STOCKS

News


శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌పై బుల్లిష్‌

Wednesday 21st November 2018
Markets_main1542784551.png-22263

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. 

బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌
స్టాక్‌: శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.842
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,537

కోటక్‌ సెక్యూరిటీస్‌.. శంకర్‌ బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌పై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,537గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత క్యూ2 రెవెన్యూ అంచనాల కన్నా దిగువునే ఉందని తెలిపింది. కేరళ, దక్షిణ కర్నాటక ప్రాంతాల్లో వరదలు ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. రిటైల్‌ విభాగంలో మార్జిన్లు తక్కువగా ఉండటం, ఇన్వెంటరీ నష్టాల వల్ల కంపెనీ మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడిందని తెలిపింది. కంపెనీ ప్రస్తుతం అధిక రెవెన్యూపై దృష్టి కేంద్రీకరించిందని పేర్కొంది. కంపెనీ క్యూ2 ఎర్నింగ్స్‌ను గమనిస్తే రెవెన్యూ వృద్ధి వార్షిక ప్రాతిపదికన 12.6 శాతంగా ఉందని తెలిపింది. స్టోర్ల పెరుగుదల, టికెట్‌ పరిమాణం పెరగడం, కొత్త ప్రొడక్టులు వంటివి ఇందుకు కారణమని పేర్కొంది. మార్జిన్లు తగ్గడం వల్ల నికర లాభం వార్షికంగా 49 శాతం మేర పడిపోయిందని తెలిపింది. వ్యాల్యుయేషన్స్‌ పరంగా చూస్తే స్టాక్స్‌ ఆకర్షణీయంగా ఉందని పేర్కొంది. హోమ్‌ బిల్డింగ్‌ విభాగంలో ఆర్గనైజ్‌డ్‌ రిటైల్‌ వాటా పెరుగుదల వల్ల కంపెనీకి ప్రయోజనం ఉంటుందని తెలిపింది. రిటైల్‌ విభాగంలో వృద్ధికి కంపెనీ అధిక ప్రాధాన్యమిస్తోందని పేర్కొంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది.    

కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1542784705Shankara_14Nov18_Kotak_PCG_00584.pdf)

You may be interested

అమ్మకాలు ఆగినా పతనం ఆగని షేర్లు..

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ సూచీల ట్రెండ్‌లో మార్పువచ్చింది. అక్టోబర్‌ 26న 10,004 పాయింట్ల కనిష్టస్థాయిని నమోదుచేసిన నిఫ్టీ ఆ తరువాత క్రూడ్‌ ధరల పతనంతో 700 పాయింట్ల మేర రికవరీ సాధించింది. 15 సెషన్లలో 10,700 మార్కుకు చేరుకుంది. మార్కెట్‌ కుదుటపడిన కారణంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ) తమ అమ్మకాల ఒత్తిడిని సైతం తగ్గించారు. డిపాజిటరీల డేటా ప్రకారం.. అక్టోబర్‌లో రూ.28,921

ఫార్మా షేర్లు అప్‌

Wednesday 21st November 2018

మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ..,  ఫార్మా షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా సూచి బుధవారం 2శాతం ర్యాలీ చేసింది. డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు ఫార్మా షేర్ల ర్యాలీకి ప్రాతినిధ్యం వహిస్తుంది. డాక్టర్‌ రెడ్డీస్‌ చెందిన సుబోగ్జిన్ జనరిక్ మెడిసన్‌ ఔషధాలకు అమెరికన్ ఫెడరల్ కోర్టులో సానుకూల తీర్పు రావడంతో ఆ కంపెనీ షేర్లు నేటి ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. షేరు

Most from this category