News


డాలర్‌.. ఓవర్‌ వాల్యూడ్‌!

Saturday 29th September 2018
Markets_main1538215087.png-20715

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నివేదిక
యూఎస్‌లో మందగమనం వచ్చే అవకాశాలు బాగా తగ్గాయని, క్రమంగా వడ్డీరేట్లను పెంచుతామని ఫెడ్‌ చైర్మన్‌ చేసిన వ్యాఖ్యలు డాలర్‌ ఇండెక్స్‌లో పరుగులకు దారితీసాయి. ఈ ఏడాది పలు కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బాగా బలపడుతోంది. ఫిబ్రవరి నుంచి డీఎక్స్‌వై(డాలర్‌ ఇండెక్స్‌) ఆరు శాతం లాభపడింది. యూఎస్‌ ఎకానమీ మంచి వృద్ధి నమోదు చేస్తుండడం, ఫెడ్‌ రేట్లను పెంచడంతో డాలర్‌పై పెట్టుబడులు పెరిగాయి. ఇదే సమయంలో వర్ధమాన కరెన్సీలు భారీగా పతనమయ్యాయి. అయితే ఈ పరిస్థితిలో మార్పు రానుందని, డాలర్‌ బాగా ఓవర్‌వాల్యూడ్‌గా ఉందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అభిప్రాయపడుతోంది. త్వరలో డాలర్‌ ఇండెక్స్‌లో కరెక‌్షన్‌ తప్పదని అంచనా వేసింది. ఈ ఏడాది చివరకల్లా డాలర్‌లో పతనం వస్తుందని తెలిపింది. అయితే అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలతో డాలర్‌ విలువలో కరెక‌్షన్‌ ఎక్కువగా ఉంటుందని, వర్ధమాన కరెన్సీలు పెద్దగా మెరుగుదల చూపకపోవచ్చని తెలిపింది. వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ నిధుల ఉపసంహరణ జరుగుతుండడంతో ఈ దేశాల కరెన్సీలు పెద్దగా కోలుకోకపోవచ్చిని అంచనా వేసింది. వచ్చే ఏడాది కాలంలో రూపాయి కాస్త రికవరీ చూపి 69- 70 స్థాయిల్లో కొనసాగవచ్చని తెలిపింది.

మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన పీడీఎఫ్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి....

View Pdf One (1538215127How overvalued is the dollar_September 2018.pdf)

You may be interested

ర్యాలీల్లో షార్ట్‌ చేయండి!

Saturday 29th September 2018

చార్ట్‌వ్యూ ఇండియా సూచన ఆల్‌టైమ్‌ హై 11760 పాయింట్లను చేరిన తర్వాత ఆగకుండా దాదాపు 8 శాతం మేర నిఫ్టీ పతనమైంది. ఈ నేపథ్యంలో సూచీల్లో కొంతమేర పుల్‌బ్యాక్‌ ర్యాలీ రావచ్చని చార్ట్‌వ్యూ ఇండియా అంచనా వేసింది. అందువల్ల కనిష్ఠస్థాయిల్లో షార్ట్‌ చేయవద్దని, కాస్త పెరిగిన సమయాలను షార్ట్‌ చేయడానికి వినియోగించుకోవాలని సూచించింది. 10866 పాయింట్ల వద్ద నిఫ్టీకి కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోందని విశ్లేషించింది. ఈ స్థాయిని రెండు మార్లు

నెలలో 14 లక్షల కోట్లు ఆవిరి

Saturday 29th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసిన ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌ ఒక్క నెలలోనే రూ.14 లక్షల కోట్లు పోగుట్టుకున్నారు. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 6 శాతానికి పైగా పడిపోయింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ చెల్లింపుల డిఫాల్ట్‌ నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీల్లో లిక్విడిటీ ఆందోళనలు పెరగడం ఇందుకు ప్రధాన కారణం.  మొత్తం ఇన్వెస్టర్ల సంపద (బీఎస్‌ఈలో లిస్టైన అన్ని స్టాక్స్‌ మొత్తం మార్కెట్‌ వ్యాల్యు) సెప్టెంబర్‌లో రూ.14.48 లక్షల కోట్ల తగ్గుదలతో రూ.144.86 లక్షల కోట్లకు క్షీణించింది. 2018

Most from this category