News


కోటక్‌ సెక్యూరిట్‌ సిఫార్సు: పీఎన్‌సీ షేరును కొనండి

Saturday 24th November 2018
Markets_main1543041645.png-22358

నిర్మాణ, ఇంజనీరింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సేవలు అందించే పీఎన్‌సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ షేరును కొనవచ్చని రేటింగ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సు చేస్తుంది. నిర్ణీత కాలంలో ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను పూర్తి చేసే సామర్థ్యం కలిగి ఉండటం‍తో క్యూ2లో అంచనాలకు మించి ఆర్థిక ఫలితాలను నమోదు చేసినట్ల రేటింగ్‌ సంస్థ చెబుతుంది. అయితే ఎబిటా మార్జిన్‌ అంచనాలను అందుకోలేకపోయిందని కోటక్‌ తెలిపింది. పీఎన్‌సీ షేరుపై కోటక్‌ సెక్యూరిటీస్‌ విశ్లేషణలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం...
రంగం:- నిర్మాణ, ఇంజనీరింగ్‌, రియల్‌ ఎస్టేట్‌
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:- రూ.197

విశ్లేషణ:-
1.మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల నిర్మాణం నిర్ణీత సమయానికి పూర్తి చేయడంతో ఈ క్యూ2లో కంపెనీ నికరఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. గతేడాది క్యూ2లో ఆర్జించిన దానికంటే 108శాతం అధిక నికర ఆదాయాన్ని ఆర్జించింది.
2.ఈ క్యూలో ఎబిటా మార్జిన్‌ కేవలం 13.4శాతం మాత్రమే నమోదై అంచనాలను అందుకోలేకపోయింది.
3.కంపెనీ మొత్తం ఆదాయం రూ.149 బిలియన్ల విలువైన బుక్‌ ఆర్డర్లను కలిగి ఉంది. ఇది కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన మొత్తం ఆదాయం కంటే 8రెట్లు అధికం. ఈ బుక్‌ఆర్డన్‌ రానున్న మూడేళ్లలో కంపెనీ ఆదాయ వృద్ధిని పెంచుతుందని రేటింగ్‌ సంస్థ భావిస్తుంది. ఈ క్యూ2లో నూతన ఎక్స్‌ప్రెస్‌హైవే ప్రాజెక్ట్‌ నిర్మాణం ద్వారా లభించే మొత్తం ఆదాయంలో రూ.30-40 కోట్ల బిలియన్ల ఆదాయాన్ని బుక్‌ ఆర్డర్‌లో చేర్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
4.నిర్ణిత కాలంలో ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి చేసే సామర్థ్యం, బలమైన బుక్‌ ఆర్డర్‌ కలిగి ఉండటంతో కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019)లో 50శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరం(2020)లో 35శాతం ఆదాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఎబిటా మార్జిన్లు 13.5శాతం నుంచి 14శాతం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అవుట్‌ లుక్‌:- షేరు ‘‘బై’’ రేటింగ్‌కేటాయించడంతో పాటు షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను రూ.197లుగా నిర్ణయించినట్లు కోటక్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది.

View Pdf One (1543041812PNCInfratech_19Nov18_Kotak_PCG_00587.pdf)

You may be interested

నాత్యావసరాలను నుంచి ఔషధాలకు వరకు అన్నీ డెలవరీ

Saturday 24th November 2018

– నిత్యావసరాల నుంచి ఔషధాల దాకా అన్నీ డెలివరీ – డిసెంబర్‌ 15 నుంచి సేవలు ప్రారంభం – స్థానిక సూపర్‌ మార్కెట్లు, ఫార్మసీలతో టైఅప్‌ న్యూఢిల్లీ: ఇప్పటిదాకా ఫుడ్‌ డెలివరీ సేవలకు మాత్రమే పరిమితమైన స్విగ్గీ మరిన్ని విభాగాల్లోకి విస్తరిస్తోంది. నిత్యావసరాలు, ఔషధాలు మొదలైన వాటి డెలివరీ సేవలకు సంబంధించి లోకల్‌ కామర్స్‌ విభాగంలోకి అడుగుపెట్టనుంది. డిసెంబర్‌ 15న వీటిని ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం స్థానిక సూపర్‌

ఈనెల 28 నుంచి సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ప్రారంభం

Saturday 24th November 2018

ముంబై: నాలుగో విడత సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (సీపీఎస్ఈ ఈటీఎఫ్) ఈనెల 28 (వచ్చే బుధవారం) నుంచి తమ ఎక్స్ఛేంజీలో ప్రారంభంకానుందని బొంబే స్టాక్స్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రకటించింది. ఇంటర్‌నెట్ ఆధారిత బుక్‌ బిల్డింగ్‌ వ్యవస్థ (ఐబీబీఎస్‌) ప్లాట్‌ఫాం ద్వారా సీపీఎస్ఈ ఈటీఎఫ్ ఎఫ్‌ఎఫ్‌ఓ-3 సబ్‌స్రిప్షన్‌ ప్రారంభమవుతుందని, ఇదే నెల 30న (శుక్రవారం) ముగియనుందని వెల్లడించింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫీలో నమోదైన ట్రేడింగ్‌ మెంబర్లకు

Most from this category