STOCKS

News


జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కొనొచ్చు..

Saturday 13th October 2018
Markets_main1539413361.png-21127

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌, ఆనంద్‌రాఠి తాజాగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశాయి. ఎందుకో చూద్దాం..
 
స్టాక్‌: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌
ఇండస్ట్రీ: మీడియా
ప్రస్తుత ధర: రూ.466

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
టార్గెట్‌ ప్రైస్‌: రూ.585
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ధరను రూ.585గా నిర్ణయించింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రస్తుత క్వార్టర్‌లోనూ బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిందని పేర్కొంది. పీఏటీ అంచనాలకు అనువుగానే ఉందని తెలిపింది. వార్షికంగా చూస్తే రెవెన్యూ 25 శాతానికిపైగా, ఈబీటా 38 శాతానికిపైగా పెరిగిందని పేర్కొంది. అడ్వర్టైజింగ్‌ రెవెన్యూలో 22.7 శాతం వృద్ధి నమోదయ్యిందని తెలిపింది. సబ్‌స్క్రిప్షన్‌లో 21.3 శాతం పెరుగుదల కనిపించిందని పేర్కొంది. హిందీ, రీజినల్‌ జీఈసీ చానళ్లలో బలమైన పనితీరు వల్ల జీ నెట్‌వర్క్‌ వ్యూయర్‌షిప్‌లో మెరుగుదల కనిపిందని తెలిపింది. మార్కెట్‌ వాటా పెంపు, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికలు, కార్యకలాపాల విస్తరణ వంటివి సానుకూల అంశాలని పేర్కొంది. సంస్థ డిజిటల్‌ విభాగంలోనూ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపింది. అందువల్ల జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. 

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి
టార్గెట్‌ ప్రైస్‌: రూ.530
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బలమైన దేశీయ వృద్ధి భవిష్యత్‌లోనూ కొనసాగవచ్చని ఆనంద్‌రాఠి అంచనా వేసింది. సంస్థ ప్రధానంగా రీజినల్‌ మార్కెట్లపై దృష్టి కేంద్రీకరించిందని తెలిపింది. కేరళలో జీఈసీ ఆవిష్కరణ సహా తమిళ్‌, కన్నడలో కొత్త చానళ్లు వంటివి ఇందుకు ఉదాహరణగా పేర్కొంది. డిజిటల్‌ విభాగంలో జీ5 ఆవిష్కరణ సానుకూల అంశమని తెలిపింది. స్టాక్‌ గత 5 నెలల్లో 30 శాతం క్షీణించిందని గుర్తుచేసింది. యాడ్ మార్కెట్‌ సానుకూలతలు, మార్కెట్‌ వాటా పెరుగుదల, కార్యకలాపాల విస్తరణ, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికలు, వ్యాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉండటం వంటి అంశాల నేపథ్యంలో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేయండి...

View Pdf One (1539413386Zee_Entertainment_-_2QFY19_-_HDFC_sec.pdf)
View Pdf Two (2074403704Zee_CU_081018.pdf)

You may be interested

పసిడి నష్టాల ముగింపు

Saturday 13th October 2018

ప్రపంచ మార్కెట్లు తిరిగి పుంజుకోవడం పాటు డాలర్‌ ఇండెక్స్‌ బలపడటంతో పసిడి ధర శుక్రవారం నష్టంతో ముగిసింది. అమ్మకాల సునామీతో తల్లడిన అంతర్జాతీయ మార్కెట్లకు ‘‘అమెరికా దిగుమతి గణాంకాలు’’ వృద్ధి ఊరటనిచ్చాయి. మరోవైపు బ్రెగ్జిట్‌ వ్యవహరం నేపథ్యంలో బ్రిటన్‌ కరెన్సీ యూరో కూడా బలహీనపడింది. ఈ కారణాలతో డాలర్‌ ఇండెక్స్‌ మూడు రోజుల వరుస నష్టాలకు ముగింపు పడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో  శుక్రవారం రాత్రి అమెరికాలో 95.06స్థాయికి

పండగ వేళ గృహ శోభ!

Saturday 13th October 2018

సాక్షి, హైదరాబాద్‌:  పండగ సీజన్‌ వస్తే చాలు కొత్త బట్టలు, బైక్, కారు ఎలాగో కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకోవటం సహజం. అందుకే డెవలపర్లు కూడా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఆఫర్లు, రాయితీలను ప్రకటిస్తుంటారు.  2 నెలల్లో 30,400 గృహాలు.. సాధారణ సమయాల్లో కంటే పండగ సీజన్లలోనే కొత్త నివాస సముదాయాలు, ఓపెన్‌ ప్లాట్‌ వెంచర్లు ఎక్కువగా ప్రారంభమవుతుంటాయి కూడా. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అంటే హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఎన్‌సీఆర్, కోల్‌కతా, చెన్నై

Most from this category