STOCKS

News


ఈ వారం పిక్‌: అరబిందో ఫార్మా

Saturday 13th October 2018
Markets_main1539414491.png-21129

బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా అరబిందో ఫార్మాను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. 

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
స్టాక్‌: అరబిందో ఫార్మా
ఇండస్ట్రీ: ఫార్మాస్యూటికల్స్‌
ప్రస్తుత ధర: రూ.735
టార్గెట్‌ ప్రైస్‌: రూ.820-865

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. అరబింతో ఫార్మాపై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే 3-4 త్రైమాసికాల్లో స్టాక్‌ ధర రూ.820-865 స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. కంపెనీ రానున్న కాలంలో అమెరికా, యూరప్‌ మార్కెట్లలో కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించనుందని పేర్కొంది. ఇటీవలి శాండోజ్‌ డెర్మటాలజీ కొనుగోలు వల్ల ఈపీఎస్‌లో మంచి వృద్ధి నమోదు కావొచ్చని తెలిపింది. గతంలోని అప్కోటెక్స్‌ కొనుగోలు వల్ల కంపెనీ బలం పెరిగిందని పేర్కొంది. అమెరికాలో ధరల పోటీ వల్ల పెద్దగా ప్రభావమేమీ ఉండదని తెలిపింది. మరిన్ని కొత్త ప్రొడక్టులు ఆవిష్కరణలు సానుకూల అంశమని పేర్కొంది. అరబిందో ఫార్మా స్టాక్‌ ధర ప్రస్తుతం రూ.735 వద్ద ఉందని, ఇది రూ.680-685 స్థాయి వరకు తగ్గినా కూడా స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. రూ.634 స్టాప్‌లాస్‌గా నిర్ణయించుకోవాలని పేర్కొంది. కరెన్సీ ఒడిదుడుకులు, అమెరికా ఎఫ్‌డీఏ తనిఖీలు, ధరల తగ్గుదల, తీవ్రమైన పోటీ వంటివి రిస్క్‌ అంశాలని తెలిపింది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1539414505Aurobindo Pharma - Pick of the Week - 081018.pdf)

You may be interested

ఆటో రంగం: క్యూ2 ఎర్నింగ్స్‌ అంతంతే!!

Saturday 13th October 2018

ఆటోమొబైల్‌ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండొచ్చని బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. గ్రామీణ డిమాండ్‌, మైనింగ్‌/తయారీ కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల వార్షికంగా టూవీలర్లు, కమర్షియల్‌ వాహన విక్రయాల్లో వరుసగా 9 శాతం, 27 శాతం వృద్ధి నమోదైనప్పటికీ.. ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 3 శాతం తగ్గాయని గుర్తుచేసింది. పండుగ సీజన్‌ ఆలస్యం కావడం, కేరళ

పసిడి నష్టాల ముగింపు

Saturday 13th October 2018

ప్రపంచ మార్కెట్లు తిరిగి పుంజుకోవడం పాటు డాలర్‌ ఇండెక్స్‌ బలపడటంతో పసిడి ధర శుక్రవారం నష్టంతో ముగిసింది. అమ్మకాల సునామీతో తల్లడిన అంతర్జాతీయ మార్కెట్లకు ‘‘అమెరికా దిగుమతి గణాంకాలు’’ వృద్ధి ఊరటనిచ్చాయి. మరోవైపు బ్రెగ్జిట్‌ వ్యవహరం నేపథ్యంలో బ్రిటన్‌ కరెన్సీ యూరో కూడా బలహీనపడింది. ఈ కారణాలతో డాలర్‌ ఇండెక్స్‌ మూడు రోజుల వరుస నష్టాలకు ముగింపు పడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో  శుక్రవారం రాత్రి అమెరికాలో 95.06స్థాయికి

Most from this category