STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్‌ పిక్‌.. ‘ఇంటర్నేషనల్‌ పేపర్స్‌ ఏపీపీఎం’

Saturday 22nd December 2018
Markets_main1545465844.png-23172

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఈ వారం స్టాక్‌ పిక్‌గా ఇంటర్నేషనల్‌ పేపర్స్‌ ఏపీపీఎంను సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం...

స్టాక్‌: ఇంటర్నేషనల్‌ పేపర్స్‌ ఏపీపీఏం
ఇండస్ట్రీ: పేపర్‌, పేపర్‌ ప్రొడక్ట్స్‌
ప్రస్తుత ధర: రూ.461
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.519- 566

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఇంటర్నేషనల్‌ పేపర్‌ ఏపీపీఎంపై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే 3-4 త్రైమాసికాల్లో స్టాక్‌ ధర రూ.519-566 స్థాయికి చేరొచ్చని అంచనా వేస్తోంది. స్టాక్‌ ధర తగ్గినప్పుడల్లా రూ.410-415 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఉత్తమ నిర్వహణ పనితీరు, మంచి ఉత్పాదకత, పేపర్‌ పరిశ్రమలో అపార అనుభవం, పేపర్‌ ధర ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించకపోవడం వంటివి సానుకూల అంశాలని తెలిపింది. వ్యయాల క్రమబద్దీకరణ వల్ల మార్జిన్లు మెరుగుపడొచ్చని పేర్కొంది. ఆదాయం, లాభదాయకత పెరుగుతాయనే అంచనాలున్నాయని తెలిపింది. కంపెనీ ప్రస్తుత క్యూ2లో అంచనాల కన్నా మెరుగైన ఫలితాలనే ప్రకటించిందని పేర్కొంది. అయితే ముడిపదార్ధాల ధరల్లో ఒడిదుడుకులు, ప్రతికూల రుతుపవనాల పరిస్థితులు, తీవ్రమైన పోటీ, విక్రయాల్లో తక్కువ వృద్ధి, మూలధన పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించకపోవడం, గత ఆరేళ్లుగా డివిడెంట్‌ చెల్లింపులు లేకపోవడం వంటివి ఆందోళనకర అంశాలని వివరించింది. 

కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1545465860International Paper - Pick of the Week- 171218.pdf)

You may be interested

ఆనంద్‌రాఠి వ్యాల్యు పిక్‌: పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ

Saturday 22nd December 2018

 ప్రముఖ బ్రోకరజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.223 టార్గెట్‌ ప్రైస్‌: రూ.269 ఆనంద్‌రాఠి.. పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీపై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే 12 నెలల కాలంలో స్టాక్‌ ధర రూ.269కే చేరొచ్చని అంచనా వేసింది. ‘ఇండియన్‌ ఎనర్జీ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న కంపెనీ పెట్రోనెట్‌

ఈ వారం టెక్నికల్‌ కాల్స్‌..

Saturday 22nd December 2018

మార్కెట్‌ నిపుణులు ఈ వారం కోసం 4 స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం..  హిందాల్కో ఇండస్ట్రీస్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.224 టార్గెట్‌ ప్రైస్‌: రూ.235.2 స్టాప్‌ లాస్‌: రూ.218.4 ఓఎన్‌జీసీ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.148.5 టార్గెట్‌ ప్రైస్‌: రూ.155.9 స్టాప్‌ లాస్‌: రూ.144.8 పవర్‌ గ్రిడ్‌  రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.196.9 టార్గెట్‌ ప్రైస్‌: రూ.206.7 స్టాప్‌ లాస్‌: రూ.192 టాటా మోటార్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.176.3 టార్గెట్‌ ప్రైస్‌: రూ.185.1 స్టాప్‌ లాస్‌: రూ.171.8

Most from this category