STOCKS

News


ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాకు బై రేటింగ్‌

Friday 10th August 2018
Markets_main1533887274.png-19119

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
స్టాక్‌: ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌ 
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.194
టార్గెట్‌ ప్రైస్‌: రూ.328
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌పై బుల్లిష్‌గా ఉంది. కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తోంది. కంపెనీ ప్రస్తుత జూన్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలు మించాయని పేర్కొంది. ఇటీవల కాలంలో స్టాక్‌ ధరలో కరెక‌్షన్‌ ఏర్పడిందని అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో అర్ధభాగంలో నాలుగు పెద్ద ప్రాజెక్టుల వల్ల ఆదాయం మరింత పెరగొచ్చని తెలిపింది. కంపెనీ తాను నిర్దేశించుకున్న గైడెన్స్‌ను సాధిస్తుందని అంచనా వేసింది. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ సమస్య పరిష్కారమౌతుందనే అంచనాలు, కార్యకలాపాల విస్తరణ వంటి వాటి వల్ల స్టాక్‌పై బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత మరింత సమాచారం కోసం కింది లింక్‌పై క్లిక్‌ చేయండి...
 

View Pdf One (1533887286IRB_-_1QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

యస్‌ బ్యాంక్‌ జూమ్‌

Friday 10th August 2018

ముంబై:- ప్రైవేట్‌ రంగ దిగ్గజం యస్‌బ్యాంకు షేరు శుక్రవారం లాభాల బాట పట్టింది. నేటి ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్‌లో 2.61శాతం వరుకు ర్యాలీ చేసింది. నేడు షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ.382.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో  పలు బ్యాకింగ్‌ రంగ షేర్లు నష్టాల బాట పట్టినప్పటికీ యస్‌ బ్యాంకు షేరు లాభాల్లో ట్రేడైంది. ఒక దశలో 2.61శాతం వరకూ  ర్యాలీ చేసి

ఈ స్టాక్‌పై కన్నేయండి..

Friday 10th August 2018

బ్రోకరేజ్‌: జేఎం ఫైనాన్షియల్‌  స్టాక్‌: హీరో మోటొకార్ప్‌ రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌: రూ.4,050 ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో హీరో మోటొకార్ప్‌ ఆరోగ్యకరమైన 15.6 శాతం ఈబీటా మార్జిన్లను ప్రకటించింది. ధర ఒత్తిళ్లు, ఎంట్రీ లెవెల్‌లో తీవ్రమైన పోటీ వంటి అంశాలున్నప్పటికీ ఆకర్షణీయ ఫలితాలను వెల్లడించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మెరుగుదల, సాధారణ రుతువపనాలు, కనీస మద్దతు ధర పెంపు నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో టూవీలర్లకు బలమైన డిమాండ్‌ ఉండొచ్చని అంచనా వేసింది. బ్రాండ్‌ రీకాల్‌,

Most from this category