STOCKS

News


మెజెస్కోపై బుల్లిష్‌

Friday 10th August 2018
Markets_main1533884237.png-19117

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి
స్టాక్‌: మెజెస్కో
ఇండస్ట్రీ: టెక్నాలజీ
ప్రస్తుత ధర: రూ.500
టార్గెట్‌ ప్రైస్‌: రూ.575

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి టెక్నాలజీ సంస్థ మెజెస్కోపై బుల్లిష్‌గా ఉంది. కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తోంది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.575గా నిర్ణయించింది. కరెన్సీ మారక విలువ తగ్గుదల, స్థిర వ్యయాలు వల్ల కంపెనీ మార్జిన్లు బాగుంగొచ్చని అంచనా వేస్తోంది. కంపెనీ ఆదాయం స్థిరంగా ఉందని పేర్కొంది. మెజెస్కో ఇటీవల కాలంలో క్లౌడ్‌ సర్వీసులకు అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. మెట్‌లైఫ్‌ డీల్‌ కూడా ఇందులో భాగమేనని పేర్కొన్నారు.  రూపీ పతనం వల్ల మార్జిన్లు బలంగా ఉన్నాయని తెలిపింది. అందువల్ల బై రేటింగ్‌ను ఇస్తున్నామని తెలిపింది. అలాగే ప్రాజెక్టుల అమలులో కొన్ని రిస్క్‌లు ఉన్నాయని పేర్కొంది. గతాన్ని పరిశీలిస్తే ప్రాజెక్టుల అమలు సమర్థవంతంగా లేదని గుర్తుచేసింది.  

కంపెనీ పనితీరు, వివరాలు తదితర సమాచారం కోసం కింది లింక్‌పై క్లిక్‌ చేయండి....


 

View Pdf One (1533884251MJCO_CU_270718.pdf)

You may be interested

ఈ స్టాక్‌పై కన్నేయండి..

Friday 10th August 2018

బ్రోకరేజ్‌: జేఎం ఫైనాన్షియల్‌  స్టాక్‌: హీరో మోటొకార్ప్‌ రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌: రూ.4,050 ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో హీరో మోటొకార్ప్‌ ఆరోగ్యకరమైన 15.6 శాతం ఈబీటా మార్జిన్లను ప్రకటించింది. ధర ఒత్తిళ్లు, ఎంట్రీ లెవెల్‌లో తీవ్రమైన పోటీ వంటి అంశాలున్నప్పటికీ ఆకర్షణీయ ఫలితాలను వెల్లడించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మెరుగుదల, సాధారణ రుతువపనాలు, కనీస మద్దతు ధర పెంపు నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో టూవీలర్లకు బలమైన డిమాండ్‌ ఉండొచ్చని అంచనా వేసింది. బ్రాండ్‌ రీకాల్‌,

స్టార్‌ సిమెంట్‌ కొనొచ్చు..

Friday 10th August 2018

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: స్టార్‌ సిమెంట్‌ ఇండస్ట్రీ: సిమెంట్‌ ప్రస్తుత ధర: రూ.114 టార్గెట్‌ ప్రైస్‌: రూ.160 బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి.. స్టాక్‌ సిమెంట్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తోంది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.160గా నిర్ణయించింది. సరుకు, విద్యుత్‌, ఇంధన వ్యయాల హేతుబద్దీకరణ సహా విక్రయాల్లో పెరుగుదల, పనితీరు మెరుగుపడటం వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. స్టార్‌ సిమెంట్‌కు మంచి బ్రాండ్‌ పేరు ఉందని, మార్కెట్‌లో 23 శాతం వాటాను

Most from this category