STOCKS

News


కన్సూమర్‌ షేర్లపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషణ

Wednesday 11th July 2018
Markets_main1531306111.png-18209

ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ కంపెనీల ఫలితాలు ఆకర్షణీయంగా ఉండేందుకు అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషించింది. దేశీయ అమ్మకాలు బలంగా ఉన్నాయని, అంతర్జాతీయంగా కూడా మెరుగుదల నమోదవుతుందని వివరించింది. హెచ్‌యూఎల్‌, బ్రిటానియా అవుట్‌పెర్ఫార్మ్‌ చేసేందుకు అవకాశం ఉందని విశ్లేషించింది. ఐటీసీ క్యూ1 ఫలితాలుపై యావరేజ్‌ అవుట్‌లుక్‌ ఇచ్చిన బ్రోకింగ్‌ సంస్థ.. సిగరెట్‌ అమ్మకాలు, ఎఫ్‌ఎమ్‌సీజీ ఎబిటా మార్జిన్లతో పాటు అగ్రి, హోటల్‌ వ్యాపారం ప్రధాన అంశాలుగా ఉండనున్నాయని వివరించింది. గ్రామీణ ప్రాంత అభివృద్ధి నేపథ్యంలో హెచ్‌యూఎల్‌పై పాజిటీవ్‌ అవుట్‌లుక్‌ ఇచ్చింది. గోద్రేజ్ కన్సూమర్‌ ప్రాడెక్ట్స్‌, కాల్గేట్, మారికోలపై యావరేజ్‌ అవుట్‌లుక్‌ ఇచ్చిన సంస్థ.. డాబర్‌, బ్రిటానియా, ఇమామీ, జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ కంపెనీలపై క్యూ1 అవుట్‌లుక్‌ "గుడ్‌" అనే అంచనాను వెల్లడించింది. గృహోపకరణాల కంపెనీల పరంగా హవెల్స్‌ ఇండియా, వీ-గార్డ్‌, టీటీకే ప్రెస్టేజ్‌కు "గుడ్‌" అవుట్‌లుక్‌ను వెల్లడించింది. సింఫనీ, వొల్టాస్‌కు "వీక్‌" అవుట్‌లుక్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌కు యావరేజ్‌ అవుట్‌లుక్‌ ఇచ్చింది. ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా విమానరంగ కంపెనీలైన ఇండిగో, స్పైస్‌జెట్‌ క్యూ1 ఫలితాలు మ్యూటెడ్‌గా ఉండేందుకు అవకాశం ఉందని విశ్లేషించింది. 

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1531306136Consumer_-_1QFY19_Results_Preview_-_HDFC_sec.pdf)

You may be interested

ప్లాట్‌గా ముగిసిన మార్కెట్‌

Wednesday 11th July 2018

మరోసారి తెరపైకి ట్రేడ్‌వార్‌ భయాలు సూచీలకు అండగా టీసీఎస్‌ వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో బుధవారం మార్కెట్‌ దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్‌ 26 పాయింట్లు లాభంతో 36,266 వద్ద, నిఫ్టీ 1 పాయింటు పెరిగి 10,948 వద్ద ముగిశాయి. చైనా నుంచి దిగుమతిమయ్యే 200 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా తాజాగా మరో 10శాతం సుంకాలను పెంచనున్నట్లు స్పష్టం చేసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా బలహీన సంకేతాలు నెలకొనడంతో ట్రేడింగ్‌

ఏడాది చివరకు నిఫ్టీ@11400!

Wednesday 11th July 2018

డాయిష్‌ బ్యాంక్‌ అంచనా దేశీయ మార్కెట్లు ఈ ఏడాది సైతం బుల్‌ రన్‌ కొనసాగిస్తాయని ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం డాయిష్‌ బ్యాంక్‌ అభిప్రాయపడింది. ఈ ఏడాది చివరకు నిఫ్టీ 11400 పాయింట్లకు, సెన్సెక్స్‌ 37వేల పాయింట్లకు చేరతాయని బ్యాంకు ప్రతినిధి ప్రతీక్‌ గుప్తా అంచనా వేశారు. అయితే మార్కెట్లో ఒడిదుడుకులు మాత్రం మరికొంత కాలం కొనసాగుతాయన్నారు. వచ్చే 3- 5ఏళ్ల పాటు కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌లో వృద్ధి కారణంగా భారత ఎకానమీలో నిర్మాణాత్మక

Most from this category