STOCKS

News


ఈ స్టాక్‌పై కన్నేయండి..

Friday 10th August 2018
Markets_main1533886330.png-19118

బ్రోకరేజ్‌: జేఎం ఫైనాన్షియల్‌ 
స్టాక్‌: హీరో మోటొకార్ప్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.4,050
ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో హీరో మోటొకార్ప్‌ ఆరోగ్యకరమైన 15.6 శాతం ఈబీటా మార్జిన్లను ప్రకటించింది. ధర ఒత్తిళ్లు, ఎంట్రీ లెవెల్‌లో తీవ్రమైన పోటీ వంటి అంశాలున్నప్పటికీ ఆకర్షణీయ ఫలితాలను వెల్లడించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మెరుగుదల, సాధారణ రుతువపనాలు, కనీస మద్దతు ధర పెంపు నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో టూవీలర్లకు బలమైన డిమాండ్‌ ఉండొచ్చని అంచనా వేసింది. బ్రాండ్‌ రీకాల్‌, నెట్‌వర్క్‌ విస్తరణ, ప్రొడక్ట్‌ ఫోర్ట్‌ఫోలియో, అగ్రస్థానం వంటి అంశాలు కంపెనీకి సానుకూల అంశమని పేర్కొంది. 200 సీసీ బైక్‌ ఆవిష్కరణ, 125 సీసీ విభాగంలో కొత్త స్కూటర్లను మార్కెట్‌ తీసుకువస్తే మార్కెట్‌ వాటా కాపాడుకోవచ్చని తెలిపింది. వీటివల్ల స్టాక్‌కు బై రేటింగ్‌ ఇస్తున్నామని, రూ.4,050ని టార్గెట్‌ ప్రైస్‌గా నిర్ణయించామని పేర్కొంది. కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణలు తక్కువగా ఉండటం, ప్రీమియం మోటార్‌సైకిల్‌, స్కూటర్‌ విభాగాల్లో తక్కువ మార్కెట్‌ వాటా కలిగి ఉండటం రిస్క్‌ అంశాలని తెలిపింది.

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
స్టాక్‌: హీరో మోటొకార్ప్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.3,322
టార్గెట్‌ ప్రైస్‌:రూ.4,403
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కూడా హీరో మోటొకార్ప్‌ షేరు కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తోంది. దీనికి రూ.4,403 టార్గెట్‌ ప్రైస్‌ను నిర్ణయించింది. దేశీ మోటార్‌సైకిల్‌ మార్కెట్‌లో 51.2 శాతం వాటా కలిగి ఉండటం, ప్రస్తుత క్యూ1లో బలమైన అమ్మకాలు, జూలై నెలలోని ధరల పెంపు, సెప్టెంబర్‌లో మళ్లీ ధరల పెంపు ఉండొచ్చనే అంచనా, ఎగమతుల పెరుగుదల, వచ్చే క్యూ2లోనూ బలమైన అమ్మకాలు ఉంటాయనే అంచనా కారణంగా స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. అలాగే కంపెనీ డ్యూయెట్‌ 125 సీసీ, మాస్ట్రో 125 సీసీ స్కూటర్లను, ఎక్స్‌ట్రీమ్‌ 200 సీసీ బైక్‌ను తీసుకురానుంది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత మరింత సమాచారం కోసం కింది లింక్‌పై క్లిక్‌ చేయండి... 

View Pdf One (1533887904HeroMotocorp_-_1QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాకు బై రేటింగ్‌

Friday 10th August 2018

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌  రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.194 టార్గెట్‌ ప్రైస్‌: రూ.328 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌పై బుల్లిష్‌గా ఉంది. కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తోంది. కంపెనీ ప్రస్తుత జూన్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలు మించాయని పేర్కొంది. ఇటీవల కాలంలో స్టాక్‌ ధరలో కరెక‌్షన్‌ ఏర్పడిందని అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో అర్ధభాగంలో నాలుగు పెద్ద ప్రాజెక్టుల వల్ల ఆదాయం మరింత పెరగొచ్చని తెలిపింది.

మెజెస్కోపై బుల్లిష్‌

Friday 10th August 2018

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: మెజెస్కో ఇండస్ట్రీ: టెక్నాలజీ ప్రస్తుత ధర: రూ.500 టార్గెట్‌ ప్రైస్‌: రూ.575 ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి టెక్నాలజీ సంస్థ మెజెస్కోపై బుల్లిష్‌గా ఉంది. కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తోంది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.575గా నిర్ణయించింది. కరెన్సీ మారక విలువ తగ్గుదల, స్థిర వ్యయాలు వల్ల కంపెనీ మార్జిన్లు బాగుంగొచ్చని అంచనా వేస్తోంది. కంపెనీ ఆదాయం స్థిరంగా ఉందని పేర్కొంది. మెజెస్కో ఇటీవల కాలంలో క్లౌడ్‌ సర్వీసులకు అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. మెట్‌లైఫ్‌

Most from this category