STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌ సిఫార్సులు..

Saturday 27th October 2018
Markets_main1540626578.png-21535

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పలు స్టాక్స్‌పై వివిధ రకాల సిఫార్సులు చేసింది. అవేంటివో చూద్దాం.. 

మారుతీ సుజుకీ
ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.8,252గా నిర్ణయించాం. మారుతీ క్యూ2లో అంచనాల కన్నా కొంచెం మంచి పనితీరు కనబర్చింది. ఇంధన ధరల పెరుగుదల, వరదలు, అధిక వడ్డీ రేట్ల, ఇన్సూరెన్స్‌ ‍వ్యయాల పెరుగుదల వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రస్తుత పండుగ సీజన్‌లో విక్రయాలు దాదాపు ఫ్లాట్‌గా ఉన్నాయి. అయితే దీపావళి నేపథ్యంలో డిమాండ్‌ పెరగొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. గ్రామీణ డిమాండ్‌ పెరుగుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం విక్రయాల్లో రెండంకెల వృద్ధి లక్ష్యాన్ని చేరుకుంటామని కంపెనీ ధీమాగా ఉంది. కరెన్సీ ఒడిదుడుకులు, డిస్కౌంట్ల కారణంగా మార్జిన్లపై ఒత్తిడి కొనసాగవచ్చు. సామర్థ్యం పెంపు, గ్రామీణ మార్కెట్‌, విక్రయాల వృద్ధి, ప్యాసింజర్‌ మార్కెట్‌ వాటా, ఆరోగ్యకరమైన ఆర్‌వోఈ/ఆర్‌వోసీసీ వంటి అంశాల నేపథ్యంలో మారుతీపై పాజిటివ్‌గా ఉన్నాం. స్టాక్‌ ధరలో ఇటీవలి కరెక‌్షన్‌ ఇన్వెస్టర్లకు మంచి అవకాశం లాంటిది. 

విప్రో
విప్రో అంచనా వేసిన దానికన్నా మంచి పనితీరు కనబర్చింది. బీఎఫ్‌ఎస్‌ఐలో బలమైన వృద్ధి, డిజిటల్‌ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం వంటి అంశాలు సానుకూలమైనవి. వృద్ధి, మార్జిన్‌ రికవరీ బలంగా ఉంది. అయితే స్థిరమైన పనితీరు కనబర్చడంలో కంపెనీ విఫలమౌతూ వస్తోంది. కొత్త డీల్స్‌, హెచ్‌పీఎస్‌ రికవరీ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో ఆదాయ వృద్ధి ఉంటుందని అంచనా వేస్తోంది. క్యూ3లో సీజన్‌ కారణంగా రెవెన్యూ వృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. మార్జిన్లు స్థిరంగా ఉండొచ్చు. బైబ్యాక్‌ ప్రకటన వెలువడితే అది స్టాక్‌కు పాజిటివ్‌ అవుతుంది. మొత్తంగా స్టాక్‌పై న్యూట్రల్‌గా ఉన్నాం. 

ర్యాలీస్‌ ఇండియా
ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. రూ.220ని టార్గెట్‌ ప్రైస్‌గా నిర్ణయించాం. కంపెనీ క్యూ2లో మంచి ఎర్నింగ్స్‌ను ప్రకటించింది. మధ్యస్థ కాలంలో మార్జిన్లపై ఒత్తిడి ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. చైనా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం ఇందుకు కారణం. ముడిపదార్ధాల వ్యయాల పెరుగుదల భారాన్ని తప్పించుకోవడానికి ధరలను సరిగా పెంచకపోవడం వంటివి ప్రతికూల అంశాలు. కొత్త ప్రొడక్టులను తీసుకురావడం, కొత్త కార్యక్రమాల ఆవిష్కరణ వంటివి ఫలితాలను అందిస్తున్నాయి. పటిష్టమైన డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌, అంతర్జాతీయ మార్కెట్లలో వృద్ధి, బలమైన బ్రాండ్‌ వంటివి సమీప కాలంలో స్టాక్‌పై సానుకూల ప్రభావం చూపొచ్చు. 

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌
ప్రైవేట్‌ రంగానికి చెందిన ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌పై సానుకూలంగా ఉన్నాం. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.618గా నిర్ణయించాం. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ క్యూ2 ఎర్నింగ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. బలమైన రుణ వృద్ధి, ఆరోగ్యకరమైన ఎన్‌ఐఎం, రుణ నాణ్యత, ఫీజు ఆదాయం పెరుగుదల అంచనాలు వంటివి సానుకూల అంశాలు. 

