News


మరో బుల్‌ర్యాలీకి మార్కెట్‌ సన్నద్ధమవుతోంది: జున్‌జున్‌వాలా

Sunday 29th July 2018
Markets_main1532868504.png-18755

ప్రముఖ బడా ఇన్వెస్టర్‌ రాకేశ్‌ జున్‌జున్‌వాలా దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరో బుల్‌ ర్యాలీకి సన్నద్ధమవుతున్నాయని అన్నారు. అయితే, రెండు అంశాలు తనకు ఆందోళన‍ కలిగిస్తున్నట్టు చెప్పారు. అవి పెరుగుతున్న చైనా రుణ భారం, యూరోజోన్‌ విచ్ఛిన్నానికి అవకాశాలేనని చెప్పారు. యూరోజోన్‌లో ఏదైనా ప్రతికూలత చోటు చేసుకుంటే అది మన బుల్స్‌కు విఘాతం కలిగించే పరిణామంగా ఆయన పేర్కొన్నారు.

 

 ‘‘యూరో అన్నది శాశ్వతంగా ఉండేది కాదు. ఇది ఏడాదిలో విచ్ఛినమవుతుందా లేక రెండు, ఐదేళ్లలో జరుగుతుందా అన్నది చూడాల్సిందే. చైనాలో నిజంగా ఏం జరుగుతుందన్నది నాకు తెలియడం లేదు. ఎందుకంటే రుణాలు చాలా గరిష్ట స్థాయికి చేరాయి. ఈ రెండు అంతర్జాతీయ అంశాలు భారత్‌ను నిరుత్సాహపరచగలవు’’ అని జున్‌జున్‌వాలా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘మార్కెట్‌ను అర్థం చేసుకునేందుకు కాస్తంత పరిణతి అవసరం. ఎన్నో అంశాలు, వార్తల నడుమ వాస్తవం ఏంటన్నది గుర్తించాలి. ప్రతి ఒక్కరూ మిడ్‌క్యాప్‌ను కొనుగోలు చేస్తున్నారు. అంటే పెట్టుబడులపై భారీ స్థాయిలో లాభాలు ప్రతి ఒక్కరికీ వస్తాయని కాదు. భారత్‌లో కార్పొరేట్ లాభాలు అధిక స్థాయిల్లో లేవు. ఇప్పుడిప్పుడే సంస్కరణల తాలూకు ప్రయోజనాలు ఆర్థిక రంగానికి అందివస్తున్నాయి. కనుక మార్కెట్‌ ఇప్పుడప్పుడే వెనక్కి వెళ్లేందుకు అవకాశం లేదు’’ అని జున్‌జున్‌వాలా తన విశ్లేషణను తెలియజేశారు.

 

బ్యాంకాఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ సైతం ఈ నెల మొదట్లో తన నివేదికలో... యూరోజోన్‌ రుణాలు, విచ్ఛిన్నానికి అవకాశాలతోపాటు, చైనాలో వృద్ధి, ప్రజాకర్షక విధానాలు, వాణిజ్య యుద్ధాలు అంతర్జాతీయంగా ఫండ్‌ మేనేజర్లను ఆందోళన కలిగిస్తున్న అంశాలుగా పేర్కొంది. ‘‘ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముందు నాటికి చైనా ఆర్థికేతర రంగాల రుణాలు జీడీపీలో 135 శాతంగా ఉంటే, 2011 నాటికి 170 శాతానికి పెరిగాయి. గత ఐదేళ్లలో ఆర్థికేతర రంగాలకు ఇచ్చే రుణాలు రెట్టింపయ్యాయి. జీడీపీలో 2016 నాటికి 235 శాతానికి చేరాయి’’ అన్నది ఐఎంఎఫ్‌ విశ్లేషణ. ఇక యూరోజోన్‌లో ఐరోపా యూనియన్‌కు వ్యతిరేక సెంటిమెంట్‌ బలపడితే బ్రిటన్‌ తప్పుకునే అవకాశాలు పెరుగుతాయన్నది విశ్లేషణ.You may be interested

అప్పు తీసుకున్నా ఆదాయపన్ను ప్రయోజనాలు

Sunday 29th July 2018

రుణం తీసుకోవాలంటే తగిన కారణం ఉండాలంటారు. అలా చూసుకుంటే కొన్ని రకాల రుణాలకు ఆదాయపన్ను ప్రయోనాలు ఉన్నాయి. ఇంటి కోసం రుణం, విద్యా రుణం, పర్సనల్‌ లోన్‌ వీటన్నింటిపైనా పన్ను ప్రయోజనాలు అందుకోవచ్చు. అవేంటన్నది తెలిపే కథనం ఇది.   విద్యా రుణం విద్యా రుణాలు తీసుకునే వారు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80ఈ కింద పన్ను ప్రయోజనాలకు అర్హులు. వరుసగా ఎనిమిది సంవత్సరాలపాటు రుణంపై చెల్లించే వడ్డీ (ఎంత మొత్తమైనా)ని ఆదాయం నుంచి

మహిళలకోసం మదుపు సూత్రాలు

Saturday 28th July 2018

విత్త నిర్వహణలోకి అడుగుపెట్టే నారీమణులకు నాలుగు సూత్రాలను నిపుణులు సూచిస్తున్నారు. 1. తక్కువ రిస్కు: ఆర్థిక పెట్టుబడుల్లోకి అడుగుపెట్టేవాళ్లు తక్కువ రిస్కు ఉండే పీపీఎఫ్‌, రికరింగ్‌ డిపాజిట్ల వంటి వాటితో ఆరంభించడం మంచిది. దీంతో పెట్టుబడుల్లో క్రమశిక్షణ, ఓపిక అలవడతాయి. కనీసం ఏడాదికి రూ.500తో పెట్టుబడి ఆరంభించాలి. జీవితంలో ఎంత తొందరగా మదుపు ఆరంభిస్తే అంత ఎక్కువగా లాభాలుంటాయి. పీపీఎఫ్‌లాంటి పెట్టుబడి సాధనాలతో దాదాపు లక్షన్నర రూపాయల వరకు పన్ను ప్రయోజనాలు

Most from this category