STOCKS

News


ఎస్‌బీఐకి హెచ్‌డీఎఫ్‌సీ బై రేటింగ్‌

Thursday 8th November 2018
Markets_main1541661253.png-21788

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) షేరును కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
షేరు: ఎస్‌బీఐ
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.286
టార్గెట్‌ ప్రైస్‌: రూ.352

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఎస్‌బీఐపై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.352గా నిర్ణయించింది. బ్యాంక్‌ క్యూ2 ఎర్నింగ్స్‌ అంచనాలకు మించి ఉన్నా కూడా నాణ్యత లోపించిందని పేర్కొంది. గడిచిన మూడు త్రైమాసికాలుగా నష్టాలను ప్రకటించిన బ్యాంక్‌ తాజా క్యూ2లో లాభాల బాటపట్టిందని తెలిపింది. ఎస్‌బీఐ లైఫ్‌లో వాటా విక్రయం ద్వారా వచ్చిన భారీ వన్‌టైమ్‌ ఆదాయం ఎస్‌బీఐకి కలిసొచ్చిందని పేర్కొంది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, కేటాయింపుల (ప్రొవిజనింగ్‌) భారం శాంతించడం కూడా బ్యాంక్‌ మెరుగైన పనితీరుకు దోహదం చేసిందని వివరించింది. మంచి రుణ వృద్ధి, ఆరోగ్యకరమైన కాసా రేషియో, డైవర్సిఫైడ్‌ బుక్‌, తగినంత మూలధనం ఉండటం, నికర వడ్డీ మార్జిన్ల మెరుగుదల వంటివి సానుకూల అంశాలని తెలిపింది. బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగుపడిందని పేర్కొంది. ఎన్‌సీఎల్‌టీ పరిష్కారాల వల్ల ఎస్‌బీఐ ఎక్కువగా ప్రయోజనం పొందనుందని తెలిపింది.  

బ్యాంక్‌ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1541661284State_Bank_-_2QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

సంవత్ 2075 ర్యాలీకి ఈ షేర్లు రెడీ..!

Thursday 8th November 2018

ముంబై: దీపావళి సందర్భంగా పలు దిగ్గజ బ్రోకింగ్‌ సంస్థలు మరింత ర్యాలీ చేయడానికి సిద్ధంగా ఉన్న షేర్లను సిఫార్సు చేస్తున్నాయి. సంవత్ 2075(ఈ ఏడాది దీపావళి నుంచి వచ్చే ఏడాది దీపావళి మధ్య సమయం)లో ఇన్వస్టర్లు ఈ షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి రాబడిని అందుకోవచ్చని ఆయా బ్రోకింగ్‌ సంస్థల అనలిస్టులు సూచిస్తున్నారు. ఈ జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. డైమెన్షన్స్‌ కార్పొరేట్ ఫైనాన్స్ సర్వీసెస్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్ శ్రీవాత్సవ

హిస్టరీ రిపీట్‌ అయితే ర్యాలీ!!

Thursday 8th November 2018

గత రెండు నెలలుగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బేర్‌ గుప్పిట్లో ఉంది. నిఫ్టీ తన గరిష్ట స్థాయి నుంచి 14 శాతానికిపైగా పతనమైంది. రూపాయి క్షీణత, క్రూడ్‌ ధరల పెరుగుదల, వాణిజ్య లోటు విస్తరణ, లిక్విడిటీ భయాలు వంటి అంశాలు మార్కెట్‌లో ఒడిదుడుకులకు కారణమయ్యాయి. అయితే దీర్ఘకాల ఇన్వెస్టర్లు మార్కెట్‌పై ఇంకా నమ్మకాన్ని కోల్పోలేదు. గత 12 ఏళ్లలో చూస్తే.. ఇండెక్స్‌ దాదాపు 14 శాతం మేర పతనమైన ప్రతీసారి..

Most from this category