STOCKS

News


ఆటో పరిశ్రమపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిపోర్టు

Saturday 6th October 2018
Markets_main1538818425.png-20926

పలు తలనొప్పులున్నప్పటికీ సెప్టెంబర్‌లో ఆటో కంపెనీల విక్రయాలు అంచనాలకు అటుఇటుగానే నమోదయ్యాయి. కేరళ వరదలు, క్రూడాయిల్‌ ధరల పెరుగుదల ఆటో అమ్మకాలను కుంగదీశాయి. అయితే రూరల్‌ రికవరీ కొనసాగడంతో అమ్మకాలు నిలదొక్కుకున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇకపై అందరి దృష్టి రాబోయే పండుగ సీజన్‌పై ఉంది. పాసింజర్‌, కమర్షియల్‌ వాహనాల విక్రయాల్లో పండుగ సీజన్‌ జోరు తెస్తుందని అంచనా వేసింది. తాజా కరెక‌్షన్‌తో పలు ఆటో స్టాకులు ఆకర్షణీయంగా మారాయని తెలిపింది. మంచి వర్షపాతం, రూరల్‌డిమాండ్‌ పెరుగుదల, పండుగ సీజన్‌.. ఆటో పరిశ్రమలో ఉత్తేజం నింపుతాయని అంచనా వేస్తోంది. 
ఆటో స్టాకుల టార్గెట్‌ ధరలను బ్రోకరేజ్‌ సంస్థ సమీక్షించింది...
Company           TP 
Ashok Leyland   150  BUY
Bajaj Auto       3,411  BUY
Maruti Suzuki   8,252  BUY
HeroMotocorp 3,602  BUY
SML Isuzu        988  BUY

మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన పీడీఎఫ్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి...

View Pdf One (1538818454Auto - Update - HDFCsec.pdf)

You may be interested

బిజినెస్‌ వీక్లి రౌండప్‌

Saturday 6th October 2018

♦ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి ఈ వారంలో ఈ ఏడాది లాభాలన్నీ కరిగిపోయాయి. 2016 ఫిబ్రవరి నుంచి చూస్తే ఇండెక్స్‌ ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. బ్రెంట్‌ ధరల పెరుగుదల, రూపాయి పతనం ప్రతికూల ప్రభావం చూపాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 5.11 శాతం క్షీణతతో 34,377 పాయింట్లకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 ఇండెక్స్‌ 5.62 శాతం క్షీణతతో 10,316 పాయింట్లకు పడిపోయాయి. ♦ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి తొలిసారిగా 74 మార్క్‌ దిగువకు పతనమైంది.

9800 పాయింట్ల వరకు పతనం?!

Saturday 6th October 2018

నిఫ్టీ చార్టుల్లో ఇండికేటర్లు ‘సెల్‌’ సంకేతాలు ఇస్తున్నాయని, అందువల్ల మధ్యకాలానికి నిఫ్టీలో అమ్మకాలు కొనసాగుతాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌  అంచనా వేసింది. నెలవారీ చార్టుల్లో బేరిష్‌ ఎంగల్ఫింగ్‌ క్యాండిల్‌ ఏర్పడిందని తెలిపింది. ఈ క్యాండిల్‌ సాధారణంగా మరింత బలహీనతకు చిహ్నమని తెలిపింది. దీంతో పాటు నిఫ్టీ కీలకమైన 200 రోజుల డీఎంఏ కన్నా దిగువన క్లోజయిందని అందువల్ల రికవరీ అవకాశాలు కనిపించడంలేదని తెలిపింది. వరుసగా నిఫ్టీ రెండు రోజుల పాటు 200

Most from this category