STOCKS

News


మెజెస్కో షేరును కొనవచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ

Saturday 9th February 2019
Markets_main1549693396.png-24098

ఐటీ రంగంలో సేవలను అందించే మెజెస్కో షేరును కొనవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ సిఫార్సు చేస్తోంది. ఐటీ సెక్టార్‌లో అధిక డిమాండ్‌ కలిగిన క్లౌడ్‌ సర్వీసులకు ప్రాధాన్యమిస్తున్నందున భవిష్యత్తులో కంపెనీ రెవెన్యూ పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. స్థిర వ్యయాలు, డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత తదితర కారణాలు కంపెనీ మార్జిన్లు పెంచవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ చెబుతోంది. మెజెస్కో షేరుపై హెచ్‌డీఎఫ్‌సీ సమగ్ర విశ్లేషణ ఇప్పుడు చూద్దాం..
రేటింగ్‌:-  కొన‌వ‌చ్చు.
ప్రస్తుత ధ‌ర:- రూ. 498
టార్గెట్ ధ‌ర:- రూ.761

విశ్లేష‌ణ:- ఇటీవ‌ల కంపెనీ విడుద‌ల చేసిన క్యూ3 ఫ‌లితాల్లో రెవెన్యూ, మార్జిన్లు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. వార్షిక ప్రతిపాదిక కంపెనీ నికరలాభం 52శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే క్యూ3లో కంపెనీ రూ.12.94 కోట్ల నికరలాభాన్ని ఆర్జించగా, ఈ క్యూ3లో రూ.19.76 కోట్లను నమోదు చేసింది. ఆదాయం 25శాతం వృద్ధిని సాధించి రూ.263.16 కోట్లను ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ3లో కంపెనీ రూ.209.29 కోట్లను మాత్రమే సాధించింది. క్లౌడ్  ట్రాక్షన్ స‌ర్వీసెసుల నుంచి 35.4 మిలియ‌న్ డాలర్ల విలువైన ఆర్డర్లు దక్కడం కంపెనీ కలిసొచ్చింది. క్లౌడ్ స‌బ్‌స్క్రైబ్‌ల ఆదాయ మార్జిన్లు వృద్ధి చెందండంతో ఎబిటా మార్జిన్లు వార్షిక ప్రాతిప‌దిక 11శాతం పెరిగాయి.  
1. అమెరికా పీ&సీ ఇన్సూరెన్స్ కంపెనీకి థర్డ్‌ పార్టీ సాఫ్ట్‌వేర్ సేవ‌లను అందిచ‌డం
2. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఐబీఎం కంపెనీతో జ‌త క‌ట్టి ప‌ని చేయ‌డం
3. విలువైన ఆర్డర్లను ద‌క్కించుకోవ‌డంలో మెరుగుద‌ల‌.
4. ఐటీ రంగంలో క్లౌడ్ సర్వీసులకు డిమాండ్‌ పెరగడం
తదితర అంశాలు కంపెనీ ఆదాయాలను పెంచుతాయని బ్రోకరుజ్‌ సంస్థ అంచనా వేస్తుంది.

View Pdf One (1549693468Majesco_-_3QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

జాగ్వార్‌... మ్యావ్‌!

Saturday 9th February 2019

- జేఎల్‌ఆర్‌ దెబ్బతో భారీ నష్టాలు - బ్రెగ్జిట్, వాణిజ్య యుద్ధ భయాల రిస్కులు - మందగిస్తున్న అమ్మకాలు - కలిసిరాని వ్యూహాలు 2008... దివాలా కోరల్లోకి జారుకున్న ఫోర్డ్‌ మోటార్స్‌ తన లగ్జరీ కార్ల బ్రాండ్‌ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌)ను అమ్మకానికి పెట్టింది. అప్పటివరకూ భారతీయ కార్పొరేట్లలో ఎవ్వరూ చేయనంత సాహసాన్ని టాటా గ్రూప్‌ అధిపతి రతన్‌టాటా చేశారు. అలా పంతంపట్టి మరీ దాదాపు 2.3 బిలియన్‌ డాలర్లు(అప్పట్లో మన కరెనీ​ప్రకారం రూ.9,300 కోట్లు) వెచ్చించి

పీఎంఎస్‌లకూ నష్టాల సెగ

Friday 8th February 2019

ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు, ఏఎంసీలు నిర్వహించే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసులు (పీఎంఎస్‌) సైతం జనవరి నెలలో నష్టాలను ఎదుర్కొన్నాయి. పెద్ద ఇన్వె‍స్టర్లకు ఈ సంస్థలు ఈక్విటీ పెట్టుబడి సేవలను అందిస్తుంటాయి. ఇన్వెస్టర్ల తరఫున నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడి వ్యవహారాలు చూసే పీఎంఎస్‌లు సైతం గత నెలలో మార్కెట్ల అస్థిరతల ప్రభావానికి లోనైనట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. పేరున్న పీఎంఎస్‌ సంస్థల నిర్వహణలోని పెట్టుబడుల విలువ 10 శాతం క్షీణించడం అస్థిరతల్లో

Most from this category