STOCKS

News


సైయంట్‌పై హెచ్‌డీఎఫ్‌సీ పాజిటివ్‌..

Saturday 20th October 2018
Markets_main1540028338.png-21322

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా సైయంట్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
స్టాక్‌: సైయంట్‌
రంగం: ఐటీ
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.653
టార్గెట్‌ ప్రైస్‌: రూ.850

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. సైయంట్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) బలమైన పనితీరు కనబర్చిందని పేర్కొంది. రెవెన్యూ పరంగా కానీ, మార్జిన్‌ పరంగా కానీ అదిరిపోయే ఎర్నింగ్స్‌ను ప్రకటించిందని తెలిపింది. సర్వీసెస్‌ విభాగంలో రెండంకెల వృద్ధికి కంపెనీ కట్టుబడి ఉందని పేర్కొంది. ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ విభాగాల్లో రికవరీ సహా కమ్యూనికేషన్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, సెమీ-కండక్టర్‌ విభాగాల్లో వృద్ధి కొనసాగింపు వంటివి సానుకూల అంశాలని తెలిపింది. స్థిర భవిష్యత్‌ వృద్ధి అంచనాలు, అధిక మార్జిన్‌ గైడెన్స్‌, క్యాష్‌ కన్వర్షన్‌ మెరుగుదల, ఆరోగ్యకరమైన రిటర్న్‌ రేషియో, ఆమోదయోగ్యమైన వ్యాల్యుయేషన్స్‌ వంటి అంశాల నేపథ్యంలో ఈ స్టాక్‌పై బై రేటింగ్‌ కొనసాగిస్తున్నామని వివరించింది. రూ.850 టార్గెట్‌ ప్రైస్‌తో సైయంట్‌ను కొనొచ్చని సిఫార్సు చేసింది. సమీప కాలంలో సీజన్‌ కారణంగా వృద్ధి నెమ్మదించొచ్చని పేర్కొంది. కరెన్సీ క్షీణత కారణంగా మార్జిన్‌ పెరగొచ్చని తెలిపింది. 

కంపెనీ వివరాలు, పనితీరు సంబంధిత ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1540028350Cyient_-_2QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

డీసీబీ బ్యాంక్‌పై బుల్లిష్‌..

Saturday 20th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా డీసీబీ బ్యాంక్‌పై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: డీసీబీ బ్యాంక్‌ ఇండస్ట్రీ: బ్యాంక్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.157 టార్గెట్‌ ప్రైస్‌: రూ.209 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. డీసీబీ బ్యాంక్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆకర్షణీయ ఫలితాలను వెల్లడించిందని పేర్కొంది. మరీముఖ్యంగా రుణ నాణ్యత స్థిరంగా కొనసాగించిందని

ఎంఫసిస్‌ కొనొచ్చు..

Saturday 20th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఐటీ కంపెనీ ఎంఫసిస్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో ఒకసారి చూద్దాం..  బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఎంఫసిస్‌ రేటింగ్‌: కొనొచ్చు రంగం: ఐటీ ప్రస్తుత ధర: రూ.1,067 టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,430 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఎంఫసిస్‌పై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. కంపెనీ క్యూ2 ఆర్థిక ఫలితాలు ఆకట్టుకున్నాయని తెలిపింది. ఆదాయం, నిర్వహణ పనితీరు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని పేర్కొంది. కంపెనీ నికర

Most from this category