STOCKS

News


ఈ వారం పిక్‌: ఇంజినీర్స్‌ ఇండియా

Saturday 8th September 2018
Markets_main1536400494.png-20094

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఈ వారం స్టాక్‌ పిక్‌గా ఇంజినీర్స్‌ ఇండియాను సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. 

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
స్టాక్‌: ఇంజినీర్స్‌ ఇండియా (ఈఐఎల్‌)
ఇండస్ట్రీ: ఇంజినీరింగ్‌
ప్రస్తుత ధర: రూ.126
టార్గెట్‌ ప్రైస్‌: రూ.144-165

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ప్రభుత్వ రంగానికి చెందిన ఇంజినీర్స్‌ ఇండియాపై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే 4-6 త్రైమాసికాల్లో స్టాక్‌ ధర రూ.144-165 శ్రేణికి చేరొచ్చని టార్గెట్‌ను నిర్ణయించింది. స్టాక్‌ను ప్రస్తుత ధర స్థాయిలో కొనుగోలు చేయవచ్చని సూచించింది. అలాగే స్టాక్‌ పడిపోయినప్పుడు రూ.117-128 స్థాయిలో మరిన్ని స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. రుణ రహిత నగదు నిల్వలు ఎక్కువగా ఉన్న బ్యాలెన్స్‌ షీటు, బలమైన రిటర్న్‌ రేషియో, ఆరోగ్యకరమైన రెవెన్యూ, ఎర్నింగ్స్‌ బాగుండటం, పటిష్టమైన ఆర్డర్‌ బుక్‌, భవిష్యత్‌ వృద్ధి అంచనాలు అధిక స్థాయిలో ఉండటం వంటి అంశాలు సానుకూలమని తెలిపింది. అలాగే కంపెనీ మరో బైబ్యాక్‌ను లేదా ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించే అవకాశముందని పేర్కొంది. ఇంజినీర్స్‌ ఇండియా విదేశాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపింది. అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇతర విభాగాల్లోకి అడుగుపెడుతోందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ అదిరిపోయే ఎర్నిం‍గ్స్‌ను ప్రకటించిందని గుర్తుచేసింది. కాగా కంపెనీలో ప్రమోటర్ల వాటా 52 శాతంగా, ఇన్‌స్టిట్యూషన్ల వాటా 32.7 శాతంగా, నాన్‌-ఇన్‌స్టిట్యూషన్ల వాటా 15.3 శాతంగా ఉంది.    

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1536400508HSL PCG Pick of the Week_EIL_03092018.pdf)

You may be interested

మీ ఫండ్స్‌ సెన్సెక్స్‌తో పాటు ర్యాలీ చేయలేదా?

Saturday 8th September 2018

ఈ ఏడాదిలో సెన్సెక్స్‌ సూచీ 10 శాతం ర్యాలీ చేసింది. 38,989 పాయింట్ల వద్ద తన జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. సెన్సెక్స్‌ భారీ స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మాత్రం ఈస్థాయి ర్యాలీని అందుకోలేకపోయాయి. అందుకు గల కారణాన్ని కోటక్‌ ఇంటర్నేషనల్‌ ఈక్విటీస్‌ వివరిస్తూ ‘‘సెన్సెక్స్‌ ర్యాలీకీ ప్రధాన కారణమైన కొన్ని హెవీవెయిట్‌ షేర్లను మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు, విదేశీ ఇన్వెస్టర్లు తక్కువ హోల్డ్‌ చేయడంతో మ్యూచువల్‌ ఫండ్స్‌ సెన్సెక్స్‌తో

అక్సో నోబెల్‌పై కోటక్‌ బుల్లిష్‌

Saturday 8th September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా అక్సో నోబెల్‌ ఇండియా స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. స్టాక్‌: అక్సో నోబెల్‌ ఇండియా రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,730 టార్గెట్‌ ప్రైస్‌: రూ.2,200 కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా అక్సో నోబెల్‌ ఇండియాపై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.2,200గా నిర్ణయించింది. కంపెనీ కీలకమైన డెకరేటివ్‌, ఇండస్ట్రీయల్‌ పెయింట్స్‌ విభాగాల్లో చాలా త్రైమాసికాల నుంచి స్థిరమైన

Most from this category