STOCKS

News


హిందుస్తాన్‌ జింక్‌ కొనొచ్చు: కోటక్‌

Friday 24th August 2018
Markets_main1535102279.png-19602

బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా హిందుస్తాన్‌ జింక్‌ షేరు కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో ఒకసారి గమనిస్తే..

బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌
స్టాక్‌: హిందుస్తాన్‌ జింక్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.292
టార్గెట్‌ ప్రైస్‌: రూ.300
బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌.. హిందుస్తాన్‌ జింక్‌ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.300గా నిర్ణయించింది. అంతర్జాతీయంగా తక్కువ వ్యయంతో అధిక ఉత్పత్తిని సాధించే పలు కంపెనీల్లో హిందుస్తాన్‌ జింక్‌ కూడా ఒకటని పేర్కొంది. కమోడిటీ ధరల పెరుగుదల వల్ల నిర్వహణ వ్యయాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కంపెనీ ఉత్పత్తి వ్యయాలు తక్కువ స్థాయిలోనే ఉన్నాయని పేర్కొంది. వ్యయ నియంత్రణ చర్యలు ఇందుకు కారణమని తెలిపింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూ​1లో ఉత్పత్తి వ్యయాలు కొద్దిగా పెరిగాయని గుర్తుచేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో మెటల్‌ తయారీ 4.4 శాతం పెరిగిందని పేర్కొంది. భూగర్భంలోని గనుల నుంచి అధిక ఓర్‌ ఉత్పత్తి ఇందుకు దోహదపడిందని తెలిపింది. కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటోందని పేర్కొంది. జింక్‌ మార్కెట్‌ ఫండమెంటల్స్‌ బలంగా ఉన్నాయని, గ్లోబల్‌గా జింక్‌ వినియోగం పెరుగుతుందనే అంచనాలున్నాయని తెలిపింది. వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ఇటీవలి కాలంలో జింక్‌ ధరలు తగ్గడం, ఉత్పత్తి వ్యయాలు అంచనాల కన్నా ఎక్కువగా పెరగడం, విక్రయాలు నెమ్మదిగా పుంజుకోవడం వంటివి రిస్క్‌ అంశాలని పేర్కొంది. డైవర్సిఫైడ్‌ రెవెన్యూ, బలమైన బ్యాలెన్స్‌ షీట్‌, రూపాయి పతనం, జింక్‌ వినియోగం పెరుగుతుందనే అంచనాలు వంటివి సానుకూల అంశాలని తెలిపింది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1535102287Hindustan Zinc - 00531 Kotak PCG 23-08-2018.pdf)

You may be interested

ఈ మూడు రంగాలు ఆకర్షణీయం

Friday 24th August 2018

బీఓఐ ఏఎక్స్ఏ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ రాబోయే ఎన్నికల సీజన్‌ కారణంగా ఏడాది వరకు మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయని బీఓఐ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రతినిధి అలోక్‌ సింగ్‌ చెప్పారు. అనిశ్చిత వాతావరణాన్ని కంపెనీల ఎర్నింగ్స్‌ పెరగడం సమతూకం చేస్తుందన్నారు. ఈ సమయంలో ప్రైవేట్‌ ఫైనాన్షియల్స్‌, ఇండస్ట్రియల్స్‌, కన్జమ్షన్‌ రంగాలను ఎంచుకోవాలని సూచించారు. అకౌంట్లు, లోన్ల పరంగా ప్రైవేట్‌ బ్యాంకులు ఇటీవల కాలంలో తమ వాటా పెంచుకుంటూవస్తున్నాయన్నారు. ఇదే ధోరణి మునుముందు కూడా కొనసాగుతుందని, పీఎస్‌బీలు

క్షీణించిన ఫార్మా షేర్లు

Friday 24th August 2018

ముంబై:- ఇటీవల రూపాయి పతనంతో లాభాల ర్యాలీ చేసిన ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా నేడు ఫార్మా షేర్లు నష్టాల బాట పట్టాయి. ఫార్మా సూచీలోని హెవీవెయిటైజ్‌ షేర్లైన సిప్లా, సన్‌ఫార్మా షేర్లు 2శాతం క్షీణించడంతో ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 2శాతం వరుకు నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(10077)తో పోలిస్తే 1శాతం (100 పాయింట్లు) నష్టపోయి 9,971 పాయింట్ల వద్ద ట్రేడ్‌

Most from this category