STOCKS

News


ఎన్‌ఎండీసీపై కోటక్‌ పాజిటివ్‌

Saturday 1st September 2018
Markets_main1535785872.png-19872

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌.. దేశీ దిగ్గజ ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌ కంపెనీ ఎన్‌ఎండీసీపై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..

బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌
స్టాక్‌: ఎన్‌ఎండీసీ
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.111
టార్గెట్‌ ప్రైస్‌: రూ.125
బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా ఎన్‌ఎండీసీపై బుల్లిష్‌గా ఉంది. కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.125గా నిర్ణయించింది. కంపెనీ ఈ ఏడాది ఇప్పటి దాకా దేశీ ఐరన్‌ ఓర్‌ ధరలను మూడు సార్లు సవరించిందని పేర్కొంది. అంతర్జాతీయ ఐరన్‌ ఓర్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత, పెల్లెట్‌ ధరల పెరుగుదల వంటి అంశాలు ఇందుకు కారణమని తెలిపింది. ఐరన్‌ ఓర్‌ ధరల ఔట్‌లుక్‌పై మధ్యస్థం నుంచి దీర్ఘకాలంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నామని పేర్కొంది. అయితే రానున్న నెలల్లో ధరలు అధికంగా ఉండొచ్చని తెలిపింది. ఒడిశా మైనింగ్‌ సంస్థల ధరల పెంపును ఇందుకు కారణంగా పేర్కొంది. దీనివల్ల కంపెనీ ఎర్నింగ్స్‌ పెరుగుతాయని తెలిపింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ నుంచి అధిక ఐరన్‌ ఓర్‌ సరఫరా వల్ల మధ్యస్థ కాలంలో ధరలు తగ్గొచ్చని అంచనా వేసింది. అలాగే రానున్న కాలంలో కంపెనీ వ్యయాల పెరుగుదల వల్ల మార్జిన్లపై ఒత్తిడి పెరగొచ్చని పేర్కొంది. అలాగే ధరల పెరుగుదల వల్ల విక్రయాలు పాక్షికంగా తగ్గొచ్చని అంచనా వేసింది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1535785906NMDC.pdf)

You may be interested

రూపీ పతనం.. మార్కెట్‌ గమనం...

Saturday 1st September 2018

పెద్దగా సంబంధం ఉండదంటున్న నిపుణులు ఆగస్టు నెలను బుల్స్‌ విజయవంతంగా ముగించాయి. మరోపక్క రూపాయి రోజురోజుకీ క్షీణిస్తూ దిగజారుతోంది. అయితే ఈక్విటీ బుల్‌రన్‌పై రూపీ పతనం పెద్ద ప్రభావం చూపకపోవచ్చని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 2013 ఆగస్టు- అక్టోబర్‌ మధ్య కాలంలో రూపాయి 17.6 శాతం పతనమైంది. కానీ ఇదే సమయంలో నిఫ్టీ 2.1 శాతం పెరిగింది. 2011 ఆగస్టు- డిసెంబర్‌ కాలంలో రూపీ 22.7 శాతం ఢమాల్‌మంది. ఇదే

ఇండోస్టార్‌ క్యాపిటల్‌ కొనొచ్చు

Saturday 1st September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా ఇండోస్టార్‌ క్యాపిటల్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: సెంట్రమ్‌ స్టాక్‌: ఇండోస్టార్‌ క్యాపిటల్‌ రేటింగ్‌: కొనొచ్చు ఇండస్ట్రీ: ఫైనాన్షియల్స్‌ ప్రస్తుత ధర: రూ.459 టార్గెట్‌ ప్రైస్‌: రూ.600 రిటర్న్‌ అంచనా: 37 శాతం బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌.. ఇండోస్టార్‌ క్యాపిటల్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ధరను రూ.600గా నిర్ణయించింది. బై రేటింగ్‌ ఇచ్చింది. కంపెనీ బిజినెస్‌ మోడల్‌ సరైనా మార్గంలో ఉందని

Most from this category