STOCKS

News


ఎన్‌సీసీలో 90% అప్‌సైడ్‌కు ఛాన్స్‌!!

Monday 19th November 2018
Markets_main1542617679.png-22187

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఎన్‌సీసీపై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
స్టాక్‌: ఎన్‌సీసీ
రేటింగ్‌: కొనొచ్చు
ఇండస్ట్రీ: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
ప్రస్తుత ధర: రూ.88
టార్గెట్‌ ప్రైస్‌: రూ.168

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఎన్‌సీసీపై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.168గా నిర్ణయించింది. ప్రస్తుత ధర రూ.88తో పోలిస్తే దాదాపు 90 శాతం అప్‌సైడ్‌కు అవకాశముందని పేర్కొంది. కంపెనీ ప్రస్తుత క్యూ2లో బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిందని తెలిపింది. నికర లాభం అంచనాలు మించిందని పేర్కొంది. ఈబీటా మార్జిన్లు వార్షికంగా 11.8 శాతానికి పెరిగాయని తెలిపింది. మాన్‌సున్‌ క్వార్టర్‌ సాధారణంగా బలహీనంగా ఉంటుందని అయినా కూడా కంపెనీ మంచి పనితీరు కనబర్చిందని పేర్కొంది. నికరంగా చూస్తే రుణ భారం తగ్గిందని తెలిపింది. ఆర్బిట్రేషన్‌ క్లెయిమ్స్‌ రావాల్సి ఉన్నాయని పేర్కొంది. బ్యాలెన్స్‌ షీటు బలంగా ఉందని తెలిపింది. 

కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1542617691NCC_-_2QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

ఎన్‌ఎండీసీకి జేపీ మోర్గాన్‌ బై రేటింగ్‌

Monday 19th November 2018

దొనిమలై మైనింగ్‌ ప్లాంట్‌ ఐరన్‌ ఓర్‌ అమ్మకాలపై కర్ణాటక ప్రభుత్వం అధిక పన్నును విధించినప్పటికి ఎన్‌ఎండీసీ షేరుకు ప్రముఖ రేటింగ్‌ సంస్థ జేపీమోర్గాన్‌ బై రేటింగ్‌ను కేటాయించింది. ఎన్‌ఎండీసీ సంస్థ దొనిమలై మైనింగ్‌ నుంచి ఏడాదికి 6మిలియన్‌ టన్నుల ఖనిజం ఉత్పత్తవుతుంది. అయితే ఈ మైనింగ్‌ లైసెన్సు పొడిగింపునకు ఎన్‌ఎండీసీపై కర్నాటక ప్రభుత్వం...ఫీజుపై 80 శాతం ప్రీమియం విధించింది.  ఈ ప్రీమియం చెల్లింపునకు ఎన్‌ఎండీసీ ఇప్పటివరకూ అంగీకారం తెలపలేదు. ప్రీమియం చెల్లించకపోతే

అరబిందో టార్గెట్‌.. 875

Monday 19th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా అరబిందో ఫార్మాపై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: అరబిందో ఫార్మా రేటింగ్‌: కొనొచ్చు ఇండస్ట్రీ: ఫార్మా ప్రస్తుత ధర: రూ.794 టార్గెట్‌ ప్రైస్‌: రూ.875 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. అరబిందో ఫార్మాపై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.875గా నిర్ణయించింది. అరబిందో ఫార్మా ప్రస్తుత క్యూ2 ఎర్నింగ్స్‌ అంచనాలు మించాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో హైబేస్‌ ఉన్నా

Most from this category