STOCKS

News


ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ టార్గెట్‌.. 145

Saturday 1st September 2018
Markets_main1535791723.png-19877

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..

బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌
స్టాక్‌: ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.118
టార్గెట్‌ ప్రైస్‌: రూ.145
బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌.. ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.145గా నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో బలహీనమైన పనితీరు కనబర్చిన కంపెనీ కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బలమైన పనితీరు కనబర్చిందని పేర్కొంది. మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌, కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్‌ రెండు విభాగాల్లోనూ మంచి వృద్ధి నమోదయ్యిందని తెలిపింది. అయితే ప్రాజెక్ట్‌ ఇంజినీరింగ్‌ డివిజన్‌ మాత్రం నష్టాల్లోనే ఉందని పేర్కొంది. మొత్తంగా చూస్తే కంపెనీ పనితీరుపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపింది. క్యూ1లో కంపెనీ బలమైన పనితీరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు వృద్ధిపై ధీమాను కలిగిస్తోందని పేర్కొంది. అందువల్ల ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1535791743Allcargo Logistics.pdf)

You may be interested

లాంగ్‌టర్మ్‌ ఔట్‌పర్ఫార్మర్‌: సియారామ్‌ సిల్క్‌

Saturday 1st September 2018

బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా సియారామ్‌ సిల్క్‌ మిల్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: సెంట్రమ్‌ స్టాక్‌: సియారామ్‌ సిల్క్‌ మిల్స్‌ రేటింగ్‌: లాంగ్‌టర్మ్‌ ఔట్‌పర్ఫార్మర్‌ ప్రస్తుత ధర: రూ.557 టార్గెట్‌ ప్రైస్‌: రూ.674 రిటర్న్‌ అంచనా: 21 శాతం బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా సియారామ్‌ సిల్క్‌ మిల్స్‌పై పాజిటివ్‌గా ఉంది. దీర్ఘకాలానికి స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఔట్‌పర్ఫార్మర్‌ రేటింగ్‌ను ఇచ్చింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.674గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి

ఆర్తి ఇండస్ట్రీస్‌ షేరు అదుర్స్‌: అనంద్‌ రాఠి

Saturday 1st September 2018

ముంబై:- స్పెషాలిటీ కెమికల్స్‌ సంస్థ ఆర్తి ఇండస్ట్రీస్‌ షేరకు ఆనంద్‌ రాఠి షేర్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ సంస్థ బై రేటింగ్‌ను కేటాయించింది. సమర్థవంతమైన మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ, గృహ సంరక్షణ ఉత్పత్తు తయారీ దృష్టి, రానున్న మూడేళ్లలో కంపెనీ చక్రీయ వార్షిక వృద్ధి అంచనా పెరుగుదల తదితర అంశాలు ఆర్తి ఇండస్ట్రీస్‌కు కలిసొచ్చే అంశాలని ఆనంద్‌ రాఠి సంస్థ అంటోంది.   సమర్థవంతమైన మేనేజ్‌మెంట్‌:- నిర్వహణ సామర్థ్య నైపుణ్య లక్షణాలు పుష్కలంగా

Most from this category