STOCKS

News


కేపీఐటీకి ‘బై’ రేటింగ్‌

Saturday 27th October 2018
Markets_main1540623271.png-21533

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఐటీ కంపెనీ కేపీఐటీ టెక్నాలజీస్‌పై బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింంది. ఈ స్టాక్‌ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.285గా నిర్ణయించింది. కంపెనీ క్యూ2 ఎర్నింగ్స్‌ ఆరోగ్యకరంగా ఉన్నాయని తెలిపింది. రెవెన్యూ అంచనాలకు అనుగుణంగా ఉంటే, లాభదాయకత అంచనాలను మించిందని పేర్కొంది. రానున్న కాలంలో మార్జిన్లు పెరిగే అవకాశముందని అంచనా వేసింది. కంపెనీ రెవెన్యూ గైడెన్స్‌ను స్థిరంగా కొనసాగించడం, ఈబీటా మార్జిన్‌ గైడెన్స్‌ పెంచడం సానుకూల అంశాలని తెలిపింది. కేపీఐటీ-బిర్లాసాఫ్ట్‌ మెర్జర్‌-డీమెర్జర్‌ వచ్చే 3 నెలల కాలంలో పూర్తి కావొచ్చని పేర్కొంది. పీఈఎస్‌లో బలమైన వృద్ధి నమోదు కావొచ్చని కంపెనీ అంచనా వేస్తోందని తెలిపింది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1540623281KPIT_Technologies_-_2QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

జ్యోతి ల్యాబ్స్‌ను హోల్డ్‌ చేయవచ్చు: జియోజిత్‌

Saturday 27th October 2018

ముంబై:- ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ జియోజిత్‌.. ఎఫ్‌ఎంసీజీ సంస్థ జ్యోతి ల్యాబొరేటరీస్ షేరును హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. దేశీయ ఎంఫ్‌సీజీ సంస్థగా పేరుగాంచిన జ్యోతి ల్యాబ్స్‌.. దోమల, క్రిమికీటకాల నిరోధకాలతో పాటు డిష్‌ వాషింగ్‌, ఫ్యాబ్రిక్‌, పర్సనల్‌ సంరక్షణ ఉత్పత్తులను తయారీ చేస్తుంది. ఇటీవలే కంపెనీ తమ ఉత్పత్తులపై ధరలు పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉండటం కంపెనీ షేరుకు కలిసొచ్చే అంశమని జియోజిత్‌ అంటోంది.

2 కొనొచ్చు.. 1 హోల్డ్‌ చేయొచ్చు..

Saturday 27th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌.. బజాజ్‌ ఆటో, డీబీ కార్ప్‌ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. అలాగే జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను హోల్డ్‌ చేయవచ్చని సూచించింది. ఎందుకో చూద్దాం..  బజాజ్‌ ఆటో కంపెనీ క్యూ2 ఎర్నిం‍గ్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని సెంట్రమ్‌ పేర్కొంది. బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నామని తెలిపింది. అయితే టార్గెట్‌ ప్రైస్‌ను రూ.3,167 నుంచి రూ.3,075కి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. స్టాక్‌ ప్రస్తుత ధర రూ.2,513తో పోలిస్తే 22 శాతం అప్‌సైడ్‌కు ఛాన్స్‌

Most from this category