STOCKS

News


కజారియా సిరామిక్స్‌ కొనొచ్చు: కోటక్‌ సెక్యూరిటీస్‌

Saturday 27th October 2018
Markets_main1540628925.png-21537

ముంబై:- టైల్స్‌ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న కజారియా సిరామిక్స్‌కు బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది.
షేరు పేరు:- కజారియా సిరామిక్స్‌
రంగం:- టైల్స్‌ తయారీ
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ.500
విశ్లేషణ:- కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఫలితాలను ప్రకటించింది. నికర లాభం రూ.50.2 కోట్లను సాధించింది. అమ్మకాలు 11 శాతం పెరిగాయి. ఆదాయం 8.1 శాతం పెరిగి రూ.725 కోట్లను నమోదు చేసింది. టైల్స్‌ విభాగంలో 6.3 శాతం వృద్ధిని సాధించింది. గ్యాస్‌ ధర పెరగడంతో మార్జిన్లు మాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఈ త్రైమాసికంలో సిరోసోలో కంపెనీలో తన వాటాను రూ.110 మిలియన్లకు విక్రయించింది. సెప్టెబంర్‌లో తన అనుబంధ సంస్థలో 30 శాతం వాటాను కొనుగోలు చేసింది.
ఆం‍ధ్రప్రదేశ్‌లో 5ఎంఎస్‌ఎం పీ.ఏ.తో  నూతనంగా ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఆ ప్లాంట్‌ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించనుంది.  
(కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయగలరు...)

View Pdf One (1540629332Kajaria_26Oct18_Kotak_PCG_00573-1.pdf)

You may be interested

వ్యాల్యు పిక్‌: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌

Saturday 27th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  స్టాక్‌: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.966 టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,182 ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌పై ఆనందరాఠి బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. స్టాక్‌ ధర వచ్చే ఏడాది కాలంలో రూ.1,182లకు చేరొచ్చని అంచనా వేస్తోంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీని నెక్ట్స్‌-జనరేషన్‌ గ్లోబల్‌ టెక్నాలజీ కంపెనీగా అభివర్ణించింది. కంపెనీకి

ఈ స్టాక్స్‌పై కోటక్‌ బుల్లిష్‌

Saturday 27th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ నాలుగు స్టాక్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. జీనస్‌ పవర్‌ ఇన్‌ఫ్రా జీనస్‌ పవర్‌ ఇన్‌ఫ్రా స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. కంపెనీ క్యూ2లో మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈబీటా అంచనాలు బాగున్నాయి. బలమైన ఆర్డర్‌ బుక్‌ సానుకూల అంశం. సమర్ధవంతమైన పనితీరు వల్ల ఆదాయంలో బలమైన వృద్ధి నమోదయ్యింది. ఈబీటా మార్జిన్లు పెరిగాయి. వార్షికంగా చూస్తే ఆర్డర్‌ బుక్‌ రెట్టింపు అయ్యింది. వ్యాల్యుయేషన్స్ ఆమోదయోగ్యంగా

Most from this category