STOCKS

News


ఈ స్టాక్స్‌పై కోటక్‌ బుల్లిష్‌

Saturday 10th November 2018
Markets_main1541842995.png-21871

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం..

స్టాక్‌: అర్వింద్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.319
టార్గెట్‌ ప్రైస్‌: రూ.452
అర్వింద్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌)లో అంచనాలకు అనుగుణమైన ఫలితాలనే ప్రకటించింది. కన్సాలిడేట్‌ నికర అమ్మకాల్లో వార్షికంగా 11.6 శాతం వృద్ధి నమోదయ్యింది. టెక్స్‌టైల్‌ విభాగంలో 6 శాతం, మెటీరియల్స్‌ విభాగంలో 21 శాతం, బ్రాండెడ్‌ అప్పరెల్‌ విభాగంలో 13 శాతం వృద్ధి ఇందుకు కారణం. టెక్స్‌టైల్‌ విభాగంలో వృద్ధి నెమ్మదిగా ఉంది. ఈబీటా మార్జిన్లు పెరిగాయి. 

స్టాక్‌: గ్రీవ్స్‌ కాటన్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.122
టార్గెట్‌ ప్రైస్‌: రూ.146
కంపెనీ ప్రస్తుత క్యూ2లో మంచి ఆర్థిక ఫలితాలనే ప్రకటించింది. వార్షికంగా చూస్తే ఈ క్యూ2లో ఆదాయంలో 9 శాతం, ఈబీటాలో 8 శాతం వృద్ధి నమోదయ్యింది. పీఏటీలో స్వల్ప వృద్ధి కనిపించింది. కమోడిటీ ధరల ఒత్తిడి ఉన్నా కూడా ఈబీటా మార్జిన్లు స్థిరంగానే ఉన్నాయి. ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే సంస్థ స్టాక్‌ వ్యాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.  

స్టాక్‌: అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.867
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,070
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) కంపెనీ ఎర్నింగ్స్‌ అంచనాలకు అనుగుణంగా లేవు. రెవెన్యూ ఆశించిన విధంగా లేదు. డిస్ట్రిబ్యూషన్‌ వద్ద మిగులు ఇన్వెంటరీ ఇందుకు ప్రధాన కారణం. అలాగే సీజన్‌గా చూస్తే ఇది బలహీన క్వార్టర్‌. ఈబీటా కూడా తగ్గింది. అయితే మేనేజ్‌మెంట్‌ మాత్రం డిమాండ్‌ మెరుగుపడుతుందని విశ్వాసం వ్యక్తంచేసింది. గైడెన్స్‌ను అందుకోగలమని ధీమాగా ఉంది. ఎయిర్‌ కండీషనర్లపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల కస్టమ్స్‌ డ్యూటీని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. ఇది కంపెనీకి సానుకూల అంశం.  


కంపెనీల పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేయండి...

View Pdf One (1541842999Arvind_05Nov18_Kotak_PCG_00579.pdf)
View Pdf Two (1245069051GreavesCotton_05Nov18_Kotak_PCG_00579.pdf) View Pdf Three (248534959AmberEnt_05Nov18_Kotak_PCG_00579.pdf)

You may be interested

డాక్డర్‌ రెడ్డీస్‌ దువ్వాడ ప్లాంట్‌పై నీలినీడలు..

Saturday 10th November 2018

నాలుగేళ్లలో ఒకే ప్లాంట్‌కు మూడు సార్లు అభ్యంతరాలు నూతన అనుమతులపై దువ్వాడ ప్లాంట్‌ ప్రభావం దేశీ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యుఎస్‌ ఎఫ్‌డీఏ) నుంచి వరుస అభ్యంతరాలు అందుతూనే ఉన్నాయి. అమ్మకాల పరంగా ఐదవ అతి పెద్ద కంపెనీగా ఉన్నటువంటి ఈ సంస్థకు చెందిన దువ్వాడ ప్లాంట్‌కు తాజాగా మరోసారి ఫారమ్‌ 483 జారీ అయినట్లు ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించింది.

సిటీ యూనియన్‌ బ్యాంక్‌ను కొనొచ్చు : ఆనంద్‌రాఠి

Saturday 10th November 2018

స్థిరమైన పనితీరుతో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న సిటీ యూనియన్ బ్యాంక్ షేరును కొనొచ్చని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఆనంద్‌ రాఠి సిఫార్సు చేస్తుంది. తమిళనాడు కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ రంగ సంస్థ సిటీ యూనియన్ బ్యాంక్‌ మొత్తం 607 బ్రాంచులున్నాయి. అందులో అత్యధికంగా తమిళనాడులోనే ఏకంగా 418 బ్రాంచులు ఉన్నాయి. బ్యాంక్‌ ఎక్కువగా చిన్న, మధ్య ఎంటర్‌ప్రైజెస్‌(ఎస్‌ఎంఈ) సంస్థలకు రుణాలు కేటాయింపునకు ప్రాధాన్యత ఇస్తుంది. రూ.2.50 లక్షల నుంచి రూ.10లక్షల

Most from this category