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌
ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. రూ.397 టార్గెట్‌ ప్రైస్‌గా నిర్ణయించాం. కంపెనీ క్యూ2లో మంచి ఆర్థిక ఫలితాలనే ప్రకటించింది. ఏయూఎంలో వృద్ధి కనిపించింది. సమీప కాలంలో చూస్తే మార్జిన్లలో మెరుగుదల కనిపించేంత వరకు స్టాక్‌ ధర అక్కడక్కడే కదలాడవచ్చు. 

అలెంబిక్‌ ఫార్మా
అలెంబిక్‌ ఫార్మాపై తటస్థంగా ఉన్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.610గా నిర్ణయించాం. కంపెనీ క్యూ2లో అదిరిపోయే ఫలితాలను ప్రకటించింది. అమెరికాలో వల్‌సర్టన్‌ వ్యాపారం ఇందుకు కారణం. అయితే డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండటం, ధరలు సాధారణ స్థాయికి రావడం కారణంగా భవిష్యత్‌లో ఇదే ట్రెండ్‌ కొనసాగుతుందని అంచనా వేయడం లేదు. కార్యకలాపాల విస్తరణ కోసం ఇన్వెస్ట్‌మెంట్లను కొసాగిస్తోంది. భవిష్యత్‌లో వీటి ఫలితం కనిపిస్తుంది. అమెరికాలో కొత్త ప్రొడక్టుల విక్రయానికి అనుమతులు లభిస్తున్నాయి. ఇండియా విక్రయాలు వార్షికంగా ఫ్లాట్‌గా, త్రైమాసికం పరంగా 16 శాతం పెరిగాయి. 

ఎస్‌బీఐ లైఫ్‌
ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.735గా నిర్ణయించాం. కంపెనీ క్యూ2లో మంచి ఎర్నింగ్స్‌ ప్రకటించింది. బలమైన డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటం వంటివి సానుకూల అంశాలు. అందుకే స్టాక్‌పై బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. ఏయూఎం వార్షికంగా 20 శాతం, త్రైమాసికంగా 5 శాతం పెరిగింది. రానున్న కాలంలో ప్రీమియం వసూళ్లు పెరగొచ్చని అంచనా వేస్తున్నాం. 
 



You may be interested

ఈ స్టాక్స్‌పై కోటక్‌ బుల్లిష్‌

Saturday 27th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ నాలుగు స్టాక్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. జీనస్‌ పవర్‌ ఇన్‌ఫ్రా జీనస్‌ పవర్‌ ఇన్‌ఫ్రా స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. కంపెనీ క్యూ2లో మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈబీటా అంచనాలు బాగున్నాయి. బలమైన ఆర్డర్‌ బుక్‌ సానుకూల అంశం. సమర్ధవంతమైన పనితీరు వల్ల ఆదాయంలో బలమైన వృద్ధి నమోదయ్యింది. ఈబీటా మార్జిన్లు పెరిగాయి. వార్షికంగా చూస్తే ఆర్డర్‌ బుక్‌ రెట్టింపు అయ్యింది. వ్యాల్యుయేషన్స్ ఆమోదయోగ్యంగా

జ్యోతి ల్యాబ్స్‌ను హోల్డ్‌ చేయవచ్చు: జియోజిత్‌

Saturday 27th October 2018

ముంబై:- ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ జియోజిత్‌.. ఎఫ్‌ఎంసీజీ సంస్థ జ్యోతి ల్యాబొరేటరీస్ షేరును హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. దేశీయ ఎంఫ్‌సీజీ సంస్థగా పేరుగాంచిన జ్యోతి ల్యాబ్స్‌.. దోమల, క్రిమికీటకాల నిరోధకాలతో పాటు డిష్‌ వాషింగ్‌, ఫ్యాబ్రిక్‌, పర్సనల్‌ సంరక్షణ ఉత్పత్తులను తయారీ చేస్తుంది. ఇటీవలే కంపెనీ తమ ఉత్పత్తులపై ధరలు పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉండటం కంపెనీ షేరుకు కలిసొచ్చే అంశమని జియోజిత్‌ అంటోంది.

Most from this category