STOCKS

News


ఆటో రంగ షేర్లపై హెచ్‌డీఎఫ్‌సీ విశ్లేషణ

Tuesday 10th July 2018
Markets_main1531219811.png-18172

గ్రామీణ ప్రాంతం నుంచి డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో ఆటో, ఆటో విడిభాగాల కంపెనీల క్యూ1 ఫలితాలు ఆకర్షణీయంగా ఉండనుండాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనావేసింది. బీఎస్‌ ఫైవ్‌, వస్తు సేవల పన్ను అమలు అనంతరం నూతన వాహనాల విడుదల ఆధారంగా అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, లూమాక్స్‌ ఆటో, జేబీఎమ్‌ ఆటో, జామ్నా ఆటో కంపెనీల షేర్లును సూచించింది. ఈ షేర్లు తమ టాప్‌ పిక్స్‌గా ఉన్నాయని వెల్లడించింది. దాదాపు అన్ని ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చూరర్‌ (ఓఈఎమ్‌) కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు రెండంకెల వృద్ధిరేటును సాధించేందుకు అవకాశం ఉందని విశ్లేషించిన హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. అశోక్ లేలాండ్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన ఏకంగా 51 శాతం పెరిగేందుకు అవకాశం ఉండగా.. బజాజ్ ఆటో ఆదాయం 45 శాతం, మారుతి సుజుకీ ఆదాయం 28 శాతం పెరిగేందుకు అవకాశం ఉందని అంచనావేసింది. టాటా మోటార్స్‌ను మినహాయించి మిగిలిన అన్ని ఓఈఎమ్‌ కంపెనీల ఆదాయం 30 శాతం, ఎబిటిడా 43 శాతం వృద్ధిరేటును నమోదుచేయవచ్చని విశ్లేషించింది. 

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1531219835Auto,_Auto_Anc_-_1QFY19_Results_Preview_-_HDFC_sec.pdf)

You may be interested

సెన్సెక్స్‌ లాభం 305 పాయింట్లు

Tuesday 10th July 2018

3శాతం ర్యాలీ చేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీస్‌, అటో, ఆర్థిక రంగ షేర్ల అండతో మార్కెట్‌ మంగళవారం మూడోరోజూ లాభాలతో ముగిసింది. దేశీయంగానూ, అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతికూల అంశాలు లేకపోవడంతో సూచీలు మంగళవారం ట్రేడింగ్‌ ఆద్యంతం పటిష్టమైన ర్యాలీని చేశాయి. ట్రేడింగ్‌ చివరి గంటలో కొనుగోళ్లు పెరగడంతో ఇంట్రాడేలో హెవీ వెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీ, హెచ్‌డీఎఫ్‌ ద్వయం, ఐటీసీ షేర్లు లాభపడటం సానుకూల ప్రభావాన్ని చూపాయి. చివరికి

దేశీ ఫార్మాపై ట్రంప్‌ హెల్త్‌కేర్‌ ప్రభావం ఉండకపోవచ్చు..!

Tuesday 10th July 2018

ముంబై: దేశీయ జనరిక్ కంపెనీలపై ట్రంప్‌ హెల్త్‌కేర్‌ పాలసీ ప్రభావం ప్రతికూలంగా ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఫార్మా రంగ నిపుణులు కెవాల్ హండ.. ధరల పరంగా మాత్రం ఒత్తిడి ఉండేందుకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. గడిచిన రెండు నెలల కిందట ఒబామా హెల్త్‌కేర్‌ను పూర్తిగా పక్కన పెట్టేందుకు ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఈ చర్య ద్వారా అమెరికన్లకు అత్యంత చౌకగా మందులను అందుబాటులో ఉంచడం తన ఉద్ధేశ్యం

Most from this category