STOCKS

News


వీటిని హోల్డ్‌ చేయొచ్చు

Saturday 11th August 2018
Markets_main1533974788.png-19179

బ్రోకరేజ్‌ సంస్థ జేఎం ఫైనాన్షియల్‌ తాజాగా మూడు స్టాక్స్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం..

స్టాక్‌: పీఎన్‌బీ
రేటింగ్‌: హోల్డ్‌
ప్రస్తుత ధర: రూ.83
టార్గెట్‌ ప్రైస్‌: రూ.85
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌, క్యూ1) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్‌ రూ.940 కోట్ల నికర నష్టా‍న్ని నమోదు చేసింది. త్రైమాసికం పరంగా చూస్తే బ్యాంక్‌ స్థూల ఎన్‌పీఏఎలు 18.38 శాతం నుంచి 18.26 శాతానికి, నికర ఎన్‌పీఏలు 11.24 శాతం నుంచి 10.58 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం రూ.4,692 కోట్లుగా ఉంది. కేటాయింపులు రూ.5,758 కోట్లుగా ఉన్నాయి. ఇవి త్రైమాసికం పరంగా తగ్గితే, వార్షికంగా పెరిగాయి. బ్యాంకుకు సంబంధించి బలమైన డిపాజిట్లు సానుకూల అంశం. ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చు.

స్టాక్‌: పీఐ ఇండస్ట్రీస్‌
రేటింగ్‌: హోల్డ్‌
ప్రస్తుత ధర: రూ.772
టార్గెట్‌ ప్రైస్‌: రూ.775
పీఐ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత క్యూ1లో రూ.81 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది 100 కోట్లు. అంటే 18 శాతం క్షీణించింది. ఆదాయం3 శాతం వృద్ధితో రూ.615 కోట్లకు పెరిగింది. ఈబీటా మార్జిన్లు 19.5 శాతానికి తగ్గాయి. అయినప్పటికీ కంపెనీ వద్ద మిగులు నిధులున్నాయి. సమీప కాలంలో కంపెనీ మంచి పనితీరు కనబరుస్తుందనే అంచనాలున్నాయి. ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది.

స్టాక్‌: గ్రీన్‌ప్లే ఇండస్ట్రీస్‌
రేటింగ్‌: హోల్డ్‌
ప్రస్తుత ధర: రూ.205
టార్గెట్‌ ప్రైస్‌: రూ.230
గ్రీన్‌ఫ్లే మరోసారి నిరుత్సాహకరమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన ఈబీటా, నికర ఆదాయం వరుసగా 15 శాతం, 21 శాతం తగ్గాయి. కంపెనీ రానున్న రోజుల్లో ప్లై బిజినెస్‌పై ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ స్టాక్‌ను కూడా హోల్డ్‌ చేయవచ్చు. 



You may be interested

ఇన్ఫోసిస్‌లో కొంత వాటా విక్రయించిన శిబులాల్‌

Saturday 11th August 2018

బెంగళూరు:- ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈఓ ఎస్‌డీ శిబులాల్ కుటుంబం ఇన్ఫోసిస్‌లో తమ వాటాను విక్రయించింది. ఈ మేరకు ఎస్‌డీ శిబులాల్ తన కుటుంబ సభ్యులు ఆగస్ట్‌ 08-10 మధ్య కాలంలో 11 కోట్ల ఈక్విటీ షేర్లును విక్రయించినట్లు అధికారికంగా ప్రకటించారు. వ్యక్తిగత, సేవాకార్యక్రమాలకు డబ్బు అవసరమైనందున స్వల్ప మొత్తంలో కంపెనీలో ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు ఆయన తెలిపారు. వాటా విక్రయం తర్వాత కూడా కంపెనీకి తన కుటుంబానికి

ఈ మూడు స్టాక్స్‌ కొనొచ్చు..

Saturday 11th August 2018

బ్రోకరేజ్‌ సంస్థ జేఎం ఫైనాన్సియల్‌ మూడు స్టాక్స్‌ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తోంది. ఆ షేర్లివే.. స్టాక్‌: రిలయన్స్‌ నిప్పాన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.237 టార్గెట్‌ ప్రైస్‌: రూ.330 అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఏఎంసీ) పరిశ్రమలో ఇటీవల కాలంలో స్థూల కమిషన్‌ చెల్లింపులు పెరిగాయని జేఎం ఫైనాన్షియల్‌ పేర్కొంది. ఇదే సమయంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి గత రెండేళ్లలో ఇన్వెస్ట్‌మెంట్లు కూడా గణనీయంగా పెరిగాయని తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో టాప్‌

Most from this category