STOCKS

News


కేఈఐ ఇండస్ట్రీస్‌ను కొనవచ్చు: ఆనంద్‌ రాఠి

Saturday 3rd November 2018
Markets_main1541237817.png-21688

విద్యుత్‌ కేబుల్స్‌ తయారీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న కేఈఐ ఇండస్ట్రీస్‌ షేరును కొనవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌ రాఠి అంటుంది. కేఐఈ షేరుపై ఆనంద్‌రాఠి సంస్థ విశ్లేషణలు ఇలా ఉన్నాయి.
రేటింగ్‌:- కొనవచ్చు

ప్రస్తుత ధర రూ.307
టార్గెట్‌ ధర:- రూ.440లు
క్యూ2 ఫలితాలు:- అంచనాలను మించి త్రైమాసిక ఫలితాలను సాధించింది. గత క్యూ2 కాలంతో పోలిస్తే ఈ క్యూ2లో ఆదాయం 32శాతం, ఎబిటా 32శాతం, నికర లాభం 45శాతం వృద్ధిని నమోదు చేసింది. రిటైట్‌ అమ్మకాల్లో  48శాతం వృద్ధిని సాధించి 3.4బిలియన్లకు చేరుకుంది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత కంపెనీ ఎగుమతులపై ప్రభావాన్ని చూపింది.

విశ్లేషణ:- ప్రస్తుతం కంపెనీ వద్ద ఉన్న 39.4 బిలియన్ల విలువైన ఆర్డర్లు.. వచ్చే రెండేళ్ల ఆదాయాలను పెంచేందుకు అవకాశం ఉంది. విద్యుత్‌ కేబుల్‌ రంగంలో ఎక్స్‌ట్రాహైవోల్టేజ్‌ కేబుల్స్‌ అమ్మకాలు కంపెనీ మార్జిన్లను పెంచుతాయి. పాథరీ వద్ద ‘‘లో ఓల్టేజ్‌ పవర్’’ (ఎల్‌ టీ) కేబుల్స్ యొక్క సామర్ధ్య విస్తరణ పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాదిలోగా హై ఓల్టేజ్‌ కేబుల్స్‌ విస్తరణ కూడా పూర్తి అవుతుంది. నిర్మాణంలో ఉన్న రూ.90కోట్ల విలువైన హౌస్‌వైర్‌ ఫ్యాక్టరీ కూడా వచ్చే రెండేళ్లలో పూర్తి అవనుంది. ఈ యూనిట్ల నుంచి కంపెనీ రూ.600 కోట్ల వార్షిక ఆదాయాన్ని అంచనా వేస్తుంది.
వాల్యూవేషన్‌:- బలమైన ఆదాయ వృద్ధి దృష్ట్యా కంపెనీ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయిస్తున్నాం.
సవాళ్లు:- రోజు రోజుకూ పెరుగుతున్న ముడిసరుకు ధరలు, పెరుగుతున్న వడ్డీ రేట్లు తదితర అంశాలు కంపెనీ ఆదాయానికి సవాళ్లు విసురుతున్నాయి.

View Pdf One (1541238031KEII_CU_011118.pdf)

You may be interested

మారికో కొనొచ్చు- హెచ్‌డీఎఫ్‌సీ

Saturday 3rd November 2018

కంపెనీ: మారికో లిమిటెడ్‌ సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.337 (నవంబర్‌ 3, 2018న) టార్గెట్‌ ధర: రూ.380 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.388 /283 మారికో లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక(క్యూ2) ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగా ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో

గ్రాన్యుల్స్ ఇండియా టార్గెట్‌ రూ.170

Saturday 3rd November 2018

కంపెనీ: గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్‌ సిఫార్సు: సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ధర: రూ.100 (నవంబర్‌ 3, 2018న) టార్గెట్‌ ధర: రూ.170 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.150 /71 గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక(క్యూ2) ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగా ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు సెంట్రమ్‌ వెల్లడించింది. సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద

Most from this category