STOCKS

News


ఎస్‌ఎంఎల్‌ ఇసుజుపై హెచ్‌డీఎఫ్‌సీ పాజిటివ్‌

Saturday 17th November 2018
Markets_main1542444070.png-22144

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఎస్‌ఎంఎల్‌ ఇసుజుపై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. 

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
స్టాక్‌: ఎస్‌ఎంఎల్‌ ఇసుజు
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.675
టార్గెట్‌ ప్రైస్‌: రూ.904

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఎస్‌ఎంఎల్‌ ఇసుజుపై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.904గా నిర్ణయించింది. కంపెనీ క్యూ2లో మిశ్రమ పనితీరు కనబర్చిందని పేర్కొంది. రెవెన్యూ వార్షికంగా 30 శాతం మేర పెరిగిందని తెలిపింది. విక్రయాలు 28 శాతం మేర పెరగడం ఇందుకు కారణమని పేర్కొంది. అయితే కమోడిటీ ద్రవ్యోల్బణం, ధరల పెంపు లేకపోవడం వల్ల మార్జిన్లు తగ్గాయని తెలిపింది. అలాగే నికర నష్టాన్ని ప్రకటించిందని పేర్కొంది. స్కూల్‌ బస్‌ విభాగం, కార్గో విభాగంలో డిమాండ్‌ పుంజుకోవడం సానుకూల అంశమని తెలిపింది. ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, కార్యకలాపాల విస్తరణ, ప్లాంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అప్‌గ్రేడేషన్‌ కోసం ఇన్వెస్ట్‌మెంట్లు చేసిందని, దీని వల్ల రానున్న కాలంలో విక్రయాలు మరింత పెరగొచ్చని అంచనా వేసింది. అయితే కమోడిటీ ద్రవ్యోల్బణం, డిస్కౌంట్ల రూపంలో సవాళ్లు పొంచి ఉన్నాయని, వీటి వల్ల మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపింది. పూర్తిస్థాయి సామర్థ్యం వినియోగం వల్ల మార్జిన్లు పెరగొచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో బస్‌ విభాగంలో కంపెనీ మార్కెట్‌ వాటా 10 శాతానికి పెరిగిందని తెలిపింది. కంపెనీ ఇటీవల గ్లోబల్‌ సిరీస్‌ ట్రక్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చిందని పేర్కొంది. కస్టమర్ల నుంచి వీటికి మంచి స్పందన వస్తోందని తెలిపింది. రుణ భారం రానున్న సంవత్సరాల్లో తగ్గొచ్చని అంచనా వేసింది. 

కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...   

View Pdf One (1542444079SML_Isuzu_-_2QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

క్రూడ్‌లో పెరిగిన షార్ట్‌ సెల్లింగ్‌

Saturday 17th November 2018

2011 నాటి గరిష్టస్థాయిని తాకిన బేరిష్‌ బెట్స్‌ ముంబై: ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. గడిచిన వారం రోజుల్లో 6.2 శాతం నష్టపోయాయి. శుక్రవారం రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో డిసెంబర్‌ 18తో ముగిసే వెస్ట్ టెక్సాస్ ఇంటర్‌మీడియట్ (డబ్ల్యూటీఐ) బ్యారెల్‌ క్రూడ్‌ ధర 56.83 డాలర్ల వద్ద ముగిసింది. జనవరి 19తో ముగిసే బ్యారెల్‌ బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్ వారంతాన 67 డాలర్ల వద్ద ముగిసింది. సరిగ్గా ఆరు వారాల కిందట

ఫైనాన్స్‌ స్టాక్స్‌పై సెంట్రమ్‌ ఏమంటోంది?

Saturday 17th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా పలు ఫైనాన్స్‌ రంగ షేర్లపై తన సిఫార్సులు తెలియజేసింది. అవేంటో చూద్దాం..  క్యాపిటల్‌ ఫస్ట్‌ ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.546గా నిర్ణయించాం. 12 శాతం వరకు అప్‌సైడ్‌ ఉండొచ్చు. స్టాక్‌ ప్రస్తుత ధర రూ.494గా ఉంది. ప్రస్తుత క్యూ2లో క్యాపిటల్‌ ఫస్ట్‌ లోన్‌ బుక్‌ వార్షికంగా 42 శాతం వృద్ధితో రూ.32,622 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం, ప్రి-ప్రొవిజనింగ్‌ ప్రాఫిట్‌,

Most from this category