ఎల్ఐసీ హౌసింగ్‌కు బై రేటింగ్
By Sakshi

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తాజాగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి...
స్టాక్: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్
రేటింగ్: కొనొచ్చు
ఇండస్ట్రీ: ఎన్బీఎఫ్సీ
ప్రస్తుత ధర: రూ.520
టార్గెట్ ప్రైస్: రూ.627
బ్రోకరేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తాజాగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్ ప్రైస్‌ను రూ.627గా నిర్ణయించింది. బై రేటింగ్ ఇచ్చింది. సీజనల్‌గా చూస్తే బలహీనమైన క్వార్టర్లో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా మోస్తారు పనితీరు కనబర్చిందని పేర్కొంది. రుణ నాణ్యత క్షీణించిందని తెలిపింది. మొత్తంగా చూస్తే వృద్ధి బాగానే ఉందని, అయితే కీలక విభాగాల్లో వృద్ధి స్వల్పంగా నమోదయ్యిందని పేర్కొంది. హౌసింగ్ విభాగంలో మంచి వృద్ధి అవకాశాలున్నాయని తెలిపింది. ప్రభుత్వ కార్యక్రమాలు ఇందుకు బాగా దోహదపతాయని పేర్కొంది. విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వల్ల ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎక్కువ లబ్ధి చేకూరుతుందని తెలిపింది. కార్యకలాపాల విస్తరణ మరోక సానుకూల అంశమని పేర్కొంది. అందువల్ల బై రేటింగ్ కొనసాగిస్తున్నామని తెలిపింది. రేట్ల పెంపు ఫలితాలు రానున్న కాలంలో కనిపిస్తాయని పేర్కొంది. ఎన్పీఏలు తగ్గొచ్చని అంచనా వేసింది. క్యూ1 ఫలితాల వెల్లడి తర్వాత స్టాక్ ధర రెండు రోజుల్లో 8 శాతంమేర క్షీణించిందని పేర్కొంది. సమీప కాలంలో రేంజ్బౌండ్లో కదలాడవచ్చని తెలిపింది.
You may be interested
స్టాక్ పిక్: యాక్సిస్ బ్యాంక్
Saturday 1st September 2018ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఈ వారం స్టాక్ పిక్‌గా యాక్సిస్ బ్యాంక్‌ను సిఫార్సు చేసింది. ఎందుకో ఒకసారి చూద్దాం.. బ్రోకరేజ్: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ స్టాక్: యాక్సిస్ బ్యాంక్ రేటింగ్: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.649 టార్గెట్ ప్రైస్: రూ.735, రూ.815 బ్రోకరేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్.. దేశీ మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్‌పై బుల్లిష్‌గా ఉంది. కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే 3-4 త్రైమాసికాల్లో స్టాక్ ధర రూ.735,
రూపీ పతనం.. మార్కెట్ గమనం...
Saturday 1st September 2018పెద్దగా సంబంధం ఉండదంటున్న నిపుణులు ఆగస్టు నెలను బుల్స్ విజయవంతంగా ముగించాయి. మరోపక్క రూపాయి రోజురోజుకీ క్షీణిస్తూ దిగజారుతోంది. అయితే ఈక్విటీ బుల్రన్పై రూపీ పతనం పెద్ద ప్రభావం చూపకపోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 2013 ఆగస్టు- అక్టోబర్ మధ్య కాలంలో రూపాయి 17.6 శాతం పతనమైంది. కానీ ఇదే సమయంలో నిఫ్టీ 2.1 శాతం పెరిగింది. 2011 ఆగస్టు- డిసెంబర్ కాలంలో రూపీ 22.7 శాతం ఢమాల్‌మంది. ఇదే