడం ద్వారా

Most from this category