STOCKS

News


భారత్‌ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు సానుకూలమే: మొబిస్‌

Friday 26th October 2018
Markets_main1540578097.png-21501

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొన్ని రంగాల్లో మరో 5-10 శాతం మేర కరెక్షన్‌ ఉంటుందని మొబిస్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ వ్యవస్థాపకుడు, సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ మార్క్‌ మొబిస్‌ అన్నారు. మిగిలిన ప్రతికూల అంశాలన్నింటినీ ఇప్పటికే మార్కెట్లు గమనంలోకి తీసుకున్నట్టు చెప్పారు. భారత మార్కెట్లో పెట్టుబడులకు ఎంతో ఆసక్తితో ఉన్నానని, భారత ప్రభుత్వం అనుమతుల విషయంలో మరింత క్రీయాశీలంగా వ్యవహరించాలన్నారు. ప్రక్రియలను మరింత క్రమబద్ధం చేయాలని, అప్పుడు పెట్టుబడులు మరింత సులభంగా రాగలవన్నారు. మొబిస్‌ సెబీ రిజిస్ట్రేషన్‌ కోసం వేచి చూస్తున్నారు. పలు అంశాలపై ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. 

 

విదేశీ ఇన్వెస్టర్లు

చాలా మంది విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ను సానుకూలంగా చూస్తున్నట్టు మొబిస్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అమెరికాతో చైనాకు వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్‌లో గొప్ప అవకాశాలను చూస్తున్నారని పేర్కొన్నారు. దీన్నుంచి భారత ప్రభుత్వం లబ్ధి పొందుతుందన్నారు. భారత మార్కెట్లో నికర విక్రయదారులుగా ఉన్న ఎఫ్‌ఐఐలు... ట్రెండ్‌ మారిన వెంటనే తిరిగి పెట్టుబడులతో భారత్‌కు రావడం మొదలు పెడతారని అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచరాదన్నారు. రేట్లను పెంచితే చాలా ప్రభావమే పడుతుందన్నారు. ‘‘ఇది మంచిది కాదు. ఎందుకంటే రేట్లను పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. భారత్‌లో అధిక వినియోగం సమస్య కాదు. నిబంధనలు, చట్టాలు, కంపెనీల పరంగా ఉన్న అడ్డంకులే’’ అని మొబిస్‌ చెప్పారు. 

 

ఎగుమతులకు అవకాశాలు

చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం గురించి మాట్లాడుతూ... లబ్ధి పొందేందుకు భారత్‌కు ఇది అవకాశాల తరుణమన్నారు. భారత్‌ ట్రంప్‌తో ఒప్పందానికి రావాలని, స్వేచ్ఛగా వాణిజ్యం చేయాలని సూచించారు. ఇది భారత్‌కు అనుకూలించి ఎగుమతులు పెరిగితే అధిక స్థాయిలో ఉన్న కరెంటు ఖాతా లోటు దిగివస్తుందన్నారు. ‘‘అక్కడ వృద్ధికి అవకాశం ఉంది. భారత్‌కు కార్మిక శక్తి ఉంది. మారకం రేటు తక్కువగా ఉంది. అమెరికాకు తయారు చేసే పెట్టే శక్తి భారత్‌కు ఉంది. అమెరికాకు ఎగుమతి చేసేందుకు సాంకేతికత ఉంది. ఇది ఇద్దరికీ విజయం కలిగించే పరిస్థితి’’ అని మార్క్‌ మొబిస్‌ వివరించారు. 

 

రాజకీయాలపై ఆందోళన లేదు

భారత్‌లో ఈక్విటీ మార్కెట్లతో ముడిపడిన రాజకీయ రిస్క్‌పై తనకు ఆందోళన లేదని మొబిస్‌ చెప్పారు. ‘‘నేనేమీ పెద్దగా ఆందోళన చెందడం లేదు. భారత్‌ సంస్కరణల పథంలో ఉంది. కనుక అది మోదీ అయినా లేక మరో ప్రభుత్వమైనా వారు ఆ మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. భారత్‌లో యువ జనాభా ఎక్కువగా ఉంది. అందరి దగ్గరా సెల్‌ఫోన్లు ఉన్నాయి. వారు సంస్కరణలను కోరుకుంటున్నారు. ప్రభుత్వం దానికి స్పందించాల్సిందే’’ అని అన్నారు.You may be interested

రిటైల్‌ ఇన్వెస్టర్లు పనితీరులో ‘ఫండ్స్‌’ వెనుకే!

Friday 26th October 2018

స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, మల్టీక్యాప్‌ ఫండ్స్‌ ఎన్‌ఏవీలు గత ఏడాది కాలంలో 3-10 శాతం మధ్యలో పతనం అయ్యాయి. దీంతో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను మానేసి, సొంతంగానే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకుంటే పోదూ... అన్న ఆలోచన కొందరు ఇన్వెస్టర్లలో సహజంగానే వచ్చింది. దీనిపై హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఈడీ, సీఐవో ప్రశాంత్‌ జైన్‌ స్పందిస్తూ... స్వల్ప కాల అవాంతరాలన్నవి దీర్ఘకాల లక్ష్యాల విషయంలో ఇన్వెస్టర్లను పక్కదోవ పట్టించకూడదన్నారు. ‘‘వ్యవస్థాగతేతర రిస్క్‌లను

ట్రేడర్లు బేరిష్‌..ఇండెక్స్‌ ఫ్యూచర్ల ప్రీమియం కట్‌

Friday 26th October 2018

సమీపరోజుల్లో మార్కెట్‌ మరింత క్షీణిస్తుందన్న ట్రేడర్ల అంచనాల కారణంగా ఇండెక్స్‌ ఫ్యూచర్లలో చాలావరకూ ప్రీమియం శుక్రవారం హరించుకుపోయింది. అక్టోబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ ప్రారంభపు రోజునాడే ప్రీమియం కట్‌కావడం టెక్నికల్‌గా బేరిష్‌ సంకేతం. సెప్టెంబర్‌ సిరీస్‌లో 7 శాతంపైగా పతనం చూసిన నిఫ్టీ అక్టోబర్‌ సిరీస్‌ తొలినాళ్లలో కొంత రికవరీ వుంటుందన్న అంచనాలతో గురువారం నిఫ్టీ ఫ్యూచర్‌...స్పాట్‌తో పోలిస్తే  60 పాయింట్ల ప్రీమియంతో ముగిసింది. శుక్రవారం స్పాట్‌ నిఫ్టీ 95 పాయింట్ల క్షీణతతో

Most from this category