STOCKS

News


అక్సో నోబెల్‌పై కోటక్‌ బుల్లిష్‌

Saturday 8th September 2018
Markets_main1536397980.png-20093

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా అక్సో నోబెల్‌ ఇండియా స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..


స్టాక్‌: అక్సో నోబెల్‌ ఇండియా
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.1,730
టార్గెట్‌ ప్రైస్‌: రూ.2,200
కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా అక్సో నోబెల్‌ ఇండియాపై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.2,200గా నిర్ణయించింది. కంపెనీ కీలకమైన డెకరేటివ్‌, ఇండస్ట్రీయల్‌ పెయింట్స్‌ విభాగాల్లో చాలా త్రైమాసికాల నుంచి స్థిరమైన వృద్ధిని కనబరుస్తూ వస్తోందని పేర్కొంది. కొత్త మేనేజ్‌మెంట్‌ అనుసరిస్తున్న విధానాలు, స్థూల ఆర్థికాంశాలు అనుగుణంగా ఉండటం, జీఎస్‌టీ రేటు తగ్గింపు, ముడి పదార్ధాల ద్రవ్యోల్బణం వంటి అంశాలు సమీప కాలంలో కంపెనీ మంచి పనితీరును సూచిస్తున్నాయని తెలిపింది. 2018-2020 మధ్యకాలంలో విక్రయాల వృద్ధి 11 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. మార్జిన్లు స్థిరంగా ఉండొచ్చని పేర్కొంది. అందువల్ల స్టాక్‌పై బై కాల్‌ను కొనసాగిస్తున్నామని తెలిపింది. కాగా కంపెనీలో ప్రమోటర్ల వాటా 73 శాతంగా ఉంది. ఎఫ్‌ఐఐల వాటా 1.5 శాతంగా, డీఐఐల వాటా 9 శాతంగా, ఇతరుల వాటా 16.5 శాతంగా కొనసాగుతోంది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1536397989AksoNobel_06Sep18_Kotak_PCG_00541.pdf)

You may be interested

ఈ వారం పిక్‌: ఇంజినీర్స్‌ ఇండియా

Saturday 8th September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఈ వారం స్టాక్‌ పిక్‌గా ఇంజినీర్స్‌ ఇండియాను సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఇంజినీర్స్‌ ఇండియా (ఈఐఎల్‌) ఇండస్ట్రీ: ఇంజినీరింగ్‌ ప్రస్తుత ధర: రూ.126 టార్గెట్‌ ప్రైస్‌: రూ.144-165 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ప్రభుత్వ రంగానికి చెందిన ఇంజినీర్స్‌ ఇండియాపై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే 4-6 త్రైమాసికాల్లో స్టాక్‌ ధర రూ.144-165 శ్రేణికి చేరొచ్చని టార్గెట్‌ను

ఫినోలెక్స్‌ కేబుల్స్‌ కొనొచ్చు: జియోజిత్‌ ఫైనాన్స్‌

Saturday 8th September 2018

కేబుల్స్‌ తయారీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ‘‘ఫినోలెక్స్‌ కేబుల్స్‌’’ షేరు కొనొచ్చని జియోజిత్‌ ఫైనాన్స్‌ సిఫార్సు చేస్తోంది.  దేశీయ కేబుల్స్‌ మార్కెట్లో ఎక్కువ వాటా కలిగి ఉండి కేబుల్స్‌ పరిశ్రమను శాసిస్తోన్న ఫినోలెక్స్‌ సంస్థపై జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంచనాలు ఇప్పుడు చూద్దాం..! రేటింగ్‌:- కొనొచ్చు ప్రస్తుత ధర:- రూ.561 టార్గెట్‌ ధర:- రూ.649 ఆదాయపు అంచనా:- 17 శాతం విశ్లేషణ:- ఫినోలెక్స్‌ సంస్థ దేశంలో ప్రతి ఏటా విద్యుత్‌ కేబుల్స్‌ తయారీ మార్కెట్‌లో 80 శాతం, టెలికమ్యూనికేషన్స్‌

Most from this category