STOCKS

News


ఇమామి కొనొచ్చు..

Thursday 9th August 2018
Markets_main1533805923.png-19099

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
స్టాక్‌: ఇమామి
ప్రస్తుత ధర: రూ.579
టార్గెట్‌ ప్రైస్‌: రూ.634

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఇమామి షేరు కొనుగోలు చేయవచ్చని సిపార్సు చేస్తోంది. కంపెనీ పనితీరుపై సానుకూలముగా ఉన్నామని పేర్కొంది. ఇమామి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో మంచి ఫలితాలను ప్రకటించిందని, ఇవి అంచనాలు అనువుగా ఉన్నాయని తెలిపింది. హోల్‌సెల్‌ సహా సీఎస్‌డీ వ్యాపార విభాగాల్లో రివకరీ అంచనా వేస్తున్నామని పేర్కొంది. అలాగే గ్రామీణ డిమాండ్‌ పెరుగుదల, కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ, డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ విస్తరణ, అధిక మార్జిన్లు అందించే విభాగాలపై దృష్టి కేంద్రీకరించడం వంటి పలు అంశాల ప్రాతిపదికన ఈ స్టాక్‌లో రానున్న రోజుల్లో మంచి వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. 

మరింత సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1533805948Emami_-_1QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

ఐసీఐసీఐ బ్యాంక్‌కు మోర్గాన్‌స్టాన్లీ బూస్ట్‌

Thursday 9th August 2018

దేశీయ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌ గురువారం ట్రేడింగ్‌లో సుమారు 8 శాతం దూసుకుపోయింది. అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ తాజాగా ఐసీఐసీఐ బ్యాంకును తోటి బ్యాంకుల్లో మేటిగా అభివర్ణించింది. దీంతో ఒక్కసారిగా బ్యాంకు కౌంటర్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. బ్యాంకు మొండిపద్దుల విషయమై స్పష్టత రావడంతో షేరుపై ఇన్వెస్టర్లు మక్కువ చూపారు. వార్షిక నివేదికలో తమ బ్యాడ్‌ లోన్స్‌, ఎన్‌పీఏల గురించి పూర్తి వివరాలు పొందుపరిచనట్లు బ్యాంకు తెలిపింది.

విజయా బ్యాంక్‌తో బజాజ్‌ అలియాంజ్‌ జట్టు

Thursday 9th August 2018

దేశీ ప్రముఖ ప్రైవేట్‌ రంగ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌.. ప్రభుత్వ రంగ విజయా బ్యాంక్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా విజయా బ్యాంక్‌ తనకు దేశవ్యాప్తంగా 2,129 శాఖల్లో బజాజ్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్టులను కస్టమర్లకు విక్రయించనుంది. దీని వల్ల ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద, ఇంటి, మోటార్‌, ట్రావెల్‌ బీమా సహా ప్రాపర్టీ, లయబిలిటీ, మెరైన్‌, ఇంజనీరింగ్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్టులు బ్యాంక్‌ కస్టమర్లకు అందుబాటులో

Most from this category