మిశ్రమంగా రియల్టీ రంగ ఫలితాలు: హెచ్డీఎఎఫ్సీ
By Sakshi

ముంబై:- ఇటీవల ద్రవ్యత్వ కొరతతో అతలాకుతలమైన రియల్టీ రంగం రెండో త్రైమాసిక ఫలితాలపై హెచ్డీఎఫ్సీ అంచనాలను నివేదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2) రియల్టీ రంగం మిశ్రమ ఆర్థిక ఫలితాలను నమోదు చేయవచ్చని బ్రోకరేజ్ సంస్థ అంచనావేస్తుంది. డీఎల్ఎఫ్, బబేరాయ్, బ్రిగేడ్ కంపెనీలు ఇయర్ టు ఇయర్ బలమైన గణాంకాలను నమోదు చేయవచ్చు. ప్రేస్టేజ్, శోభ, కోట్లే లాభాదాయ పెరుగుదల బలహీనంగా ఉండొచ్చని హెచ్డీఎఫ్సీ అంచనా వేస్తుంది. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ ఈ 3నెలల్లో 25శాతం దిద్దుబాటైంది. ఈ రంగంలో దీర్ఘకాలిక రికవరీ ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ అంటోంది. (రియల్టీ రంగంపై హెచ్డీఎప్సీ మరింత విశ్లేషణకు కింది పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ చేయగలరు.)
అనుకూలాంశాలు:- రెరా చట్టంతో మార్కెట్ వాటా లాభాలను పెంచుతాయి. వాయిదా పద్దతిలో చెల్లింపులు, వడ్డీపై రాయితీలు తదితర కారణాలు ఈ రంగానికి అనుకూలాంశాలు. డెవెలపర్లు పెద్ద ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టాలి. తద్వారా రంగంలో నిధుల ప్రవాహం పెరుగుతోంది. శోభ, ప్రేస్టేజ్, బ్రిగేడ్, కోట్లే కంపెనీలు సముచిత స్థానంలోనే ఉన్నాయి.
ప్రతికూలాంశాలు:- నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్ రంగంలో ద్రవ్యత్వ కొరత, వడ్డీరేట్ల చక్రీయ సైకిల్ తిరగోమనం రియల్టీ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఎన్బీఎఫ్సీ రుణాలు తగ్గిపోవడం వల్ల అమ్మకాల రికవరీ మందగించవచ్చు. ఈ రంగంలో ఈఎంఐల విధానంతో తనఖా రేట్లప్రభావం ఉంటుంది.
You may be interested
అవెన్యూ సూపర్ మార్ట్ లాభం 18 శాతం అప్
Saturday 13th October 2018రిటైల్ వ్యాపార సంస్థ అవెన్యూ సూపర్(డీ-మార్ట్) ఈ క్యూ2లో మార్కెట్ ఆశించిన స్థాయిలోనే ఫలితాలను నమోదు చేసింది. . ఈ క్యూ2లో కంపెనీ నికర లాభం 18 శాతం వృద్ధి చెంది రూ. 226 కోట్లను సాధించింది. గతేడాది ఇదే క్యూ2లో రూ.191 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.4,872.52 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే క్యూ2లో సాధించిన రూ.3507 కోట్లతో పోలిస్తే ఇది 39శాతం ఎక్కువ. ఇదే
దీపావళి కల్లా 11,000 స్థాయికి నిఫ్టీ!!
Saturday 13th October 2018బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ దీపావళి కల్లా మళ్లీ 11,000 స్థాయికి చేరొచ్చని ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన సంజీవ్ భాసిన్ తెలిపారు. మార్కెట్లు బౌన్స్‌బ్యాక్స్ అయ్యేట్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఫార్మా, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. రూపాయి పతనం, క్రూడ్ ధరల ర్యాలీ, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ డిఫాల్ట్ వంటి అంశాల నేపథ్యంలో మార్కెట్లు అండర్పర్ఫార్మ్ చేస్తున్నాయని తెలిపారు. డౌజోన్స్ కరెక్షన్ అస్థిరతను