STOCKS

News


ఇండియన్‌ హోటల్స్‌ కొనొచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

Saturday 17th November 2018
Markets_main1542446067.png-22146

ముంబై:- ప్రముఖ రేటింగ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఇండియన్‌ హోటల్స్‌ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది.  ఆతిథ్య రంగంలో సేవలు అందించే ఇండియన్‌ హోటల్స్‌ షేరుపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషణ ఇలా ఉంది.
రంగం:- హోటల్స్‌
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ.150

విశ్లేషణ:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే నమోదయ్యాయి. ఈ క్యూ2లో కంపెనీ రూ.960 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే ఇది 15శాతం అధికం. గతేడాది ఇదే క్యూ2తో పోలిస్తే ఎబిటా 81 శాతం వృద్ధి చెంది రూ.100 కోట్లను సాధించింది. కంపెనీ ఆదాయాన్ని వృద్ధి చేసుకునేందుకు, మార్జిన్లను మెరుగుపరిచేందుకు వ్యూహాత్మక ప్రాంతాల్లో ఆస్తుల విక్రయాలను చేసింది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో 16శాతంగా నమోదైన ఎబిటా వచ్చే నాలుగేళ్లలో 25శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా సంస్థకు ఉన్న బ్రాండ్‌ పేరు, లగ్జరీ హోటల్స్‌ నిర్వహణలో అగ్రస్థానంలో కొనసాగుతుండటం, తదితర అంశాలు షేరు వృద్ధికి కలిసొచ్చే అవకాశం ఉంది.అసెట్ లైట్ ప్రణాళిక ద్వారా ఆస్తుల విస్తరణ, అసెట్ ఆస్తుల మోనటైజేషన్‌ రోజురోజుకు పెంచుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో కంపెనీ ఏఆర్‌ఆర్‌(యావరేజ్‌ రూమ్‌ రేటింగ్‌) 2శాతం పెరగడం శుభసూచకం.  2,200 గదుల ఉన్న ఇండియన్‌ హోటల్స్‌ సామర్థ్యం కేవలం 9 నెలల్లో 4,175 గదుల సామర్థా‍్యన్ని పెంచుకుంది.

View Pdf One (1542446179Indian_Hotels_-_2QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

గోద్రేజ్‌ కన్సూమర్‌ టార్గెట్‌ రూ.640..!

Saturday 17th November 2018

ముంబై: గోద్రేజ్‌ కన్సూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (జీసీపీఎల్‌) షేరు ధర మరింత పడిపోయే అవకాశం ఉందని టెక్నికల్‌ అనలిస్టులు సూచిస్తున్నారు. సెప్టెంబర్‌ 3నాటికి.. గరిష్టస్థాయి నుంచి ఏకంగా 25 శాతం పడిపోయిన ఈ షేరులో పతనం ఇంకా మిగిలే ఉందని విశ్లేషిస్తున్నారు. టెక్నికల్‌గా ఈ షేరు డెత్‌ క్రాస్‌కు చేరిందని వివరించారు. 50-రోజుల సగటు కదలికల స్థాయి 200-రోజుల సగటు కదలికల స్థాయి కంటే దిగువకు పడిపోందని.. ఇలా జరగడం

క్రూడ్‌లో పెరిగిన షార్ట్‌ సెల్లింగ్‌

Saturday 17th November 2018

2011 నాటి గరిష్టస్థాయిని తాకిన బేరిష్‌ బెట్స్‌ ముంబై: ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. గడిచిన వారం రోజుల్లో 6.2 శాతం నష్టపోయాయి. శుక్రవారం రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో డిసెంబర్‌ 18తో ముగిసే వెస్ట్ టెక్సాస్ ఇంటర్‌మీడియట్ (డబ్ల్యూటీఐ) బ్యారెల్‌ క్రూడ్‌ ధర 56.83 డాలర్ల వద్ద ముగిసింది. జనవరి 19తో ముగిసే బ్యారెల్‌ బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్ వారంతాన 67 డాలర్ల వద్ద ముగిసింది. సరిగ్గా ఆరు వారాల కిందట

Most from this category