STOCKS

News


డిష్‌మాన్ కార్బోజెన్ అమ్‌సిస్ కొనచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

Saturday 6th October 2018
Markets_main1538813726.png-20922

ముంబై:- ప్రముఖ రేటింగ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఔషద ఉత్పత్తుల కంపెనీ డిష్‌మాన్ కార్బోజెన్ అమ్‌సిస్ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది.  గతేడాదిలో
డిష్‌మ్యాన్ ఫార్మా సంస్థ డిష్‌మాన్ కార్బోజెన్ అమ్‌సిస్ పేరుతో రీ లిస్టింగ్ అయింది. గత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఫలితాలను సాధించడంతో పాటు, రానున్న రోజుల్లో తన వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకోవడానికి కంపెనీ రూపొందించుకున్న చక్కటి ప్రణాళికలు షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడానికి కారణమైనట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంటుంది.

టార్గెట్‌ ధర:- రూ.415
విశ్లేషణ:- వ్యయ నియంత్రణ, అనుబంధ వ్యాపారాల విస్తరణ, రుణాలను పరిమితం చేసుకోవడం, బలమైన హెడ్జింగ్‌ పాలసీ విధానాలు, నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం తదితర కారణాలతో  గత ఆర్థికసంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలను సాధించింది. అయితే భారత్‌ నుంచి అధిక రక్తపోటు నియంత్రణ చికిత్సలో వినియోగించే ఔషధాల సరఫరా తగ్గుముఖం పట్టడంతో కంపెనీ ప్రతికూలాంశం. స్విట్జర్లాండ్‌లో పూర్తి స్థాయిలో సేవలు అందించడంతో పాటు, అండాశయ క్యాన్సర్‌ చికిత్సకు ఉపయోగించే ‘‘నిరాపారిబ్‌’’ ఔషధాల విడుదల రానున్న రోజుల్లో డిష్‌మాన్ కార్బోజెన్‌ ఆదాయాల్ని మరింత పెంచుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనావేస్తుంది. డాలర్‌ మారకంలో రూపాయి క్షీణత, కంపెనీ విస్తరణ సామర్థ్యం, వాణిజ్య ఉత్పత్తుల పెరుగుదల, విటమన్‌ ‘‘డీ’’ ఔషధాల లాభార్జన పెరగడం తదితర సానూకుంలాంశాలు అంశాలు ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి అండగా నిలుస్తాయని బోక్రరేజ్‌ సంస్థ అంటోంది.

(కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...)

View Pdf One (1538813857Dishman_Carbogen_Amcis_-_ARA_-_HDFC_sec.pdf)

You may be interested

వ్యాల్యు పిక్‌: ఏసియన్‌ పెయింట్స్‌

Saturday 6th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఏసియన్‌ పెయింట్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  స్టాక్‌: ఏసియన్‌ పెయింట్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,209 టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,471 ఆనంద్‌రాఠి.. ఏసియన్‌ పెయింట్స్‌పై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే ఏడాది కాలానికి గానూ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,471గా నిర్ణయించింది. ‘దేశీ పెయింట్‌ కంపెనీల్లో ఏసియన్‌ పెయింట్స్‌ దిగ్గజ కంపెనీ. ఆసియాలో మూడో అతిపెద్ద పెయింట్‌ కంపెనీ. గ్రూప్‌

యాక్సిస్‌ బ్యాంక్‌లో వాటా విక్రయం వాయిదా

Saturday 6th October 2018

ముంబై:- ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా యాక్సిస్‌ బ్యాంకులో ప్రభుత్వం తన వాటా విక్రయాన్ని వాయిదా వేసింది. ఈ నవంబర్‌ చివరినాటి కల్లా యాక్సిస్‌ బ్యాంకులోని తన మొత్తం వాటాలో 4శాతం వాటాను విక్రయించి రూ.7,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం భావించింది. సెకండరీ మార్కెట్లో ఆగస్ట్‌ చివరి నాటి నుంచి తలెత్తిన సంక్షోభంతో వాటా విక్రయ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది.

Most from this category