STOCKS

News


ఈ స్టాక్స్‌పై కోటక్‌ బుల్లిష్‌

Saturday 27th October 2018
Markets_main1540628457.png-21536

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ నాలుగు స్టాక్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..

జీనస్‌ పవర్‌ ఇన్‌ఫ్రా
జీనస్‌ పవర్‌ ఇన్‌ఫ్రా స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. కంపెనీ క్యూ2లో మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈబీటా అంచనాలు బాగున్నాయి. బలమైన ఆర్డర్‌ బుక్‌ సానుకూల అంశం. సమర్ధవంతమైన పనితీరు వల్ల ఆదాయంలో బలమైన వృద్ధి నమోదయ్యింది. ఈబీటా మార్జిన్లు పెరిగాయి. వార్షికంగా చూస్తే ఆర్డర్‌ బుక్‌ రెట్టింపు అయ్యింది. వ్యాల్యుయేషన్స్ ఆమోదయోగ్యంగా ఉన్నాయి. 

రాడికో ఖైటాన్‌
ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.431గా నిర్ణయించాం. కంపెనీ క్యూ2 ఎర్నింగ్స్‌ అంచనాలు మించాయి. బలమైన ఈబీటా మార్జిన్లు నమోదయ్యాయి. వార్షికంగా చూస్తే నికర ఆదాయం 15 శాతానికిపైగా పెరిగింది. ఈబీటా మార్జిన్ల పెరుగుదల నేపథ్యంలో ఈపీఎస్‌ అంచనాలను పెంచతున్నాం. 

సైయంట్‌
సైయంట్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.785గా నిర్ణయిస్తున్నాం. క్యూ2లో కంపెనీ ఆదాయం వార్షికంగా చూస్తే 5 శాతం (డాలర్‌ రూపంలో) పెరిగింది. ఇది అంచనాల కన్నా ఎక్కువ కావడం గమనార్హం. మార్జిన్లు కూడా అంచనాలకు పైనే ఉన్నాయి. 

జెన్‌సర్‌ టెక్నాలజీస్‌
ఈ స్టాక్‌ను అలాగే అంటిపెట్టుకోవచ్చు. రూ.257 టార్గెట్‌ ప్రైస్‌గా నిర్ణయించాం. కంపెనీ క్యూ2 ఆదాయ వృద్ధి (డాలర్‌ పరంగా) అంచనాల కన్నా కొంచెం దిగువునే ఉంది. వేతనాల పెంపు వల్ల ఈబీటా మార్జిన్లు తగ్గాయి. కంపెనీ డిజిటల్‌ వ్యాపారంలోనూ వృద్ధి నెమ్మదించింది. డీల్స్‌ ఆరోగ్యకరంగానే ఉన్నాయి. డిజిటల్‌ డీల్స్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కంపెనీ గత రెండేళ్లలో నాలుగు కంపెనీలను కొనుగోలు చేసింది. వీటి వల్ల ఆదాయంలో వృద్ధి నమోదు కావొచ్చు. 



You may be interested

కజారియా సిరామిక్స్‌ కొనొచ్చు: కోటక్‌ సెక్యూరిటీస్‌

Saturday 27th October 2018

ముంబై:- టైల్స్‌ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న కజారియా సిరామిక్స్‌కు బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. షేరు పేరు:- కజారియా సిరామిక్స్‌ రంగం:- టైల్స్‌ తయారీ రేటింగ్‌:- కొనొచ్చు టార్గెట్‌ ధర:- రూ.500 విశ్లేషణ:- కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఫలితాలను ప్రకటించింది. నికర లాభం రూ.50.2 కోట్లను సాధించింది. అమ్మకాలు 11 శాతం పెరిగాయి. ఆదాయం 8.1 శాతం పెరిగి రూ.725 కోట్లను నమోదు చేసింది.

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌ సిఫార్సులు..

Saturday 27th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పలు స్టాక్స్‌పై వివిధ రకాల సిఫార్సులు చేసింది. అవేంటివో చూద్దాం..  మారుతీ సుజుకీ ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.8,252గా నిర్ణయించాం. మారుతీ క్యూ2లో అంచనాల కన్నా కొంచెం మంచి పనితీరు కనబర్చింది. ఇంధన ధరల పెరుగుదల, వరదలు, అధిక వడ్డీ రేట్ల, ఇన్సూరెన్స్‌ ‍వ్యయాల పెరుగుదల వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రస్తుత పండుగ సీజన్‌లో విక్రయాలు దాదాపు ఫ్లాట్‌గా

Most from this category