STOCKS

News


ఓఎన్‌జీసీకి హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌

Thursday 8th November 2018
Markets_main1541671254.png-21795

ముంబై:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వ రంగ సం‍స్థ ఆయిల్‌ అండ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) షేరుకు ప్రముఖ రేటింగ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. చమురు, సహజ వాయువు ఉత్పత్తి రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఓఎన్‌జీసీ కంపెనీ షేరుపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషణలు ఇలా ఉన్నాయి...
రంగం:- చమురు ఉత్పత్తి, శుద్ధి
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:-  రూ.182

క్యూ2 ఫలితాలు:- అంతర్జాతీయంగా చమురు ధరలు ర్యాలీ చేయడంతో రెండో త్రైమాసిక కాలంలో కంపెనీ నికరలాభం రూ.8,265 కోట్ల నికరలాభాన్ని సాధించింది. గతేడాది ఇదే క్యూ2లో కంపెనీ ఆర్జించిన రూ.5,131 కోట్లతో పోలిస్తే ఇది 61శాతం అధికం. ఇదే క్యూ2లో ఆదాయం 47.6 శాతం పెరిగి రూ.27,989 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.5,131 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో ఉత్పత్తి చేసి, విక్రయించిన ప్రతి క్రూడాయిల్‌ బ్యారల్‌పై 73.07 డాలర్లను ఓఎన్జీసీ అందుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసిక ఆర్జనతో పోల్చితే 48 శాతం (49.43 డాలర్లు) వృద్ధిని సాధించింది. చమురు ఉత్పత్తి తగ్గడంతో పాటు అధిక ధరల నేపథ్యంలో కంపెనీ లాభాలు అమాంతం పెరిగాయి.
అనుకూలాంశాలు:- ఈ నవంబర్‌4 నుంచి ఇరాక్ చమురు దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలు అమల్లోకి రానుండం, వెనిజులా నుంచి చమురు ఉత్పత్తి తగ్గిపోవడం, లిబియా చేసే ఉత్పత్తులను పరిమితం చేసుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగవచ్చు.ఈపీఎస్‌ వచ్చే రెండేళ్లలో చక్రగతిన 15.5 శాతం  వార్షిక వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నాం. అలాగే ఆర్థిక సంవత్సరం 2019, 2020ల్లో డివిండెండ్‌ ఈల్డ్‌ 6శాతం వుంటుంది
ప్రతికూలాంశాలు:- పెరుగుతున్న ముడిచమురు ధరల కారణంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో పాటు సబ్సీడీ భారాన్ని పంచుకోవాలనే అంశం షేరు ధరపై ఒత్తిడి పెంచుతుంది.

View Pdf One (1541670227ONGC_-_2QFY19_-_HDFC_sec-1.pdf)

You may be interested

ఇమామి...కొనొచ్చు-ఆనంద్‌ రాఠి

Thursday 8th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఇమామి స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: ఇమామి రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.421 టార్గెట్‌ ప్రైస్‌: రూ.595 ఆనంద్‌రాఠి.. ఇమామిపై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.595గా నిర్ణయించింది. కీలకమైన వ్యాపారాలపై దృష్టి కేంద్రీకరించడం, పలు ఉత్పత్తుల రి-లాంచ్‌, మార్కెట్‌ వాటా పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణ, కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ, మేనేజ్‌మెంట్‌

నెలరోజుల కోసం టాప్‌ సిఫార్సులు

Thursday 8th November 2018

ముంబై: ఈవారంలో నిఫ్టీ ఇప్పటివరకు అధిక శాతం రేంజ్‌బౌండ్‌లోనే కొనసాగింది. 10,440 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉండగా.. ఈ స్థాయిని కోల్పోతే 10340, ఆ తరువాత 10260 అత్యంత కీలక స్థాయిలుగా ఉన్నాయని సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ ఆశిష్‌ చతుర్‌మెహతా విశ్లేషించారు. 10,600 స్థాయిని అధిగమించి, ఆ స్థాయి ఎగువన నిలబడగలిగినప్పుడే 10,750-10,850 రేంజ్‌కు చేరుకుంటుందని వ్యాఖ్యానించారు. నిఫ్టీ ఆప్షన్స్‌ విభాగంలో అత్యధిక

Most from this category